Brahmaji : లోకేష్‌ కనకరాజ్‌ సినిమాలో అవకాశం అంటూ మోసం..!

ABN , First Publish Date - 2023-10-05T16:50:59+05:30 IST

సినిమాపై ఆసక్తితో ఇండస్ట్రీకి  వచ్చి అవకాశాల వేటలో ఉన్న ఈతరం ఆర్టిస్ట్‌లను టార్గెట్‌ చేసుకుని జరుగుతోన్న స్కామ్‌ (Scams) గురించి నటుడు బ్రహ్మాజీ (Brahmaji) ట్వీట్లు చేశారు.

Brahmaji : లోకేష్‌ కనకరాజ్‌ సినిమాలో అవకాశం అంటూ మోసం..!

సినిమాపై ఆసక్తితో ఇండస్ట్రీకి  వచ్చి అవకాశాల వేటలో ఉన్న ఈతరం ఆర్టిస్ట్‌లను టార్గెట్‌ చేసుకుని జరుగుతోన్న స్కామ్‌ (Scams) గురించి నటుడు బ్రహ్మాజీ (Brahmaji) ట్వీట్లు చేశారు. తాము స్టార్‌ దర్శకుల వద్ద పని చేస్తున్నామంటూ కొందరు వ్యక్తులు యువ నటులకు మెసేజ్‌లు పంపిస్తున్నారని, ఆ వంకతో డబ్బు గుంజాలని చూస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ విషయంలో తస్మాత జాగ్రత్త అని బ్రహ్మాజి సూచించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌లో ఓ పోస్ట్‌ పెట్టారు.

‘‘నటరాజ్‌ అన్నాదొరై అనే వ్యక్తి.. దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌ మేనేజర్‌నని చెబుతూ పలువురు యువతీ యువకులకు మెేసజ్‌లు, ఫోన్‌కాల్స్‌ చేస్తున్నాడు. లోకేశ్‌ తెరకెక్కించే తదుపరి చిత్రానికి వారి ప్రొఫైల్‌ ఎంపికైందని.. డబ్బులిేస్త ఆడిషన్‌కు అవసరమైన కాస్ట్యూమ్స్‌ తాను రెంట్‌కు తీసుకువస్తానని.. ఆడిషన్‌ పూర్తయ్యాక ఆ డబ్బులు వాపస్‌ ఇచ్చేస్తానని నమ్మిస్తున్నాడు. అలాగే సత్యదేవ్‌ అనే మరో వ్యక్తి తాను ఫోర్బ్స్‌ మ్యాగజైన్‌ జర్నలిస్ట్‌నని చెబుతూ డబ్బులు గుంజడానికి ప్రయత్నిస్తున్నాడు. సినీ పరిశ్రమలోకి రావాలని కలలుకనే కొత్తతరం నటులను టార్గెట్‌గా చేసుకుని వీళ్లు ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నారు. ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి’’ అని బ్రహ్మాజీ వరుసలగా ట్వీట్లు చేశారు.

Updated Date - 2023-10-05T16:50:59+05:30 IST