BiggBoss 7 : తేజ అవుట్‌.. శోభా శోకం.. ఆదివారం ఏం జరిగిందంటే!

ABN , First Publish Date - 2023-11-06T11:27:59+05:30 IST

బిగ్‌బాస్‌ హౌస్‌లో తొమ్మిదో వారం ఎలిమినేషన పూర్తయింది. టేస్టీ తేజ ఈ వారం ఎలిమినేట్‌ అయ్యి ఇంటి నుంచి బయటికొచ్చాడు. ఎలిమినేషన్ ప్రక్రియలో చివరికి తేజ, యావర్‌, రతిక మిగిలారు. వీరిలో ఎవరు ఎలిమినేట్‌ అవుతారో అనే టెన్షన్ పడ్డారు వీక్షకులు. అయితే టేస్టీ తేజ ఎలిమినేట్‌ అవుతాడనే విషయం ముందుగానే లీక్‌ అయింది.

BiggBoss 7 : తేజ అవుట్‌.. శోభా శోకం.. ఆదివారం ఏం జరిగిందంటే!

బిగ్‌బాస్‌ హౌస్‌లో (biggboss7) తొమ్మిదో వారం ఎలిమినేషన పూర్తయింది. టేస్టీ తేజ ( Tasty teja) ఈ వారం ఎలిమినేట్‌ అయ్యి ఇంటి నుంచి బయటికొచ్చాడు. ఎలిమినేషన్  ప్రక్రియలో చివరికి తేజ, యావర్‌, రతిక మిగిలారు. వీరిలో ఎవరు ఎలిమినేట్‌ అవుతారో అనే టెన్షన్  పడ్డారు వీక్షకులు. అయితే టేస్టీ తేజ ఎలిమినేట్‌ అవుతాడనే విషయం ముందుగానే లీక్‌ అయింది.  రతిక తానెక్కడ ఎలిమినేట్‌ అవుతుందోనని భయపడిపోయింది. మహానటి స్టైల్లో ప్లీజ్‌, ఒక్క ఛాన్స్ ఇవ్వండి.. సర్‌ అని నాగ్‌ను వేడుకొంది. ఫైనల్‌గా తేజ ఎలిమినేట్‌ అని అనౌన్స్ చేయడంతో ఊపిరి పీల్చుకుంది.

అసలు ఆదివారం షోలో ఏం జరిగిందో చూద్దాం...
ఎలిమినేషన్స్ లో ఉన్న కొందరిని నాగార్జున సేవ్‌ చేశారు. చివరికి యావర్‌, తేజ, రతిక మిగిలారు. వారికి ఓ టాస్క్‌ ఇచ్చారు.  ఒక పుట్ట తెచ్చి అందులో ముగ్గురిని చేయి పెట్టమన్నారు నాగ్‌. పాము ఎవరి చేతికి వస్తే వాళ్లు సేఫ్‌.. తాడు వస్తే నాట్‌ సేఫ్  అన్నారు. అప్పటికే రతిక గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. సార్‌.. సార్‌ అంటే ఓవర్ చేయడం  మొదలుపెట్టింది, ఏమైందమ్మా అని నాగ్‌ అడిగితే నిశ్శబ్ధంగా నిలబడింది. అందులో యావర్‌ సేఫ్‌ అయ్యాడు. ఎవరు ఎలిమినేట్‌ అన్నది ప్రకటించకుండానే రతిక ఏడుపు రాగాలు మొదలుపెట్టింది. సార్‌.. ప్లీజ్‌  నన్ను పంపించొద్దు.. ఒక వీక్‌ ఉంచండి.. అంటూ  కన్నీళ్లు పెట్టుకుంది. 'అది నా చేతుల్లో లేని పనమ్మా. ఇప్పటికే డిసైడ్‌ అయిపోయింది.. నేను చెప్పడం మాత్రమే మిగిలింది’ అని నాగార్జున చెప్పారు.  అనౌన్స్‌ చేసే సమయంలో రతిక కళ్లు మూసుకుంది. అప్పటికే 'నువ్వు ఉంటావ్‌ పాప.. నేనే ఎలిమినేట్‌ అవుతాను’ అంటూ తేజ ధైర్యంగా చెప్పాడు. తేజ చెప్పిందే జరిగింది. ఊహించినట్లుగానే తేజ ఎలిమినేట్‌ అంటూ నాగ్‌ వెల్లడించారు. దీంతో రతిక ఊపిరి పీల్చుకుంది.  ఇప్పుడు నేను గేమ్‌ ఆడతాను.. ప్లీజ్‌ నన్ను సపోర్ట్‌ చేయండి అంటూ ఆడియన్స్ ని  వేడుకొంది. తేజ నవ్వుతూ బై బై చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. అయితే దానికి ముందు  శోభాశెట్టి, ప్రియాంక.. తేజను చూసి ఏడ్చేయడంతో కాస్త భావోద్వేగానికి గురయ్యాడు తేజ. శోభాశెట్టి అయితే బాగా ఏడ్చింది.  నువ్వు లేకుండా ఎలా ఉండాలో తెలియట్లేదు, భయమేస్తోంది తేజ అంటూ శోకించింది. నీతో ఒక్కరోజు మాట్లాడకుండా ఉన్నందుకే ఏదోలా ఉంది.. అలాంటిది నువ్వు లేకుండా హౌస్‌లో చాలా రోజులు ఉండాలంటే భయమేస్తోంది అని కన్నీళ్లు పెట్టుకుంది.

