Record Break: ఇంకా నాలుగు నెలలు కూడా అవలేదు, 100కి పైగా అవార్టులు సొంతం చేసుకుంది

ABN , First Publish Date - 2023-07-06T07:32:02+05:30 IST

పెద్ద స్టార్ తో పెద్ద బడ్జెట్ సినిమా తీసాం వందల కోట్లు వచ్చాయి, బాక్స్ ఆఫీస్ బద్దలయిపోయింది.. ఇలాంటివి నిర్మాతకి, నటీనటులకు సంతోషంగా ఉంటుందేమో... కానీ 'బలగం' ఒక చిన్న సినిమా, పెద్ద విజయం, ప్రతి ఒక్కరూ ప్రశంశ, డబ్బులతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఆ సినిమా గురించి మాట్లాడటం, ఆ సినిమాకి 100 కి పైగా అంతర్జాతీయ అవార్డులు రావటం, ఇలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తాయి అనుకోవటం, ఇలాంటివి కథ నిర్మాతకి, దర్శకుడుకి అందులో పనిచేసే వాళ్ళకి 'సంతృప్తి' ఇచ్చేది

Record Break: ఇంకా నాలుగు నెలలు కూడా అవలేదు, 100కి పైగా అవార్టులు సొంతం చేసుకుంది
Balagam won people's hearts and also won International Awards

ఈ సంవత్సరం ఎన్ని సినిమాలు విడుదల అయినా అందులో 'బలగం' #Balagam అనే సినిమా మాత్రం ప్రత్యేకం. ఎందుకంటే ఇది ప్రభాస్ (Prabhas), పవన్ కళ్యాణ్ (PawanKalyan) సినిమాలు చేసినట్టు భారీ బడ్జెట్ తో తీయలేదు. అలాగే మొదటి రోజు వందల కోట్లు కలెక్షన్స్ కూడా సొంతం చేసుకోలేదు. కానీ ఈ సినిమాకి ఒక ప్రత్యేకత వుంది, అది ఏంటంటే, ఇలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తూ ఉంటాయి. ఇలాంటి సినిమాలు రావటానికి నిర్మాత దిల్ రాజు (DilRaju) ఒక కారణం అయితే, ఈ సినిమాకి దర్శకత్వం వహించిన వేణు ఎల్దండి (VenuYeldandi) ఇంకో కారణం.

balagam2.jpg

'బలగం' #Balagam సినిమా తెలంగాణలోని ఒక పల్లెలో జరిగిన ఒక కుటుంబం గురించి, ఆ కుటుంబానికి అండగా బలం లా నిలిచినా ఆ పల్లె ప్రజల అనుబంధాలు, మానవ సంబంధాలు గురించి చెప్పిన ఒక భావోద్వేగమైన కథ. అటువంటి ఈ సినిమా విడుదలై ఇంకా నాలుగు నెలలు అయిందో లేదో కానీ 100 అంతర్జాతీయ అవార్డులు తెచ్చి పెట్టింది. అంటే ఈ సినిమా ఎంత బలమైనదో తెలుస్తోంది కదా.

ప్రియదర్శి (PriyadarshiPulikonda), కావ్యా కళ్యాణ్ (KavyaKalyanram) జంటగా నటించిన ఈ సినిమా మొదటి రోజు అంతగా ప్రేక్షకులు పట్టించుకోలేదు, కానీ నోటి మాటతో ఈ సినిమాని అందరూ చూడాలని రెండో రోజు నుండి ప్రేక్షకులు థియేటర్ కి రావటం మొదలెట్టారు. సినిమా ప్రేక్ష‌కులే కాదు, ఈ సినిమాని చూసిన ప్రతి ఒక్కరు ఈ సినిమా గురించి మాట్లాడకుండా ఉండలేకపోయారు. మీడియా కూడా ఎన్నో ఏళ్లకు గానీ ఇలాంటి సినిమా రాదనీ అందుకని ఈ ‘బలగం’ సినిమాని తమ భుజాలకి ఎత్తుకున్నారు. చిన్న బడ్జెట్ తో తీసిన ఈ సినిమా థియేట‌ర్స్‌లో క‌లెక్ష‌న్స్ ప‌రంగా కూడా ఒక సంచలనం క్రియేట్ చేయ‌ట‌మే కాకుండా ఓటీటీలోనూ అదే రికార్డ్స్ క్రియేట్ చేసింది. 100 International Awards for Balagam.

