Anchor Suma :  బ్రహ్మాజీ పంచ్‌లకు  తట్టుకోలేక.. సుమ ఏం చేసిందంటే!

ABN , First Publish Date - 2023-12-05T19:26:58+05:30 IST

నితిన్‌ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వం వహించిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌’ ఈ నెల 8న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా ప్రచారంలో భాగంగా నితిన, దర్శకుడు వంశీ, బ్రహ్మాజీ, హైపర్‌ ఆది ‘సుమ అడ్డా ’ షోలో సందడి చేశారు.

Anchor Suma :  బ్రహ్మాజీ పంచ్‌లకు  తట్టుకోలేక.. సుమ ఏం చేసిందంటే!

నితిన్‌ (Nithiin) హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వం వహించిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌’ (Extra ordinary man) ఈ నెల 8న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా ప్రచారంలో భాగంగా నితిన, దర్శకుడు వంశీ, బ్రహ్మాజీ, హైపర్‌ ఆది ‘సుమ అడ్డా ’ షోలో సందడి చేశారు. సుమ తనదైన శైలి పంచ్ లు  వేశారు. బ్రహ్మాజీ, హైపర్‌ ఆది కూడా ఏమాత్రం తగ్గకుండా సుమపై సెటైర్స్  వేశారు. ఈ మధ్యన ఓ ప్రెస్‌ మీట్‌లో స్నాక్స్‌ విషయంలో సుమ వేసిన వైటకారం డైలాగ్‌ విపరీతంగా వైరల్‌ అయిన సంగతి తెలిసిందే!

ఆ విషయాన్ని గుర్తు చేస్తూ సుమను ఆట పట్టించారు బ్రహ్మాజీ, ఆది. దానికి బ్రహ్మాజీగారు మరీ తింటున్నారు.. పళ్ల సెట్‌ చూసుకోండి కాస్త’ అంటూ పంచ్ పేల్చింది సుమ. దానికి కౌంటర్‌గా బ్రహ్మాజీ 'సుమగారు ఇది స్నాక్స్‌.. భోజనం కాదు’ అని డైలాగ్‌ వదిలాడు. దాంతో సుమ మాట్లాడలేక నవ్వుకుంది. అంతే కాదు. సమయం వచ్చిన ప్రతిసారీ అదే డైలాగ్‌ కొట్టడంతో సుమ మాట్లాడలేక తనలో తానే నవ్వుకుంది. బ్రహ్మాజీ పంచ్‌లకు నితిన్‌ నవ్వాపుకోలేకపోయారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. 

Updated Date - 2023-12-05T19:26:59+05:30 IST