Rathika.jpg

నాగార్జున కొన్ని సామెతలు ఇచ్చి అది ఎవరికి బాగా సూటవుతుందో చెప్పాలన్నారు. అమర్‌ది కుక్క తోక వంకర అన్నాడు భోలే షావలి.  ప్రశాంత్‌ ఏకులా వచ్చి మేకులా తగిలాడన్నాడు అర్జున్‌.  తేజ ఏమీ లేని ఆకులా ఎగిరెగిరిపడతాడని చెప్పాడు ప్రశాంత్‌. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందనే సామెత అశ్వినికి బాగా సూటవుతుందని అభిప్రాయపడింది పియాంక. గాడిదకేం తెలుసు గంధపు చెక్క వాసన అనే బోర్డును అశ్విని మెడకు తగిలించాడు అమర్‌. భోలే షావలిది ఓడ ఎక్కేవరకు ఓడ మల్లన్న.. ఓడ దిగాక బోడ మల్లన్న అని పేర్కొంది రతిక. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం అనేది రతిక విషయంలో నిజమైందని గౌతమ్‌ చెప్పాడు. పొరుగింటి పుల్లకూర రుచి అనే బోర్డు షావలికి తేజ. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభమనే బోర్డు శివాజీకి వేశాడు ప్రిన్స్‌ యావర్‌. వేలు ఇస్తే చేయి గుంజినట్లు అనే బోర్డును ప్రియాంక మెడలో వేసింది అశ్విని. కందకు లేని దురద కత్తిపీటకు ఎందుకు? అనే సామెత తేజకు పర్ఫెక్ట్‌గా సరిపోతుందని శివాజీ అన్నారు.. ఇటు రా అంటే ఇల్లంతా నాదే అన్నట్లుగా తేజ ప్రవర్తిస్తాడు అంటోంది శోభాశెట్టి. 

ఎలిమినేట్‌ అయ్యి బయటికి వచ్చాక తేజ ఇంటి సభ్యులకు  మార్కులు ఇచ్చాడు. శోభాకు పదికి 20 మార్కులిచ్చాడు. గౌతమ్‌కు 8, భోలే షావళికి 7 మార్చులిచ్చాడు,  అర్జున్‌కు 8 మార్కులిచ్చాడు. ప్రిన్స్‌ యావర్‌కు 10, ఆటపరంగా ఓకే కానీ మాట తీరు మార్చుకోవాలంటూ అశ్వినికి 8 ఇచ్చాడు. ఓటమిని తీసుకోలేడంటూ ప్రశాంత్‌కు 9, ప్రియాంకకు 10, అమర్‌దీప్‌కు 9, శివాజీకి 8, రతికకు 5 మార్కులిచ్చాడు.Updated Date - 2023-11-06T12:38:08+05:30 IST