Chiranjeevi: 'భోళాశంకర్' నిర్మాత అనిల్ సుంకర 30 కోట్లు తీసుకుని మోసగించారు, అందుకే 'భోళాశంకర్' పై కోర్టులో కేసు వేశాను: డిస్ట్రిబ్యూటర్ సతీష్

ABN , First Publish Date - 2023-08-09T11:24:17+05:30 IST

అనిల్ సుంకర, అఖిల్ అక్కినేనితో నిర్మించిన భారీ బడ్జెట్ సినిమా 'ఏజెంట్' ఫ్లాప్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఆ సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కులు 30 కోట్లకు కొనుక్కున్న వైజాగ్ సతీష్ అనే డిస్ట్రిబ్యూటర్ ఇప్పుడు అనిల్ సుంకర మీద న్యాయపోరాటానికి సిద్ధం అవుతున్నాడు. అదే నిర్మాతలు 'భోళాశంకర్' సినిమా విడుదలకు ముందు తనకి కొంత డబ్బు ఇస్తామన్నారు అని, కానీ వాళ్ళు ఇప్ప్పుడు మాట్లాడటం లేదని సతీష్ ఆరోపణ.

Chiranjeevi: 'భోళాశంకర్' నిర్మాత అనిల్ సుంకర 30 కోట్లు తీసుకుని మోసగించారు, అందుకే 'భోళాశంకర్' పై కోర్టులో కేసు వేశాను: డిస్ట్రిబ్యూటర్ సతీష్
Chiranjeevi from Bholaa Shankar film

ఒక పెద్ద సినిమా ఫ్లాప్ అయినప్పుడు ఆ సినిమా నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్స్ తో సరైన ఒప్పందాలు చేసుకోకపోతే తమ తదుపరి సినిమా విషయంలో ఎటువంటి ఒడిదుడికలు వస్తాయో మరోసారి వెలుగులోకి వచ్చింది. ఇంతకు ముందు చాలా సార్లు ఇలాంటివి చూసాం, ఆమధ్య 'లైగర్' #Liger సినిమా విషయంలోనూ చూసాం. ఇప్పుడు అఖిల్ అక్కినేని (AkhilAkkineni) నటించిన 'ఏజెంట్' #Agent సినిమాకి కూడా అదే రిపీట్ అవుతోంది. 'ఏజెంట్' సినిమాకి అనిల్ సుంకర (AnilSunkara) నిర్మాత, ఆ సినిమా పెద్ద ఫ్లాప్ అయింది. అయితే ఆ సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కులు కొన్న బత్తుల సత్యనారాయణ (VizagSatish) లేదా సతీష్ (వైజాగ్) డిస్ట్రిబ్యూటర్ బాగా నష్టపోయాడు అని చెపుతున్నారు.

vizagsatish.jpg

ఇప్పుడు అదే నిర్మాతలు మెగా స్టార్ చిరంజీవితో (MegaStarChiranjeevi) 'భోళా శంకర్' #BholaaShankar సినిమా నిర్మించారు, ఇందులో కీర్తి సురేష్ (KeerthySuresh), తమన్నా (TamannaahBhatia) కథానాయికలు, మెహెర్ రమేష్ (MeherRamesh) దర్శకుడు. 'ఏజెంట్' #Agent ప్లాప్ అవడంతో ఈ 'భోళాశంకర్' డిస్ట్రిబ్యూషన్ హక్కులు ఇచ్చి అందులో నష్టం వచ్చిన దానికి పాసిఫై చేస్తామని చెప్పినట్టుగా సతీష్ అంటున్నారు. సతీష్ 'ఏజెంట్' సినిమా మొత్తం డిస్ట్రిబ్యూషన్ హక్కులు అంటే తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక కి కలిపి 30 కోట్లకు తీసుకున్నాను అని, కానీ 'ఏజెంట్' నిర్మాతలు కేవలం వైజాగ్ డిస్ట్రిబ్యూషన్ అని మాత్రమే అగ్రిమెంట్ చేశారని, అది మోసం చేసినట్టు అని సతీష్ చెపుతున్నారు.

"ఏజెంట్ సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కుల విషయంలో అనిల్ సుంకర, గరికపాటి కృష్ణ కిషోర్ నన్ను మోసం చేయడంతో వారి నిజ స్వరూపం బట్టబయలు అయింది. వారు చేసిన అన్యాయం ఏమిటో ప్రతీ ఒక్కరికీ తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏప్రిల్ ఆఖరులో విడుదలైన 'ఏజెంట్' సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కులను మూడు రాష్ట్రాలు అయిన తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటకలకు ఐదు సంవత్సరాల పాటు నాకు చెందిన గాయత్రి దేవి ఫిలిమ్స్ కు అందజేస్తామని అగ్రిమెంట్ నాకు రాసి ఇచ్చి, 30 కోట్ల రూపాయలు తీసుకుని మరీ వారు నన్ను పచ్చిగా మోసగించారు," అని చెప్పారు సతీష్ ఒక పత్రిక ప్రకటనలో.

