Bigg Boss 7: ఈసారి మరింత రసవత్తరంగా..

ABN , First Publish Date - 2023-08-26T15:43:00+05:30 IST

తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్‌(BiggBoss 7) కు ఎంత క్రేజ్‌ ఉందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. సీజన్‌ ప్రారంభమయ్యే సమయంలో ఆ షోను వ్యతిరేకించేవారు అవాకులు, చవాకులు పేలినా.. ప్రేక్షకుల నుంచి ఆదరణ మాత్రం బాగానే ఉంటుంది. ఇప్పటికి ఆరు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో ఏడవ సీజన్‌ సెప్టెంబర్‌ 3 న ప్రారంభం కానుందని తెలుస్తోంది.

Bigg Boss 7: ఈసారి మరింత రసవత్తరంగా..

తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్‌(BiggBoss 7) కు ఎంత క్రేజ్‌ ఉందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. సీజన్‌ ప్రారంభమయ్యే సమయంలో ఆ షోను వ్యతిరేకించేవారు అవాకులు, చవాకులు పేలినా.. ప్రేక్షకుల నుంచి ఆదరణ మాత్రం బాగానే ఉంటుంది. ఇప్పటికి ఆరు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో ఏడవ సీజన్‌ సెప్టెంబర్‌ 3 న ప్రారంభం కానుందని తెలుస్తోంది. ఇప్పటికే విడుదల ప్రోమోతో ఈసారి సీజన్‌ మరింత రసవత్తరంగా ఉండబోతోందని నాగ్‌ చెప్పకనే చెప్పారు. సరికొత్త రూల్స్‌, టాస్క్‌లతో మరింత ఆసక్తికరంగా ఎవరూ ఊహించిన రీతిలో ఉంటుందని నాగార్జున(Nagarjuna) స్పష్టం చేశారు. ప్రస్తుతమైతే తాజా సీజన్‌ ప్రారంభం కోసం ‘బిగ్‌బాస్‌’ లవర్స్‌ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సీజన్‌లో ఇంటి సభ్యులుగా లోపలికి ఎవరు వెళ్లబోతున్నారనే చర్చ బలంగా నడుస్తోంది.

దీనికి సంబంధించి నెట్టింట ఓ లిస్ట్‌ చక్కర్లు కొడుతోంది. ఈ లిస్ట్‌లో ముఖ్యంగా వినిపిస్తున్న పేరు అమర్‌దీప్‌. ‘జానకి కలగనలేదు’ డైలీ సీరియల్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘కార్తీకదీపం’ సీరియల్‌తో పాపులర్‌ అయిన శోభాశెట్టి పేరు వినిపిస్తోంది. ‘మొగలిరేకులు’ ఫేమ్‌ సాగర్‌, ప్రియాంక జైన్‌, పూజా మూర్తి, అంజలి పవన్‌, ఆట సందీప్‌, యూట్యూబ్‌, సోషల్‌ మీడియా నుంచి అనిల్‌ జీల, సీతల్‌ గౌతమన్‌, పల్లవి ప్రశాంత్‌, రంగస్థలం మహేష్‌, జబర్దస్త్‌ బుల్లెట్‌ భాస్కర్‌, యాక్టర్‌ క్రాంతి, సింగర్‌ దామిని, అన్షు, రియాజ్‌, భోలే షావలి, సాయిరోనక్‌, టీవీ9 యాంకర్‌ ప్రత్యూష, ఆకాశవీధిలో హీరో గౌతమ్‌ కృష్ణ, విష్ణు ప్రియ పేరు ఫైనల్‌ అయినట్లు సమాచారం. వీరితోపాటు మరో ఇద్దరు వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆ లిస్ట్‌లో షకీలా, హీరో అబ్బాస్‌, హీరోయిన్‌ ఫర్జానా ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే నెల 1,2 తేదీల్లో షూటింగ్‌ జరుపుకొని మూడో తేదిన ‘బిగ్‌ బాస్‌ సీజన్‌ 7’ ‘స్టార్‌ మా’లో టెలికాస్ట్‌ కానుంది.

Updated Date - 2023-08-26T15:43:00+05:30 IST