Nbk-Akhanda sequel: బాలకృష్ణ ఆలోచన అది... బోయపాటి ఏం చేస్తాడో!

ABN , First Publish Date - 2023-05-08T12:04:09+05:30 IST

బాలకృష్ణ (Balakrishna)- బోయపాటి శ్రీను(Boyapati Srinu) లది క్రేజీ కాంబినేషన్‌. వీరిద్దరి కలయికలో సినిమా అంటే ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

Nbk-Akhanda sequel: బాలకృష్ణ ఆలోచన అది... బోయపాటి ఏం చేస్తాడో!

బాలకృష్ణ (Balakrishna)- బోయపాటి శ్రీను(Boyapati Srinu) లది క్రేజీ కాంబినేషన్‌. వీరిద్దరి కలయికలో సినిమా అంటే ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటికే ఈ క్రేజీ కాంబోలో వచ్చిన సింహా, లెజెండ్‌, అఖండ చిత్రాలు బ్లాక్‌బస్టర్‌ హిట్స్‌ కొట్టారు. హ్యాట్రిక్‌ విజయాన్ని అందుకున్నారు. ప్రస్తుతం బాలయ్య అనిల్‌ రావిపూడితో సినిమా చేస్తున్నారు. ఆ సినిమా పూర్తయ్యాక బోయపాటితో ఓ సినిమా చేస్తారని ఎప్పటి నుంచో టాక్‌ వినిపిస్తోంది. ఈ కాంబో గురించి సోమవారం నుంచి ఓ వార్త నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. 2024 ఎన్నికలకు ఉపయోగపడేలా బోయపాటి శ్రీను ఈ చిత్రాన్ని ప్లాన్‌ చేస్తున్నారట. అభిమానుల కోరిక కూడా అదేనని సన్నిహితులు చెబుతున్నారు. అభిమానుల కోరిక, బాలయ్య కలయిక అంటే బోయపాటి ఊరుకుంటాడా? హిస్టరీ రిపీట్‌ అనే కథ సిద్ధం చేసుకుని బాలయ్య ముందు వాలిపోతాడు. ఇప్పుడు అదే జరుగుతోందని అభిమాన వర్గాల నుంచి సమాచారం. బాలకృష్ణ-బోయపాటి కాంబినేషన్‌లో వచ్చిన మూడు చిత్రాలకు భిన్నంగా, అంతకుమించి అనేలా ఓ లైన్‌ సిద్థం చేశాడట బోయపాటి. కానీ బాలయ్యకు మాత్రం ‘అఖండ’కు సీక్వెల్‌ తీయాలనుందట. (Akhanda sequel)

అఖండలో మాస్‌ అంశాలతోపాటు, ఎలివేషన్లు ఎలా ఉంటాయో తెలిసిందే! ఇక బాలయ్య నోట బోయపాటి రాసిన డైలాగ్‌...వింటే అదో కిక్కు అనేలా ఉంటాయి. హిందుత్వం అనేది ఇప్పుడు దేశంలో ట్రెండింగ్‌లో ఉన్న పాయింట్‌. ఆ దాన్ని కాస్త బలంగా చెబితే ప్రేక్షకుల రీచ్‌తోపాటు, కాసుల వర్షం ఖాయం. అందుకే బాలయ్య అఖండ సీక్వెల్‌ వైపే ఆలోచిస్లున్నట్లు తెలుస్తోంది. దర్శకుడికి కూడా అదే సూచించినట్లు సమాచారం. ప్రస్తుతం బోయపాటి రామ్‌తో ఓ సినిమా చేస్తున్నాడు. దాని తర్వాత పూర్తిస్థాయిలో బాలయ్య కథపై దృష్టిపెడతాడని తెలుస్తోంది.

Updated Date - 2023-05-08T12:04:22+05:30 IST