Biggboss Elimination : చివరి వరకూ ఉంటాడనుకున్నారు కానీ..

ABN , First Publish Date - 2023-10-30T10:41:54+05:30 IST

బిగ్‌బాస్‌ - 7 (biggboss 7)ఉల్టా-పుల్టా సీజన్ ఎనిమిదో వారం ఎలిమినేషన్ పూర్తయింది. కొరియోగ్రాఫర్‌ సందీప్‌ (aata sandeep)ఎలిమినేట్‌ అయి ఇంటి నుంచి బయటకు వచ్చారు. శోభాశెట్టి, శివాజీ, అశ్విని, భోలె షావలి, ప్రియాంక, అమర్‌దీప్‌, సందీప్‌, గౌతమ్‌ ఉండగా ఫైనల్‌ రౌండ్‌కు వచ్చేసరికి సందీప్‌, శోభాశెట్టి మిగిలారు.

Biggboss Elimination : చివరి వరకూ ఉంటాడనుకున్నారు కానీ..

బిగ్‌బాస్‌ - 7 (biggboss 7)ఉల్టా-పుల్టా సీజన్ ఎనిమిదో వారం ఎలిమినేషన్ పూర్తయింది. కొరియోగ్రాఫర్‌ సందీప్‌ (aata sandeep)ఎలిమినేట్‌ అయి ఇంటి నుంచి బయటకు వచ్చారు. శోభాశెట్టి, శివాజీ, అశ్విని, భోలె షావలి, ప్రియాంక, అమర్‌దీప్‌, సందీప్‌, గౌతమ్‌ ఉండగా ఫైనల్‌ రౌండ్‌కు వచ్చేసరికి సందీప్‌, శోభాశెట్టి మిగిలారు. వీరిద్దరిని ఒక గదిలో కూర్చొబెట్టి వాళ్ల చేతులకు ప్యాచ్‌ను అతికించుకోమన్నారు నాగార్జున. కౌంట్‌డౌన్‌ మొదలయ్యాక ఇద్దరీ హార్ట్‌ బీట్‌ టీవీపై కనిపిస్తుందని.. ఎవరీ హార్ట్‌ బీట్‌ అయితే కంటిన్యూ అవుతుందో వాళ్లు సేఫ్ , హార్ట్‌ బీట్‌ ఆగిన పోయిన వారు ఎలిమినేట్‌ అవుతారని సెలవిచ్చారు. సందీప్‌ హార్ట్‌ బీట్‌ ఆగిపోయినట్లు చూపించడంతో హౌస్‌ నుంచి ఎలిమినేట్‌ అయినట్లు నాగార్జున ప్రకటించారు. (Aata sandeep Elimination)

అయితే సందీప్‌ బిగ్‌బాస్‌ హౌస్‌లో చివరి వరకూ ఉంటాడని ఊహించారు. కానీ ట్విస్ట్‌ ఇచ్చినట్లు ఆయన ఎలిమినేట్‌ అయ్యారు. మొదటి నుంచి అందరితో కలుపుగోలుగా ఉండి, తనదైన శైలి ఆట ఆడిన సందీప్‌ ఎలిమినేట్‌ కావడంతో ఇంట్లో తనకు ఎంతో క్లోజ్‌ అయిన తేజ, శోభశెట్టి, ప్రియాంక భావోద్వేగానికి లోనయ్యారు. ‘వెళ్లిపోవద్దు మాస్టర్‌, మీరెళ్లిపోతే నేను ఉండలేను’ అని శోభ బోరున ఏడ్చేసింది. హౌస్‌ నుంచి స్టేజ్‌పైకి వెళ్లిన తర్వాత కూడా సందీప్‌ని చూస్తూ ఏడుస్తూనే ఉంది. సందీప్‌ లేకపోవడం తన బ్యాచ్‌ని బలహీనంగా చేస్తుందని శోభకి అర్థమైంది కాబట్టి ఏడుస్తూ.. మీరు లేకపోతే ఉండలేనంటూ కన్నీళ్లు పెట్టుకుంది. శివాజీ అయితే నువ్వు ఎలిమినేట్‌ అవుతావని అనుకోలేదని అన్నాడు. అతని అంచనా తప్పిందని బాధపడ్డాడు. అయితే సందీప్‌ ఎలిమినేట్‌ కాగానే కొన్ని నిజాలు బయటపడ్డాయి.

బయటకు వెళ్లే ముందు ఇంటి సభ్యుల గురించి నీ ఫస్ట్‌ ఇంప్రెషన్‌, లాస్ట్‌ ఇంప్రెషన్‌ చెప్పమని సందీప్‌ నాగార్జున అడగగా...

తేజ: హౌస్‌లో అందరికన్నా తెలివైనవాడు.

రతిక: చాలా షార్ప్‌ అనుకున్నా.. కానీ అమాయకురాలు

గౌతమ్‌: ఇంటలెక్చువల్‌

అశ్విని: ఈ అమ్మాయి అసలు ఆడుతుంది అనుకోలేదు. గత రెండు వారాల ఆట చూసి షాకయ్యా.

భోలే : చాలా బాగా మాట్లాడతారు.ఆయనలాగా ఎవ్వరినీ చూడలేదు

ప్రశాంత్‌: చాలా చాలా షార్ప్‌

శోభాశెట్టి : చాలా సాఫ్ట్‌, స్ర్టాంగ్‌ ప్లేయర్‌. కొన్ని సందర్భాల్లో చిన్నపిల్లలా అనిపిస్తుంది.

అర్జున్‌: బ్యాలెన్స్‌గా ఉన్నాడు.

అమర్‌దీప్‌: బెస్ట్‌ పర్సన్‌. మై బెస్ట్‌ ఫ్రెండ్‌

ప్రిన్స యావర్‌: చాలా సెన్సిటివ్‌. లవ్లీ బ్రదర్‌. సా్ట్ట్రంగ్‌ ప్లేయర్‌

శివాజీ: హార్ట్‌ఫుల్‌ పర్సన్‌, బంగారంలాంటి మనిషి

ప్రియాంక: ఆల్‌టైమ్‌ ఫెవరెట్‌.

Updated Date - 2023-10-30T10:41:54+05:30 IST