Bhumika Chawla: అభిమానులతో ఖుషి!

ABN , First Publish Date - 2023-01-03T15:37:46+05:30 IST

ప్రస్తుతం టాలీవుడ్‌లో రీ రిలీజ్‌ల ట్రెండ్‌ నడుస్తోంది. ఒకప్పుడు భారీ విజయాన్ని నమోదు చేసుకుని ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచిన చిత్రాలను మేకర్స్‌ ఇప్పుడు డిజిటలైజ్‌ చేసి కొత్త హంగులతో 4కె రిజల్యూషన్‌లో విడుదల చేస్తున్నారు.

Bhumika Chawla: అభిమానులతో ఖుషి!

ప్రస్తుతం టాలీవుడ్‌లో రీ రిలీజ్‌ల ట్రెండ్‌ నడుస్తోంది(Re realese). ఒకప్పుడు భారీ విజయాన్ని నమోదు చేసుకుని ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచిన చిత్రాలను మేకర్స్‌ ఇప్పుడు డిజిటలైజ్‌ చేసి కొత్త హంగులతో 4కె రిజల్యూషన్‌లో విడుదల చేస్తున్నారు. ఈ మధ్యన అలా విడుదలైన ప్రతి చిత్రం రీరిలీజ్‌లోనూ సత్తా చాటాయి. డిసెంబర్‌ 31న ‘ఖుషి’(kushi) చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశారు నిర్మాత ఎ.ఎంరత్నం. పవన్‌కల్యాణ్‌ (awan kalyan) భూమిక (Bhumika chawla) జంటగా ఎస్‌.జె.సూర్య దర్శకత్వం వహించిన ఈ చిత్రం 20 ఏళ్ల క్రితం ఓ సంచలనం. అప్పట్లో ఈ చిత్రంలో పవన్‌ నటన, యాటిట్యూడ్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. 20 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఇప్పటికీ ఈ సినిమా క్రేజ్‌ తగ్గిందేలే! డిసెంబర్‌ 31న ఎక్కడ చూసిన ఈ సినిమాకు సంబంధించిన వార్తలే. ప్రస్తుతం భూమిక అమెరికాలో ఉన్నారు. 20 ఏళ్ల తర్వాత విడుదలైన ఈ చిత్రాన్ని భూమిక ప్రేక్షకులు, అభిమానులతో వీక్షించారు. అభిమానులతో సందడి చేశారు. వారితో కలిసి ఆనందాన్ని పంచుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింద హల్‌చల్‌ చేస్తోంది.

kushi.jpg

Updated Date - 2023-01-03T16:48:24+05:30 IST