Bhagavanth Kesari: హిందీలో ‘భ‌గ‌వంత్ కేస‌రి’.. నా స‌త్తా ఏంటో చూస్తారు: బాల‌కృష్ణ

ABN , First Publish Date - 2023-11-10T13:45:28+05:30 IST

ద‌స‌రా సంద‌ర్బంగా నంద‌మూరి బాల‌కృష్ణ , శ్రీలీల న‌టించిన భ‌గ‌వంత్ కేసరి సినిమా విడుద‌లై ఎన్ని రికార్డులు తిర‌గ‌రాస్తున్న‌దో అంద‌రికీ తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాను త్వ‌ర‌లో హిందీలో డ‌బ్ చేసి విడుద‌ల చేస్తున్నామ‌ని బాల‌కృష్ణ స్ప‌ష్టం చేశారు.

Bhagavanth Kesari: హిందీలో ‘భ‌గ‌వంత్ కేస‌రి’.. నా స‌త్తా ఏంటో చూస్తారు: బాల‌కృష్ణ
bhagavath kesari

ద‌స‌రా సంద‌ర్బంగా నంద‌మూరి బాల‌కృష్ణ (Balakrishna), శ్రీలీల (Sreeleela) న‌టించిన భ‌గ‌వంత్ కేసరి (Bhagavant Kesari) సినిమా విడుద‌లై ఎన్ని రికార్డులు తిర‌గ‌రాస్తున్న‌దో అంద‌రికీ తెలిసిందే. ఈ చిత్రంతో బాల‌య్య‌ హ్య‌ట్రిక్ కొట్ట‌డ‌మే కాకుండా వ‌రుస‌గా త‌ను న‌టించిన మూడ‌వ చిత్రం వంద కోట్ల క్ల‌బ్‌లో చేరి కొత్త‌ చ‌రిత్ర సృష్టించింది. చిత్రం విడుద‌లై 20 రోజులు కావొస్తున్నా ‘లియో, టైగ‌ర్ నాగేశ్వ‌ర‌ రావు’ వంగి భారీ చిత్రాల పోటీని త‌ట్టుకుని స్ట‌డీగా క‌లెక్ష‌న్లు రాబ‌డుతూ తెలుగు నాట ద‌స‌రా బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిలిచింది.

Bhagavanth-kesari--(2).jpg

ఈక్ర‌మంలో నిన్న నవంబర్ 9న విజ‌యోత్స‌వ స‌భ కూడా నిర్వ‌హించి టెక్నీషియ‌న్ల‌ను స‌న్మానించి జ్ఞాపిక‌లు అంద‌జేశారు. అయితే ఈసంద‌ర్భంగా నిర్వ‌హించిన వేడుక‌లో ద‌ర్శ‌కుడు అనీల్ రావిపూడి, బాల‌కృష్ణ‌లు మాట్లాడుతూ మంచి సందేశం, యాక్ష‌న్‌, వినోదం క‌ల‌గ‌లిపి ఉన్న ఈ సినిమా తెలుగు వారంద‌రినీ బాగా ఆక‌ట్టుకున్న‌ద‌న్నారు. ఇంతటి ఘన విజయం అందించినందుకు ప్రేక్షకులకు దన్యవాదాలు తెలిపారు.


నాకు మొద‌టి నుంచి ప్ర‌యోగాలు చేయ‌డం అల‌వాట‌ని అందుకే ఈ భ‌గ‌వంత్ కేసరి సినిమాను హిందీలో డ‌బ్ చేసి త్వ‌ర‌లో విడుద‌ల చేస్తామ‌ని తెలిపారు. ఇందులోని మెసేజ్ దేశ ప్ర‌జ‌లంద‌రికీ చేరితే మా ప్ర‌య‌త్నం మ‌రింత మందికి చేరుతుంద‌ని అన్నారు. హిందీ వెర్ష‌న్‌లో నా పాత్ర‌కు ఫ‌స్ట్ టైం నేనే స్వ‌యంగా డ‌బ్బింగ్‌ చెప్పాన‌ని ఇన్నాళ్లు నా తెలుగును విన్నార‌ని ఇక హిందీతో మోత మోగుద్ద‌ని అన్నారు. నా భాషా ప‌టిమ, నా స‌త్తా ఏంటో మీరే స్వ‌యంగా చూస్తార‌ని అన్నారు. ఇదిలాఉండగా సినిమాలో విలన్ గా చేసిన అర్జున్ రాంపాల్ బాలీవుడ్ నటుడు కావడం సినిమాకు కలిసొచ్చే అవకాశం.

Updated Date - 2023-11-10T15:16:52+05:30 IST