కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Bigg Boss Subhashree: గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిన శుభశ్రీ, పవన్ కళ్యాణ్ తో 'ఓజి' సినిమాలో

ABN, First Publish Date - 2023-10-24T14:28:05+05:30

బిగ్ బాస్ నుండి బయటకి పంపించవేయబడిన శుభశ్రీ కి ఒక మంచి ఛాన్స్ దొరికింది. అంతా మన మంచికే అన్నట్టుగా బయటకి వచ్చిన ఆమె పవన్ కళ్యాణ్ నటిస్తున్న 'ఓజి' సినిమాలో పవన్ పక్కన నటిస్తోంది.

Shubhashree Rayaguru with 'OG' film director Sujeeth

బిగ్ బాస్ తెలుగు 7 సీజన్ #BiggBossTelugu7 నుంచి ఈమధ్యనే ఇంటి నుండి బయటకి పంపించేసి నటి శుభశ్రీ రాయగురు (ShubhashreeRayaguru). ఈమె ఇంటి నుంచి బయటకి వచ్చేస్తుంది అని ఎవరూ అనుకోలేదు, కానీ అనూహ్యంగా వచ్చేసింది. అయితే ఏమి, అంతా ఆమె మంచికే జరిగినట్టుగా వుంది. బయటకి వచ్చిన ఆమె మంచి గోల్డెన్ ఛాన్స్ కొట్టేసింది అనే చెప్పాలి. నాగార్జున (AkkineniNagarjuna) ఈ షో కి వ్యాఖ్యాతగా వున్నారు.

శుభశ్రీ సినిమా ఛాన్స్ వచ్చింది, ఇంతకీ అది ఎవరి పక్కన అంటే, సాక్షాత్తూ పవన్ కళ్యాణ్ (PawanKalyan) పక్కన అదీ 'ఓజి' #OG సినిమాలో చేస్తోంది. ఇది ఆమె సాంఘీక మాధ్యమం ద్వారా ప్రకటించింది. 'ఓజి' దర్శకుడు సుజీత్ (Sujeeth) తో ఒక ఫోటో పెట్టి, 'ఓజి' పోస్టర్ కూడా షేర్ చేసి, తాను పవన్ కళ్యాణ్ పక్కన చేస్తోంది అని చెప్పింది.

ఆమె పవన్ కళ్యాణ్ అభిమాని అని చెప్పింది, అలాంటిది అతని పక్కన నటించే అవకాశం రావటం అదృష్టంగా భావిస్తున్నాను అని చెప్పుకొచ్చింది. అలాగే ఆ సినిమా ఛాయాగ్రహణం అందిస్తున్న రవి కే చంద్రన్ (RaviKChandran) తో కూడా ఒక ఫోటో షేర్ చేసింది. ఒరిస్సా కి చెందిన ఈమె బిగ్ బాస్ 7 తెలుగు సీజన్ లో ఇంట్లోకి వెళ్లడం, తెలుగు ప్రజలందరికీ పరిచయం అవటం జరిగింది. బిగ్ బాస్ ఇంట్లో ఆటలు కూడా బాగానే ఆడింది, కానీ హౌస్ లోంచి బయటకి వచ్చేసింది. ఇప్పుడు ఈ సినిమా చేస్తోంది.

Updated Date - 2023-10-24T14:29:47+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!