Bandla Ganesh: బండ్లన్న మళ్ళీ సంచలన వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2023-06-13T16:37:05+05:30 IST

బండ్ల గణేష్, విక్టరీ మధుసూధన రావు శత జయంతి ఉత్సవానికి హాజరయి అక్కడ తన జీవితంలో ముగ్గురుకి ఎప్పుడూ రుణపడి వుంటాను అని చెప్పాడు. ఆ ముగ్గురు ఎవరు, ఎందుకు అన్న విషయాలు కూడా చెప్పాడు.

Bandla Ganesh: బండ్లన్న మళ్ళీ సంచలన వ్యాఖ్యలు
Bandla Ganesh

ఈమధ్య కొందరు ఏమి మాట్లాడినా ఆ వార్తలు వైరల్ అయిపోతూ ఉంటాయి. నిర్మాత, నటుడు అయిన బండ్ల గణేష్ (BandlaGanesh) విషయంలో కూడా అదే వర్తిస్తుంది. ఎందుకంటే అతను ఏ ఫంక్షన్ కి వచ్చి ఏమి మాట్లాడతాడా అని అందరూ ఎదురు చూస్తుంటారు, ఈసారి ఎవరి మీద సెటైర్ (Satire) వేస్తుంటాడు అని వినడానికి సిద్ధం అవుతారు. ట్విట్టర్ లో అయితే గురూజీని వదలటం లేదు, అతని మీద ఏవేవో పోస్ట్ లు పెడుతూనే వున్నాడు.

Bandla1.jpg

నిన్న లెజెండరీ దర్శకుడు దివంగత వి మధుసూధన రావు (VMadhusudhanaRao) శత జయంతి వుత్సవాలకి బండ్ల గణేష్ హాజరయ్యాడు. అక్కడ అతని మళ్ళీ కొన్ని కామెంట్స్ చేసాడు, అవి వైరల్ అయ్యాయి. అయితే ఈసారి సెటైరికల్ గా ముందుగా 'నేను చెప్తున్నవి రాసుకోండి అందరూ, పనికొస్తాయి' అంటూ స్టార్ట్ చేసాడు తన స్పీచ్ ని.

ఇంతకీ అతను ఏమి చెప్పాడు అంటే, తన జీవితంలో ముగ్గురికి జీవితాంతం రుణపడి వున్నాను అని. అందులో మొదటి వ్యక్తి వి. మధుసూధనరావు అని. అయన స్టార్ట్ చేసిన మధు ఫిలిం ఇన్స్టిట్యూట్ (MadhuFilmInstitute) ద్వారానే తాను పరిశ్రమలోకి అడుగుపెట్టానని చెప్పాడు బండ్ల గణేష్. తనకి 15 ఏళ్ళు వున్నప్పుడు మధు ఫిలిం ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయ్యానని, అక్కడ నటన నేర్చుకున్నాను అని, అక్కడ నేర్చుకున్న తరువాత ప్రతి దర్శకుడు, నిర్మాత వేషం ఇవ్వకపోయినా గౌరవం ఇచ్చేవారని చెప్పాడు. మధుసూధన రావు గారి వ్యక్తిత్వాన్ని అలాగే ఆ ఇన్స్టిట్యూట్ ఎంతమందికి జీవనోపాధి కల్పించిందో అప్పటి మెమోరీస్ నెమరువేసుకున్నాడు గణేష్.

ఇంకో రెండో వ్యక్తి దర్శకుడు ఎస్ వి కృష్ణారెడ్డి (SVKrishnaReddy) అని, ఎందుకంటే అతను నటుడిగా తనకు మొదటి అవకాశం ఇచ్చారని, అలాగే నిర్మాతగా అవకాశం ఇచ్చి పరిశ్రమలో ముందుకు తీసుకెళ్లిన మూడో వ్యక్తి పవన్ కళ్యాణ్ (PawanKalyan) అని, ఈ ముగ్గురు వ్యక్తులని తన జీవితాంతం గుర్తు పెట్టుకుంటాను అని చెప్పాడు బండ్ల గణేష్.

Updated Date - 2023-06-13T16:37:43+05:30 IST