సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Bharati Raja: విద్య గొప్పతనాన్ని నొక్కి చెప్పారు

ABN, First Publish Date - 2023-02-20T15:17:27+05:30

ధనుష్‌ (Dhanush) నటించిన ‘వాతి’ (Vaathi) (సార్‌)(Sir) చిత్రంపై ప్రముఖ దర్శకుడు భాగ్యరాజా (bhagyaraja) ప్రశంసల వర్షం కురిపించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ధనుష్‌ (Dhanush) నటించిన ‘వాతి’ (Vaathi) (సార్‌) చిత్రంపై ప్రముఖ దర్శకుడు భాగ్యరాజా (bhagyaraja) ప్రశంసల వర్షం కురిపించారు. విద్యను ప్రోత్సహించడంలోని ప్రాముఖ్యను నొక్కి చెప్పిన ఈ చిత్రాన్ని ఒక ప్రత్యేకమైన చిత్రంగా ఆయన అభివర్ణించారు. ధనుష్‌ బాధ్యతాయుతమైన దృష్టిని అభినందించారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘నా సినీ జీవితంలో ఎన్నో మైలురాళ్లను చూశాను. వాటిలో కొన్ని విషయాలు నన్ను ఆశ్చర్యపరిచాయి. అలాంటి వాటిలో ‘సర్‌’ ఒకటి. ఈ చిత్రంలో నేనూ భాగం కావడం ఆనందంగా ఉంది. సినిమా అనేది వినోదం పంచడం కంటే ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలి. అలాంటి సినిమాల్లో ‘వాతి’ ఒకటి. ఇందులో విద్య గొప్పతనాన్ని నొక్కి చెప్పారు’’ అని భారతీరాజా అన్నారు. సినిమాలో కీలకపాత్ర పోషించిన సముద్రఖని, టీచర్‌ పాత్రలో ఒదిగిపోయి మెప్పించిన సంయుక్తలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ చిత్రాన్ని థియేటర్లలో చూడాలని ఆయన కోరారు. ‘‘ఇటీవల నేను సినిమా చూశా. ప్రేక్షకులు సినిమాను ఆదరిస్తున్న తీరు బావుంది. (Bharati Raja appriciates vaathi) ఈ చిత్రానికి సంగీతం అందించడం జీవీ ప్రకాశ్‌కు దక్కిన వరం. ఈ ఏడాది ఆయన చక్కని సంగీతం అందించారు. ఈ ఏడాది జీవీ ప్రకాశ్‌ జాతీయ అవార్డు అందుకోవడం ఖాయం’’ అని అన్నారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన చిత్రమిది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ - శ్రీకర స్టూడియో సంయుక్తంగా నిర్మించాయి.

Updated Date - 2023-02-20T16:40:32+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!