balagamreview3.jpg

అయితే ఈ సినిమా ఒక్క తెలుగు ప్రేక్షకుల హృదయాల్లోనే కాకుండా అంత‌ర్జాతీయంగా ప్రేక్ష‌కుల హృద‌యాల‌ను కూడా దోచుకుంది. ఇప్పుడు ఈ ‘బలగం’ ఓ అరుదైన రికార్డ్‌ను సొంతం చేసుకుంది. ఒక‌టి కాదు రెండు కాదు.. ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న దేశాల్లోని ఫిల్మ్ ఫెస్టివ‌ల్స్‌లో ప్ర‌ద‌ర్శింపబ‌డి 100కి పైగా అంత‌ర్జాతీయ అవార్డుల‌ను సొంతం చేసుకుంది. తెలంగాణ నేప‌థ్యంలో తెర‌కెక్కిన చిత్ర‌మిది. ఇక్క‌డి సంస్కృతి, సాంప్ర‌దాయాల‌ను హృద్యంగా తెర‌కెక్కించిన తీరు అంత‌ర్జాతీయంగా ప్రేక్ష‌కుల మెప్పును పొందేలా చేసింది. ఇందులో న‌టీన‌టులు అద్భుతంగా న‌టించారు. దానికి తోడు చ‌క్క‌టి సాంకేతిక‌త తోడు కావ‌టంతో సినిమా అంద‌రి హృద‌యాల‌ను క‌దిలించింది. అంత‌ర్జాతీయంగా ఎన్నో విభాగాల్లో అవార్డుల‌ను సొంతం చేసుకుందీ చిత్రం.

balagam-team.jpg

‘బలగం’ సినిమా అంత‌ర్జాతీయంగా 100 అవార్డుల‌ను సొంతం చేసుకోవ‌టంపై ఈ చిత్ర నిర్వాహకులు సంతోషాన్ని వ్య‌క్తం చేశారు. ‘‘ఇదొక అద్భుత‌మైన మ‌రుపురాని ప్ర‌యాణం. ఇది వ‌ర‌కు మ‌న సినిమాలు 100 రోజులు.. 100 సెంట‌ర్స్‌.. 100 కోట్లు క‌లెక్ట్ చేయ‌టం వంటి రికార్డుల‌ను సాధించాయి. ఇప్పుడు 100 అంత‌ర్జాతీయ అవార్డుల‌ను సాదించ‌టంతో బ‌ల‌గం సినిమా ప్ర‌త్యేకమైన చిత్రంగా నిలిచింది’’ అన్నారు. ప్రియదర్శి, కావ్యా కళ్యాణ్ రామ్ జంటతో పాటు ఈ చిత్రంలో వేణు, మురళీధర్ గౌడ్, జయరామ్, రూప, రచ్చ రవి తదితరులు ఇతర కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. హ‌ర్షిత్ (HarshithReddy), హ‌న్షిత (Hanshitha) బ‌ల‌గం సినిమాను ప‌రిమిత‌మైన బ‌డ్జెట్‌లో నిర్మించారు. భీమ్స్ సిసిరోలియో త‌న అద్భుత‌మైన సంగీతంతో ఈ ఎమోష‌న‌ల్ ఫ్యామిలీ డ్రామాకు ప్రాణం పోశారు.

Updated Date - 2023-07-06T07:35:18+05:30 IST