anilsunkara.jpg

బ్యాంకు అకౌంట్ రూపంలో తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని చెపుతున్నారు సతీష్. "కానీ ఆ 'ఏజెంట్' విడుదల సమయంలో కేవలం విశాఖపట్నం జిల్లా వరకు మాత్రమే అందజేసి, అగ్రిమెంట్ కు తూట్లు పొడిచారు," అని చెప్పారు. అయితే తరువాత మే 1వ హైదరాబాద్ లోని వారి ఆఫీస్ కు వెళ్లి గరికపాటి కృష్ణ కిషోర్ ను కలవగా, సినిమా ప్లాప్ అయ్యిందని చెప్పి, మే 2వ అండర్ టేకింగ్ లెటర్ ఇవ్వడంతో డబ్బులు ఎలాగైనా వస్తాయన్న నమ్మకంతో తిరిగి వైజాగ్ వెళ్ళిపోయాను అని చెప్పారు.

'ఏజెంట్' ప్లాప్ వలన, అదే నిర్మాతలు తాము నిర్మించిన 'సామజవరగమన' అనే సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కులను కూడా విశాఖపట్నం వరకు సతీష్ కి ఇచ్చారు. ఆ చిత్రం ద్వారా కేవలం చాలా కొద్ది డబ్బు మాత్రమే నాకు కవర్ అయ్యింది అని చెపుతున్నారు సతీష్.ఈ నేపథ్యంలో 45 రోజుల్లో నాకు రావలసిన మిగతా డబ్బును చెల్లిస్తామని, ఒకవేళ అలా చెల్లించకపోతే తమ తదుపరి సినిమా విడుదల లోపు ఇస్తానని నాకు ఇస్తామని ఒప్పంద పత్రం చేశారు. అయితే తరువాత సినిమా 'భోళాశంకర్' విడుదలకు రెడీ అయింది, కానీ ఆ నిర్మాతలు (AKEntertainments) సతీషకి కి రెస్పాన్స్ ఇవ్వడం మానేశారు. ఫిలింఛాంబర్ లో కూడా ఈ విషయం చెప్పినప్పటికీ ఎవరూ పట్టించుకోలేదని సతీష్ చెపుతున్నారు.

bholaashankar4.jpg

ఇక చేసేది లేక అతను న్యాయస్థానాన్ని ఆశ్రయించానని చెపుతున్నారు. విశాఖపట్నం డిస్ట్రిబ్యూటర్ గా సినీ పరిశ్రమతో నాకు విడదీయలేని అనుబంధం ఉంది. 'రంగస్థలం', 'వాల్తేరు వీరయ్య', 'వీరసింహారెడ్డి' వంటి సినిమాలను డిస్ట్రిబ్యూషన్ చేశాను అని చెపుతున్నారు సతీష్. అయితే గతంలో ఎప్పుడూ డబ్బు గురించిన సమస్యలు కానీ మోసాలు కానీ తలెత్తలేదు. కానీ ఇప్పుడు ఎకె ఎంటర్ టైన్మెంట్స్ వారు నా దగ్గర 30 కోట్లు తీసుకుని, సరిగ్గా సమాధానం చెప్పకుండా, ఎగొట్టాలనే తలంపుతో ఆఖరికి నా మీద ఫోర్జరీ చేశాననే నింద కూడా వేశారు అని చెపుతున్నాడు సతీష్.

ఈ నేపథ్యంలో సతీష్ ఎకె ఎంటర్ టైన్మెంట్స్ ఎవరెవరికి ఎలా మోసం చేసిందో కూడా చెప్పుకొచ్చారు. యూరో స్ ఇంటర్నేషనల్ వారికి వీరు ఇచ్చిన చెక్కులు బౌన్స్ కావడంతో వీరిపై ఆ సంస్థ కేసులు పెట్టింది. వల్లనే కాకుండా ఎంతోమందిని మోసం చేస్తూ, వీరు తమ గుడ్ విల్ ను పోగొట్టుకున్నారు అని ఆరోపించారు సతీష్. అందుకనే వాళ్ళ మీద క్రిమినల్ కేసు కూడా ఫైల్ చేయడం జరిగింది, ఫైనాన్సియర్స్ అందరి పైన ఈడీకి కూడా ఫిర్యాదు చేయడం జరుగుతుంది అని చెప్పారు సతీష్.

మెగాస్టార్ చిరంజీవి అంటే తనకి ఎంతో ఇష్టం అని అతను నటించిన సినిమా అన్న ఉద్దేశ్యంతోనే పబ్లిక్ తెలియకుండా ఇంతవరకు ఆగాను అని, కానీ తన మీద ఎప్పుడైతే ఫోర్జరీ నింద వేసి, ఆ వార్తలను గ్రూపులలో తిప్పిస్తూ, అప్రదిష్టపాలు చేస్తున్నారు అని తెలిసి వెంటనే న్యాయస్థానాన్ని ఆశ్రయించానని చెపుతున్నారు సతీష్. న్యాయస్థానం ఏమి చెపుతుందో చూసి తరువాత మీడియా ముందుకు వస్తాను అని చెపుతున్నారు సతీష్.

Updated Date - 2023-08-09T14:39:13+05:30 IST