సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Bindu Madhavi: ఆమె మాజీ అయ్యాకే డేటింగ్‌ చేశా!

ABN, First Publish Date - 2023-05-07T18:14:50+05:30

Bindu Madhavi Dating with Trisha Ex boyfriend, ఆమె మాజీ అయ్యాకే డేటింగ్‌ చేశా!

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నటి త్రిష బాయ్‌ఫ్రెండ్‌తో (Trisha Ex boy friend) తాను డేటింగ్‌ చేసినట్లు నటి బిందు మాధవి (Bindu madhavi) చెప్పారు. తాజాగా ఆమె నటించిన ‘న్యూసెన్స్‌’ (Newsense) ప్రమోషన్స్‌లో భాగంగా ఆమె మీడియాతో మాట్లాడారు. గూగుల్‌ కొందరు అడిగిన ప్రశ్నలను యాంకర్‌ వేదికపై చిత్ర బృందాన్ని అడిగారు. అందులో యాంకర్‌ నేరుగా బింధు మాధవి డేటింగ్‌ గురించి ప్రశ్నించింది. త్రిష లవర్‌తో మీర్‌ డేట్‌లో ఉన్నారటగా అని ప్రశ్నించగా ఆమె ఒక్క క్షణం మాట్లాడలేకపోయింది. తల పట్టుకుని ‘అతనితో డేట్‌ చేసిన విషయం నిజమే అని తెలిపింది. అయితే ఇద్దరం ఒకేసారి అతనితో డేట్‌ చేయలేదని, వారిద్దరికీ బ్రేకప్‌ అయ్యాక అని క్లారిటీ ఇచ్చింది బిందు మాధవి.

ఇదే వేదికపై నటుడు నవదీప్‌ (navadeep) కూడా తనపై వచ్చిన ఓ వదంతును ఖండించారు. ‘‘2005లో నా వల్ల ఒక హీరోయిన్‌ మృతి చెందిందని వార్తలొచ్చాయి. అందులో నిజం లేదు. అలాగే, కొన్నేళ్ల క్రితం నా ఫామ్‌హౌస్‌లో నేనొక రేవ్‌ పార్టీ ఏర్పాటు చేశానని.. పోలీసులు రావడంతో నేను గోడ దూకి పారిపోయానని వార్తలు వచ్చాయి. నిజం చెప్పాలంటే ఆరోజు మా ఫామ్‌ హౌస్‌లో ఎలాంటి రేవ్‌ పార్టీ జరగలేదు. ఫ్యామిలీ మొత్తం గెట్‌టుగెదర్‌ అయ్యాం. చిన్న పార్టీ చేసుకుని, రాత్రి భోజనం అవ్వగానే ఎవరి ఇళ్లకు వాళ్లు వెళ్లిపోయాం. మా అమ్మ కూడా నాతోనే ఉన్నారు. తరువాత రోజు పొద్దున్నే నా గురించి టీవీల్లో వార్తలు హల్‌చల్‌ చేశాయి. వాటిని చూసి అమ్మ షాక్‌ అయింది. కొన్నిసార్లు ఇలాంటివి మామూలే అని అమ్మకూ తెలిసింది. ఇదే వేదికపై నవదీప్‌ పెళ్లి ప్రస్తావన కూడా వచ్చింది. ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని తెలిపారు. అల్లు అర్జున్‌ పుష్ప-2లో నటిస్తున్నారనే వార్తలొస్తున్నాయన్న వార్తలు నెట్టింట చక్కరు కొడుతున్నాయి. ఇది నిజమేనా అని ప్రశ్నించగా ‘పుష్ప-2’లో నటించడం లేదని చెప్పారు. ‘మస్తీస్‌’ తర్వాత నవదీప్‌ - బిందుమాధవి కాంబోలో వస్తోన్న ‘న్యూసెన్స్‌’ వెబ్‌ సిరీస్‌ ఆహా వేదికగా ఈ నెల 12 స్ర్టీమింగ్‌ కానుంది.

Updated Date - 2023-05-07T18:21:10+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!