Bhagavanth Kesari: అడవి బిడ్డ.. వేగం పెంచాడు

ABN , First Publish Date - 2023-06-17T11:29:49+05:30 IST

నందమూరి బాలకృష్ణ (Bala Krishna) ‘భగవంత్‌ కేసరి’గా (Bhagavath kesari) సందడి చేయబోతున్నారు. అనిల్‌ రావిపూడి Anil Raavipudi) దర్శకత్వంలో షైన్‌స్ర్కీన్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం దసరా కానుకగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో షూటింగ్‌ వేగవంతం చేశారు. తాజాగా హైదరాబాద్‌లో కొత్త షెడ్యూల్‌ మొదలెట్టారు.

Bhagavanth Kesari: అడవి బిడ్డ.. వేగం పెంచాడు

నందమూరి బాలకృష్ణ (Bala Krishna) ‘భగవంత్‌ కేసరి’గా (Bhagavath kesari) సందడి చేయబోతున్నారు. అనిల్‌ రావిపూడి Anil Raavipudi) దర్శకత్వంలో షైన్‌స్ర్కీన్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం దసరా కానుకగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో షూటింగ్‌ వేగవంతం చేశారు. తాజాగా హైదరాబాద్‌లో కొత్త షెడ్యూల్‌ మొదలెట్టారు. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా సిద్ధం చేసిన సెట్‌లో కొత్త షెడ్యూల్‌ తెరకెక్కిస్తున్నారని తెలిసింది. ఈ షెడ్యూల్‌లో బాలకృష్ణ, ఇతర తారాగణంపై కీలక సన్నివేశాలతోపాటు ఓ భారీ పోరాట ఘట్టాన్ని (Action Part shoot) కూడా తెరకెక్కించనున్నట్లు సమాచారం. ఇప్పటికే 50 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఆగస్ట్‌ చివరికి పూర్తి చేస్తారని తెలుస్తోంది.

1.jpg

పక్కా మాస్‌ యాక్షన్‌ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో బాలకృష్ణకు జోడీగా కాజల్‌ నటిస్తోంది. శ్రీలీల, అర్జున్‌ రాంపాల్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన టీజర్‌, టైటిల్‌కు చక్కని స్పందన వచ్చింది. టీజర్‌లో బాలయ్య చెప్పిన ‘అడవి బిడ్డ.. నేలకొండ భగవంత్‌ కేసరి... ఈ పేరు శానా యేండ్లు యాదుందటి’ అన్న డైలాగ్‌ విపరీతంగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. తమన్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని సాహు గారపాటి, హరీశ్‌ పెద్ది నిర్మిస్తున్నారు.

Updated Date - 2023-06-17T11:30:50+05:30 IST