Biggboss 7 Winner : నెటిజన్లతోపాటు అశ్విని కూడా తేల్చేసింది! 

ABN , First Publish Date - 2023-11-26T17:28:58+05:30 IST

బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 7 (biggboss 7) గ్రాండ్‌ ఫినాలేకి చేరుకోనుంది. డిసెంబర్‌ 17 ఆదివారం  గ్రాండ్‌ ఫినాలే మొదలుకానుంది. ప్రస్తుతం టైటిల్‌ గెలిచేది ఎవరన్న దానిపై చర్చ నడుస్తోంది. అయితే ఈ సీజన్‌  (Season winner) విన్నర్‌ ఎవరనే దానిపై ప్రేక్షకులు ఓ అభిప్రాయానికి వచ్చారు

Biggboss 7 Winner : నెటిజన్లతోపాటు అశ్విని కూడా తేల్చేసింది! 

బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 7 (biggboss 7) గ్రాండ్‌ ఫినాలేకి చేరుకోనుంది. డిసెంబర్‌ 17 ఆదివారం  గ్రాండ్‌ ఫినాలే మొదలుకానుంది. ప్రస్తుతం టైటిల్‌ గెలిచేది ఎవరన్న దానిపై చర్చ నడుస్తోంది. అయితే ఈ సీజన్‌  (Season winner) విన్నర్‌ ఎవరనే దానిపై ప్రేక్షకులు ఓ అభిప్రాయానికి వచ్చారు. రైతు బిడ్డగా బిగ్‌బాస్‌ హౌస్‌లోకి అడుగుపెట్టిన తనదైన శైలి ఆటతో అలరించిన పల్లవి ప్రశాంత్‌ ఈ సీజన్‌ విన్నర్‌ అవుతాడని, టైటిల్‌ తనదేనని అభిమానులు, బిగ్‌బాస్‌ ఫాలోయర్లు చెబుతున్నారు. రన్నర్‌గా శివాజీ నిలుస్తారని సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఇదిలా ఉండగా రెండు రోజులు సీరియల్‌ నటుడు అమర్‌దీప్‌ గ్రాఫ్‌ పెరిగింది. టైటిల్‌ కొట్టాలనే తపనతో ఇంటిలో అడుగుపెట్టిన అమర్‌ కొద్దివారాలపాటు ఆడింది ఏమీ లేదు. వీక్‌ కంటెస్టెంట్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ మూడు వారాలుగు అతని పెర్‌ఫార్మన్స్ తో  ఓటింగ్‌ పెరిగింది. దాంతో అతనికి కూడా విన్నర్‌ అయ్యే ఛాన్స్  ఉందని చెబుతున్నారు. కానీ అది అసాధ్యమని కూడా నెటిజన్లే అంటున్నారు.  (Pallavi prasanth)

Untitled-1.jpg

ఈ వారం డబుల్‌ ఎలిమినేషన్  ద్వారా రతిక, అశ్విని బయటకు వచ్చారు. ఇంటి సభ్యుల గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది. ఇంటి సభ్యులు రెండు గ్రూప్‌లుగా విడిపోయారని అందులో ఏకాకిగా నిలిచింది తానేనని అశ్విని భావోద్వేగానికి లోనైంది. నామినేట్‌ చేయడానికి ఎవరి పేరు కనిపించక తనకి తానే సెల్ఫ్‌ నామినేషన్‌కి వెళ్లడమే తప్పైపోయింది అని చెబుతోంది. అంతే కాదు ఈ సీజన్‌  విన్నర్‌ ఎవరో కూడా చెప్పింది.  బిగ్‌ బాస్‌ సీజన్‌ 7 విన్నర్‌ గా పల్లవి ప్రశాంత్‌ టైటిల్‌ గెలుచుకుంటాడని, రన్నర్‌ గా శివాజీ ఉంటాడని చెప్పింది. సోషల్‌ మీడియా అనుకుంటున్నదే అశ్విని కూడా చెప్పడంతో పల్లవి ప్రశాంత ఫాలోయర్లు ఆనందిస్తున్నారు. దీనిని బట్టి సీజన్‌  7 విన్నర్‌ పల్లవి ప్రశాంత్  సొంతం అని నెటిజన్లు భావిస్తున్నారు. 

Pallavi.jpg

Updated Date - 2023-11-26T17:28:59+05:30 IST