Nandamuri Balakrishna: వరస విజయాలతో పారితోషికం పెంచేసాడు

ABN, First Publish Date - 2023-02-16T14:11:19+05:30

ఇప్పుడు చాలామంది నటులు పారితోషికం పెంచుకుంటూ వెళుతున్నారు. వరస విజయాలతో వున్న బాలకృష్ణ కూడా పారితోషికం కొంచెం పెంచితే బాగుంటుంది అని తన పారితోషికాన్ని కూడా పెంచాడని ఒక టాక్ నడుస్తోంది పరిశ్రమలో.

Nandamuri Balakrishna: వరస విజయాలతో పారితోషికం పెంచేసాడు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) ఈమధ్య వరస విజయాలు సాధిస్తున్నారు. మామూలుగా అయితే బాలకృష్ణ పారితోషికం (Balakrishna remuneration) గురించి ఎప్పుడూ చర్చ రాదు, ఉండదు. ఎందుకంటే కొంచెం నిర్మాతలని దృష్టిలో పెట్టుకొని తన పారితోషికం తీసుకుంటూ ఉంటాడు. అయితే ఇప్పుడు చాలామంది నటులు పారితోషికం పెంచుకుంటూ వెళుతున్నారు. వరస విజయాలతో వున్న బాలకృష్ణ కూడా పారితోషికం కొంచెం పెంచితే బాగుంటుంది అని తన పారితోషికాన్ని కూడా పెంచాడని ఒక టాక్ నడుస్తోంది పరిశ్రమలో.

ఇప్పుడు బాలకృష్ణ తన పారితోషికాన్ని (Remuneration) 20 కోట్లకు చేసినట్టు భోగట్టా. ఇప్పుడు దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi) తో చేస్తున్న సినిమాకి ఇదే పారితోషికాన్ని తీసుకుంటున్నాడు అని కూడా అంటున్నారు. బాలకృష్ణ ఎప్పుడు పడితే అప్పుడే ఎలా అంటే అలా తన పారితోషికాన్ని పెంచే నటుడు కాదు కాబట్టి, కొన్ని సంవత్సరాలకి ఒకసారి పెంచుకుంటూ వెళతాడు. ఇప్పుడు అతని సినిమాలు కూడా 70 కోట్ల వరకు ధియేటరికల్ వ్యాపారం చేస్తున్నాయి, అదీ కాకుండా అతని సినిమాలు ఓ.టి.టి, టీవీ చానెల్స్ లో మంచి డిమాండ్ వుంది వాటికీ కూడా బాగా డబ్బులు చేసుకుంటున్నారు నిర్మాతలు కాబట్టి, బాలకృష్ణ తన పారితోషికాన్ని పెంచాడు అని అంటున్నారు.

veerasimha.jpg

ఇంతకు ముందు సుమారు 15 కోట్లు వరకు తీసుకున్న బాలకృష్ణ ఇకనుండి 20 కోట్లు తీసుకుంటాడు. అతని సినిమాలకి వచ్చిన క్రేజ్, వున్న డిమాండ్ అలాంటిది మరి. నిర్మాతలు కూడా అతనికి ఇవ్వడానికి వున్నారు కూడా. చలన చిత్ర పరిశ్రమలో చాలామంది నటులు ఇప్పుడు సుమారు 100 కోట్లు దాటి, అలాగే కొందరు 20 నుంచి 25 కోట్లు, అలాగే 40 నుంచి 50 కోట్లు కూడా తీసుకుంటున్న వారు వున్నారు. అతని సినిమాలు అఖండ (Akhanda), వీరసింహా రెడ్డి (Veera Simha Reddy) మంచి విజయాలు నమోదు చేసాయి.

Updated Date - 2023-02-16T14:11:21+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!