Bhoothaddam Bhaskar Narayana: శివ సిద్ధమవుతున్నాడు

ABN , First Publish Date - 2023-01-03T20:27:39+05:30 IST

పురుషోత్తం రాజ్‌ (Purushotham Raaj)‌ని దర్శకుడిగా పరిచయం చేస్తూ.. స్నేహల్‌ జంగాల, శశిధర్‌ కాశి, కార్తీక్‌ ముడుంబై సంయుక్తంగా మిలియన్‌ డ్రీమ్స్‌ క్రియేషన్స్‌ మరియు విజయ సరాగ ప్రొడక్షన్స్‌ బ్యానర్స్‌‌పై..

Bhoothaddam Bhaskar Narayana: శివ సిద్ధమవుతున్నాడు
Bhoothaddam Bhaskar Narayana

పురుషోత్తం రాజ్‌ (Purushotham Raaj)‌ని దర్శకుడిగా పరిచయం చేస్తూ.. స్నేహల్‌ జంగాల, శశిధర్‌ కాశి, కార్తీక్‌ ముడుంబై సంయుక్తంగా మిలియన్‌ డ్రీమ్స్‌ క్రియేషన్స్‌ మరియు విజయ సరాగ ప్రొడక్షన్స్‌ బ్యానర్స్‌‌పై నిర్మిస్తోన్న చిత్రం ‘భూతద్ధం భాస్కర్‌ నారాయణ’ (Bhoothaddam Bhaskar Narayana). డిఫరెంట్ కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలను చేస్తున్న యంగ్ హీరో శివ కందుకూరి (Shiva Kandukuri) ఈ సినిమాలో మెయిన్ లీడ్‌గా కనిపింబోతున్నాడు. రీసెంట్‌గా విడుదలైన ఈ చిత్ర మోషన్ పోస్టర్ మంచి స్పందనను రాబట్టుకున్న విషయం తెలిసిందే. ఓం నమ: శివాయ అనే అద్భుతమనైన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌తో స్టార్ట్ అయిన ఈ మోషన్ పోస్టర్ సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేసింది. ఒక కుర్చీలో ఒక స్త్రీని కట్టివేయడం, ఆమెకు తల లేకుండా కేవలం మొండెం మాత్రమే చూపించడం ఈ సినిమాపై క్యూరియాసిటీ పెంచేలా చేసింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్‌ని మేకర్స్ తెలియజేశారు.

ఈ చిత్రం ప్రస్తుతం షూటింగు చేసుకుని.. ఎడిటింగ్ పనులను జరుపుకుంటున్నట్లుగా మేకర్స్ తెలిపారు. శివ కందుకూరి సరసన రాశి సింగ్‌ (Rashi Singh) హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి శ్రీచరణ్‌ పాకాల, విజయ్‌ బుల్గానిన్‌ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల్లో బిజీగా ఉన్న ఈ చిత్ర విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తామని మేకర్స్ తెలిపారు. ఈ లోపు టీజర్‌, ట్రైలర్‌, సాంగ్స్‌ విడుదల చేసి.. సినిమాపై మరింతగా క్రేజ్ తెచ్చే సన్నాహాలలో చిత్రయూనిట్ ఉంది.

Updated Date - 2023-01-03T20:27:40+05:30 IST