TarakaRatna: తారకరత్న హెల్త్ బులిటెన్‌ విడుదల.. చేదు నిజం చెప్పిన వైద్యులు

ABN , First Publish Date - 2023-01-28T16:00:35+05:30 IST

గుండెపోటుతో బెంగళూరులోని నారాయణ హృదయాలయలో చికిత్స పొందుతున్న సినీ నటుడు నందమూరి తారకరత్న (TarakaRatna Health Bulletin) హెల్త్ బులిటెన్‌ను తాజాగా..

TarakaRatna: తారకరత్న హెల్త్ బులిటెన్‌ విడుదల.. చేదు నిజం చెప్పిన వైద్యులు

బెంగళూరు: గుండెపోటుతో బెంగళూరులోని నారాయణ హృదయాలయలో చికిత్స పొందుతున్న సినీ నటుడు నందమూరి తారకరత్న (TarakaRatna Health Bulletin) హెల్త్ బులిటెన్‌ను తాజాగా విడుదల చేశారు. తారకరత్న ఆరోగ్యం అత్యంత విషమంగా (TarakaRatna Health Condition Highly Critical) ఉన్నట్లు హెల్త్ బులిటెన్‌లో వైద్యులు వెల్లడించారు. కార్డియాలజిస్ట్‌లు, ఇంటెన్సివిస్ట్‌లతో సహా మల్టీ- డిసిప్లినరీ క్లినికల్ టీమ్ తారకరత్న ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. జనవరి 28న అర్ధరాత్రి 1 గంటలకు రోడ్డు మార్గంలో తారకరత్నను అంబులెన్స్‌లో నారాయణ హృదయాలయకు (Narayana Hrudayalaya Hospital) తరలించారు.

Narayana_Hrudayalaya.jpg

మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ (Myocardial Infarction) తర్వాత కార్డియోజెనిక్ షాక్ కారణంగా ఆయన పరిస్థితి అత్యంత క్లిష్టంగా ఉందని వైద్యులు హెల్త్ బులిటెన్‌లో తెలిపారు. ఎక్మో వైద్య విధానం (Ecmo Treatment) ద్వారా తారకరత్నకు కృతిమంగా శ్వాసనందిస్తున్నట్లు తెలిసింది. బెలూన్ యాంజియోప్లాస్టీ ద్వారా రక్తాన్ని పంపింగ్ చేసేందుకు వైద్యులు ప్రయత్నం చేస్తున్నారు. నందమూరి బాలకృష్ణ హాస్పిటల్‌లో ఉండి కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా సాయంత్రానికి హాస్పిటల్‌కు వెళతారని తెలిసింది.

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ చేపట్టిన యువగళం పాదయాత్రలో పాల్గొనడానికి కుప్పం వెళ్లిన సినీనటుడు నందమూరి తారకరత్న అస్వస్థతకు గురయ్యారు. కుప్పం పట్టణం లక్ష్మీపురంలోని మసీదులో శుక్రవారం జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో లోకేశ్‌, నందమూరి బాలకృష్ణ, తారకరత్న పాల్గొన్నారు. మిగిలినవారి కంటే కాస్త ముందుగా తారకరత్న మసీదు నుంచి బయటికి వచ్చేశారు. మసీదు బయట కాస్త దూరంలో ఒక్కసారిగా సొమ్మసిల్లి కింద పడిపోయారు. వెంటనే యువగళం బృందంలోని వలంటీర్లు ఆయన్ను కారులో కుప్పంలోని కేసీ ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడ వైద్యులు ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం పట్టణంలోని పీఈఎస్‌ మెడికల్‌ కాలేజీకి తరలించారు.

నందమూరి బాలకృష్ణ, గోరంట్ల బుచ్చయ్య చౌదరి తదితరులు పీఈఎస్‌కు వెళ్లి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించారు. తొలుత బెంగళూరులోని నారాయణ హృదయాలయకు ఎయిర్‌ అంబులెన్సులో తరలిద్దామని ప్రయత్నించినా, అది దక్షిణాదిన ఎక్కడా అందుబాటులో లేదు. కాగా, టీడీపీ అధినేత చంద్రబాబు తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసి, పీఈఎస్‌ ఆస్పత్రి వైద్యులతో మాట్లాడారు. ప్రముఖ సినీనటుడు జూనియర్‌ ఎన్టీఆర్‌, తారకరత్న భార్య కూడా బాలకృష్ణకు ఫోన్‌ చేసి ఆయన ఆరోగ్యం గురించి తెలుసుకున్నారు.

విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. తారకరత్న గుండెలో బ్లాక్స్‌ అధికంగా ఉన్నాయి. స్టంట్‌ వేయాలంటే షుగర్‌ సాధారణ స్థితిలో ఉండాలి. కొన్నాళ్లుగా ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ షుగర్‌ టాబ్లెట్స్‌ వేసుకోకపోవడంతో షుగర్‌ లెవల్‌ 400కు చేరింది. ఈ కారణంగా వైద్యులు స్టంట్స్‌ వేయలేకపోయారు. బెంగళూరు నుంచి నారాయణ హృదయాలయ వైద్యబృందం పీఎస్‌ఈ ఆస్పత్రికి వచ్చి తారకరత్నను పరీక్షించింది. తారకరత్నను మెరుగైన చికిత్స నిమిత్తం అర్ధరాత్రి 1 గంటకు బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పతికి తరలించారు.

Updated Date - 2023-01-28T16:03:22+05:30 IST