Biggboss 7 : ఆటగాళ్లే గెలిచారు.. మరి నెక్ట్స్‌ టాస్క్‌ ఏంటో!

ABN , First Publish Date - 2023-10-13T13:23:43+05:30 IST

బిగ్‌బాస్‌ 7 ఉల్టా - పుల్టా సీజన ప్రస్తుతం ఆరోవారం జరుగుతోంది. ఆటగాళ్లు వర్సెస్‌ పోటుగాళ్లు టాస్క్‌ను జోరుగా ఆడుతున్నారు ఇంటి సభ్యులు. ఒకప్పుడు ఓ రేంజ్‌లో ఆట ఆడినవారు ఇప్పుడు చతికిలపడ్డారు. ఆట ప్రారంభంలో ఓటమి పాలైనవారు గెలుస్తూ సత్తా చాటుతున్నారు.

Biggboss 7 : ఆటగాళ్లే గెలిచారు.. మరి నెక్ట్స్‌ టాస్క్‌ ఏంటో!

బిగ్‌బాస్‌ 7 ఉల్టా - పుల్టా సీజన ప్రస్తుతం ఆరోవారం జరుగుతోంది. ఆటగాళ్లు వర్సెస్‌ పోటుగాళ్లు టాస్క్‌ను జోరుగా ఆడుతున్నారు ఇంటి సభ్యులు. ఒకప్పుడు ఓ రేంజ్‌లో ఆట ఆడినవారు ఇప్పుడు చతికిలపడ్డారు. ఆట ప్రారంభంలో ఓటమి పాలైనవారు గెలుస్తూ సత్తా చాటుతున్నారు. ఫైనల్‌గా తాజా టాస్క్‌లో రెండు టీమ్‌లు చెరో మూడు పాయింట్లతో సమానంగా ఉన్నారు. మరి తాజా ఎపిసోడ్‌ ఎలా ఉందో చూద్దాం.

ప్రస్తుతం బిగ్‌బాస్‌ ఇంటికి కెప్టెన రైతు బిడ్డ పల్లవి ప్రశాంత . కెప్టెన్సీ సాధించాడే కానీ అతనిలో ఆ నాయకుడి లక్షణాలు కొంచెం కూడా కనిపించడం లేదు. కెప్టెన చెప్పాల్సింది పోయి.. ఇంటి సభ్యులు చెప్పిన పనిని తానే చేసేస్తున్నాడు. అన్నింటినీ గమనిస్తున్న ఉన్న బిగ్‌బాస్‌ ప్రశాంత్‌ దగ్గరున్న కెప్టెన్సీ బ్యాడ్జ్‌ తీసుకుని ఏడిపించిన సంగతి తెలిసిందే కదా! అది కేవలం వార్నింగ్‌ మాత్రమేనంటూ తిరిగి కెప్టెన్సీ బాధ్యతను వెనక్కు ఇచ్చారు.

bb7.jpg

మరోవైపు అమర్‌ తన ఓటమితో పాఠలు, గుణపాఠాలు నేర్చుకుంటున్నాడు. ఏదేమైనా ఆట గట్టిగా ఆడాలి.. ఇచ్చిపడేయాలి.. అని తనలో తానే మాట్లాడుకుంటూ ఊహల్లో తేలుతున్నాడు. ఇంటికి గ్లామర్‌ డాల్‌గా భావించే శోభాశెట్టి మేకప్‌ లేక ముఖం మాడ్చుకుని కూర్చుంది. ఇలా కూర్చుంటే అయ్యే పని కాదని పోటుగాళ్ల దగ్గర కాసింత మేకప్‌ అడిగి మరీ ముఖాన రాసుకుంది. దానికి బిగ్‌బాస్‌ అంగీకరించలేదు. శిక్ష తప్పడన్నాడు. దీంతో అర్జున్‌.. తేజ మూడు రోజులుగా వాడుతున్న టీషర్ట్‌ను వేసుకోవాలని ఆదేశించాడు. అది కంపు కొడుతున్నా చేసేది ఏమీ లేక ఆ షర్ట్‌ ధరించింది శోభాశెట్టి. తదుపరి ఆటగాళ్లు వర్సెస్‌ పోటుగాళ్లలో టాస్క్‌లో ఎవరు స్మార్ట్‌ అనేది తేల్చేందుకు హూ ఈజ్‌ స్మార్ట్‌ అనే టాస్క్‌ ఇచ్చాడు బిగ్‌బాస్‌. ఇందులో సినిమాలు, పాటలు, మాటలకు సంబంధించిన రకరకాల ప్రశ్నలు అడిగాడు. ఇందులో ఆటగాళ్ల టీమ్‌ గెలిచింది. అయితే ఆ సమయంలో శోభ కాస్త ఓవర్‌ యాక్షన చేసింది. బిగ్‌బాస్‌ అడిగే ప్రశ్నకు ఏది సరైన సమాధానం అనుకుంటారో అదే బోర్డుపై పెట్టాలి. కానీ శోభా ఎందుకైనా మంచిదని రెండు బోర్డులు పట్టుకుని నేన్వినూ అంటూ చిన్న పిల్లలా బీహేవ్‌ చేసింది. రెండు బోర్డులు తనతోనే ఉంచుకున్నా సరైన సమాధానం చెప్పలేదులే అంటూ శోభాశెట్టి గాలి తీసేశాడు బిగ్‌బాస్‌. అలా రెండు బోర్డులు పట్టుకోకూడదని వార్నింగ్‌ ఇచ్చాడు. దాంతో సహించని శోభా పూజామూర్తితో గొడవకు దిగింది. దానికి ఏ మాత్రం తగ్గని పూజా ుతను చెప్తే నీతులు.. ఎదుటివాళ్లు చెప్తే బూతులా’ అని ఆగ్రహించింది. అయితే తన గురించి అలా సామెత చెప్పడం నచ్చలేదంటూ ఏడ్చేసింది మోనిత. తర్వా ఎవరు ఫోకస్‌ అనే టాస్క్‌ జరగ్గా ఇందులోనూ ఆటగాళ్లే గెలిచారు. మరి నెక్స్ట్‌ బిగ్‌బాస్‌ ఏ గేమ్‌ ఇస్తాడు ఎవరు గెలుస్తారు అన్నది చూడాలి మరి.

Updated Date - 2023-10-13T13:23:43+05:30 IST