Chatrapathi: సినిమా ప్లాప్... బెల్లంకొండ ఇక తెలుగుకే పరిమితం

ABN , First Publish Date - 2023-05-20T17:42:05+05:30 IST

తెలుగు నటుడు బెల్లంకొండ శ్రీనివాస్ హిందీలోకి 'ఛత్రపతి' సినిమాతో ఆరంగేట్రం చేసాడు. వివి వినాయక్ దీనికి దర్శకుడు, ఇది రాజమౌళి, ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చిన తెలుగు 'ఛత్రపతి' కి రీమేక్. గతవారం విడుదల అయిన ఈ సినిమాని హిందీ ప్రేక్షకులు పట్టించుకోలేదు, కలెక్షన్స్ దారుణంగా వున్నాయి. అందుకే శ్రీనివాస్ ఇక తెలుగు సినిమాల మీదే దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నట్టుగా తెలిసింది.

Chatrapathi: సినిమా ప్లాప్... బెల్లంకొండ ఇక తెలుగుకే పరిమితం
Bellamkonda Sreenivas

బెల్లంకొండ శ్రీనివాస్ (BellamkondaSreenivas) హిందీ చిత్రపరిశ్రమ లోకి 'ఛత్రపతి' #Chatrapathi సినిమా ద్వారా ఆరంగేట్రం చేసాడు. ఇది అప్పుడెప్పుడో రాజమౌళి (SSRajamouli), ప్రభాస్ (Prabhas) కాంబినేషన్ లో వచ్చిన తెలుగు 'ఛత్రపతి' #Chatrapathi కి రీమేక్. ఈ హిందీ సినిమాకి మన తెలుగు దర్శకుడు వి వి వినాయక్ (VV Vinayak) దర్శకత్వం వహించాడు. బెల్లంకొండ శ్రీనివాస్ తెలుగు సినిమాలు కొన్ని హిందీలోకి డబ్ అయి అక్కడ బ్రహ్మాండంగా చూసారు. అవన్నీ యూట్యూబ్ లో పెద్ద హిట్ అయ్యాయి. అక్కడ శ్రీనివాస్ కి క్రేజ్ పెరిగింది.

ఆ క్రేజ్ తోటే బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాలను ఎవరు అయితే హిందీ లోకి డబ్ చేసి విడుదల చేశారు, వాళ్ళే ఈ హిందీ 'ఛత్రపతి' ని కూడా నిర్మించారు. కానీ వాళ్ళందరి ఆశలు అడియాసలు అయ్యాయి. ఎందుకంటే సినిమా విడుదల అయిన తరువాత బాక్స్ ఆఫీస్ దగ్గర కొంచెం అయినా ప్రభావం చూపిస్తుంది అని అనుకున్నారు కానీ, అస్సలు విడుదల అయినట్టే ఎవరికి తెలియదట, అంతలా పోయింది అంటున్నారు.

bellamkondasreenivas2.jpg

ఈ సినిమాని రూ 60 కోట్లు (60 crore) పెట్టి తీశారు, అయితే ఈ సినిమా థియేట్రికల్ కలక్షన్స్ మొత్తం ఒక కోటి (One crore) రూపాయలు మాత్రమే వచ్చిందని ట్రేడ్ అనలిస్ట్స్ చెపుతున్నారు. అంటే ఈ సినిమా ఎంత డిజాస్టర్ అయిందో తెలిసిపోతోంది. అయితే 'ఛత్రపతి' విడుదలకి ముందు అదే నిర్మాతలు, శ్రీనివాస్ తో ఇంకో రెండు సినిమాలు ప్లాన్ లో ఉన్నాయని చెప్పారు. కానీ ఇప్పుడు తీరా ఈ హిందీ ఛత్రపతి కలెక్షన్స్ చూసాక, శ్రీనివాస్ ఇక హిందీ సినిమా రంగం వైపు చూడకుండా, తెలుగు సినిమాల మీదే ఇక దృష్టి పెట్టాలని అనుకుంటున్నట్టు గా సమాచారం.

ఎందుకంటే మాతృబాష తెలుగు, ముందు ఇక్కడ చేసి ఆ సినిమా బాగుంటే, అది హిందీలో విడుదల చేయొచ్చు అని అందుకే ఇక హిందీ సినిమాల జోలికి పోకుండా పూర్తిగా తెలుగు సినిమాల మీదే కాన్సెన్ట్రేట్ చెయ్యాలని డిసైడ్ అయ్యాడు అని తెలిసింది. తెలుగులో ఇప్పటికే సాగర్ చంద్ర (SagarChandra) దర్శకత్వంలో ఒక సినిమా ప్రకటించారు, అది ఇప్పుడు షూటింగ్ మొదలెట్టాలి.

Updated Date - 2023-05-20T17:42:05+05:30 IST