Biggboss 7: ఇంటి సభ్యులు...ఎవరెవరు.. ఎంట్రీ ఎలా ఉందంటే..

ABN , First Publish Date - 2023-09-03T20:00:44+05:30 IST

బుల్లితెర బిగ్‌ షో ‘బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్‌ 7’ అలరించడానికి సిద్ధమైంది. కింగ్‌ నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తన్న ఈ షో ఉల్టా-పుల్టాగా సాగనుందని ఇప్పటికీ నాగార్జున వెల్లడించారు. సీజన్‌-7 ఆదివారం మొదలైంది.

Biggboss 7:   ఇంటి సభ్యులు...ఎవరెవరు.. ఎంట్రీ ఎలా ఉందంటే..

బుల్లితెర బిగ్‌ షో ‘బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్‌ 7’ అలరించడానికి సిద్ధమైంది. కింగ్‌ నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తన్న ఈ షో ఉల్టా-పుల్టాగా సాగనుందని ఇప్పటికీ నాగార్జున వెల్లడించారు. సీజన్‌-7 ఆదివారం మొదలైంది. ఒక్కొక్క ఇంటి సభ్యులను బిగ్‌బాస్‌ హౌస్‌లోకి పంపించనున్నారు. అయితే ఈ ప్రక్రియ శనివారం పూర్తయింది. ఆదివారం ప్రసారమవుతోంది. ఇంతకీ హౌస్‌లోకి ఎవరెవరు వెళ్లారు.. నాగార్జున వారిని ఎలా ఆహ్వానించారు అన్నదానిపై లుక్కేద్దాం...

బిగ్‌ బాస్‌ ఏడో సీజన్‌ ఆదివారం ప్రారంభమైంది. నాగార్జున మంచి డాన్స్‌ పెర్ఫార్మెన్స్‌తో ఎంట్రీ ఇచ్చారు. ‘తార్‌ మార్‌ తక్కర్‌ మార్‌’ పాటకు నాగ్‌ స్టెప్పులేశారు. ఇప్పటి వరకు జరిగిన సీజన్‌ల కంటే ఈ సీజన్‌ కొత్తగా. వైవిధ్యంగా ఉంటుందని నాగార్జున తెలిపారు. ఈ సీజన్‌లో కంటెస్టెంట్లు హౌస్‌లో ఉండడం అంత ఈజీ కాదని అన్నారు. ‘పవర్‌ అస్త్ర’ ఎవరు దక్కించుకుంటారో వాళ్లే హౌస్‌లోకి వెళ్తారన్నారు. తొలి కంటెస్టెంట్‌గా టీవీ నటి, ‘జానకి కలగనలేదు’ ఫేమ్‌ ప్రియాంక జైన్‌ ఎంట్రీ ఇచ్చారు.

బిగ్‌ బాస్‌ 7 కంటెస్టెంట్స్‌ వీరే

1. ప్రియాంక జైన్‌ (టీవీ నటి)

Priyanka-jain.jpg

2. ఆర్టిస్ట్‌ శివాజీ

Shivaji.jpg

3. సింగర్‌ దామిని (పచ్చ బొట్టేసిన)

Damini.jpg

4. మోడల్‌ ప్రిన్‌ యావర్‌

Yavar.jpg

శివాజీ మాట్లాడుతూ ‘‘నటుడిగా 96 సినిమాలు చేశా. ఎన్నో చూశా. ఇది కూడా చూడాలనిపించింది. జైల్‌ అనేది చూడలేదు. ‘బిగ్‌బాస్‌’ హౌస్‌ కూడా చూడాలని ఇలా వచ్చా. నా కెరీర్‌ అన్నపూర్ణ సంస్థ ఇచ్చిన చెక్కుతో మొదలైంది. సెకెండ్‌ ఇన్నింగ్స్‌ కూడా నాగార్జునగారితో మొదలు కావడం ఆనందంగా ఉంది. అప్పట్లో సీతారామరాజు’ సినిమాకు ఎక్స్‌ట్రాగా పని చేసినందుకు నాగార్జునగారు పాతికవేలు ఎక్కువ ఇచ్చారు. ఆ డబ్బుతోపాటు ‘మాస్టర్‌’ సినిమాకు అల్లు అరవింద్‌గారు ఇచ్చిన డబ్బుతో ఓ స్థలం కొన్నాను. అది ఈరోజు చాలా విలువైంది. మాకు ఎలాంటి ఆస్తులు లేవు. చాలా పేద కుటుంబం. అమ్మ కోడి పిల్లల్ని అమ్మి సంక్రాంతి పండుగకు బట్టలు కొనేది. అలాంటి స్థితి నుంచి ఏ నేపథ్యం లేని సినిమాల్లోకి వచ్చాను’’ అని అన్నారు.


  1. శుభశ్రీ (లాయర్ -యాక్టర్)

  2. Shuba-sri.jpgమొదటి అయిదుగురు ఇంటి సభ్యులు నాగార్జున ఇచ్చిన ఆఫర్ ను తిరస్కరించారు. మొదటి కంటెస్టెంట్ తో హౌస్ లోకి పంపిన సూటుకేసు లో ఉన్న 35 లక్షలు తీస్కుని ఇంట్లో నుంచి వెళ్లిపోవచ్చని నాగ్ అవకాశం ఇచ్చారు. మేము ఆడటానికి వచ్చాం అని ఇంటి సభ్యులు తిరస్కరించారు.


6 . షకీలా

Shakeela.jpg

7.ఆట సందీప్

Aata-sundeep.jpg

8 . శోభా శెట్టి (సీరియల్ ఆర్టిస్ట్)

Shibha-shetty.jpg

9.టేస్టీ తేజ

Tasty-teja.jpg

10. రథిక రోజ్ (సినీ నటి)

Rathika-Rise.jpg

11. డాక్టర్‌ గౌతమ్‌ కృష్ణ 

Goutham krishna.jpg

12కిరణ్‌ రాథోడ్‌ 


Kiran rathod.jpg


13. పల్లవి ప్రశాంత్‌

Pllavi prashanth.jpg

14. అమర్‌దీప్‌

Untitled-1.jpg

Updated Date - 2023-10-27T14:47:37+05:30 IST