కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Bhagavanth Kesari blasting trailer : చప్పుడు చేయాకు... పిల్ల మొగ్గ.. బాలయ్య జోరు మామూలుగా లేదుగా!

ABN, First Publish Date - 2023-10-08T22:27:43+05:30

నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘భగవంత్‌ కేసరి’. కాజల్‌ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి అనిల్‌ రావిపూడి దర్శకుడు. అభిమానులు, ప్రేక్షకకుల ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ట్రైలర్‌ రానే వచ్చింది. వరంగల్‌ వేదికగా ట్రైలర్‌ను విడుదల చేశారు.

Bhagavanth Kesari blasting trailer : చప్పుడు చేయాకు... పిల్ల మొగ్గ.. బాలయ్య జోరు మామూలుగా లేదుగా!

నందమూరి బాలకృష్ణ (NBK) కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘భగవంత్‌ కేసరి’(Bhagavanth kesari) . కాజల్‌ (kajal) కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి అనిల్‌ రావిపూడి దర్శకుడు. శ్రీలీల కీలక పాత్ర పోషిస్తున్నారు. అర్జున్‌ రాంపాల్‌ ప్రతినాయకుడిగా కనిపిస్తారు. షైన్‌ స్ర్కీన్‌ పతాకంపై సాహు గారపాటి, హరీశ్‌ పెద్ది నిర్మిస్తున్నారు. అభిమానులు, ప్రేక్షకకుల ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ట్రైలర్‌ రానే వచ్చింది. వరంగల్‌ వేదికగా ట్రైలర్‌ను విడుదల చేశారు.

బాలకృష్ణ తాలుక మాస్‌ ఎలిమెంట్స్‌ పవర్‌ఫుల్‌ డైలాగ్‌లతో ట్రైలర్‌ కట్‌ చేశారు అనిల్‌ రావిపూడి. బిడ్డని స్ట్రాంగ్‌ చేయాలి.. షేర్‌ లెక్క అంటూ శ్రీలీల గురించి బాలయ్య చెప్పిన డైలాగ్‌లు,

ఎత్తిన చెయ్యి ఎవనిదో తెలియాలి..

లేచిన నోరు ఎవనిదో తెలియాలి..

మిమ్మిల్ని పంపిన కొడుకు ఎవడో తెలియాలి...

చప్పుడు చేయాక్‌... పిల్ల మొగ్గ

అంటూ బాలయ్య డైలాగ్‌లు చెబుతుంటూ అభిమానులకు పండగే అనిపిస్తోంది. దసరా కానుకగా ఈ నెల 19న ఈ చిత్రం విడుదల కానుంది.

bhagavanth-1.jpg

Updated Date - 2023-10-08T22:49:02+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!