సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Bhagavanth Kesari: మొండోడు వానికున్న ఒకేఒక్క గుండె చూపిస్తాడు..

ABN, First Publish Date - 2023-06-10T12:23:26+05:30

‘రాజు.. ఆని వెనకున్న వందలమంది మందను చూపిస్తాడు.. మొండోడు వానికున్న ఒకేఒక్క గుండె చూపిస్తాడు.. అడవి బిడ్డ నేలకొండ భగవంత్‌ కేసరి... ఈ పేరు చానా ఏండ్లు యాదుంటడి’ బాలయ్య నోట పలికిన ఈ డైలాగ్‌లు అభిమానుల్లో పండగ వాతావరణాన్ని నెలకొల్పాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘రాజు.. ఆని వెనకున్న వందలమంది మందను చూపిస్తాడు..

మొండోడు వానికున్న ఒకేఒక్క గుండె చూపిస్తాడు..

అడవి బిడ్డ నేలకొండ భగవంత్‌ కేసరి...(Bhagavanth kesari)

ఈ పేరు చానా ఏండ్లు యాదుంటడి’ (Nandamuri Balakrishna)

బాలయ్య నోట పలికిన ఈ డైలాగ్‌లు అభిమానుల్లో పండగ వాతావరణాన్ని నెలకొల్పాయి. నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు (Hbd Nbk) సందర్భంగా శనివారం ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘భగవంత్‌ కేసరి’ టీజర్‌ను విడుదల చేశారు. అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. రెండ్రోజులుగా కొత్త లుక్స్‌ వదులుతూ సందడి చేస్తున్న చిత్ర బృందం బాలయ్య బర్త్‌డే ట్రీట్‌గా విడుదల చేసిన టీజర్‌ ఇప్పుడు నెట్టింట వైరల్‌ అవుతోంది. బాలయ్య పలికిన డైలాగ్‌లు, పవర్‌ఫుల్‌గా ఉన్నాయి. ఆయన లుక్‌ కూడా గతంలోలాగా కాకకుండా కొత్తగా ఉంది. బాలయ్య లుక్‌, టీజర్‌లో డైలాగ్‌లకు, తమన్‌ బ్యాగ్రౌండ్‌ స్కోర్‌కు అభిమానులు ఫిదా అవుతున్నారు. షైన్‌స్కీన్‌ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీశ్‌ పెద్ది నిర్మిస్తున్న ఈ చిత్రం దసరా కానుకగా ప్రేక్షుకుల ముందుకు రానుంది. కాజల్‌ (Kajal)ఈ చిత్రంలో కథానాయిక. శ్రీలీల కీలక పాత్రలో కనిపిస్తారు.

Updated Date - 2023-06-10T12:30:38+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!