Bala Krishna: తెలుగు సినిమా సత్తా చాటుతోంది!

ABN , First Publish Date - 2023-08-26T10:37:20+05:30 IST

జాతీయ అవార్డులు పొందిన అందరికీ నందమూరి బాలకృష్ణ శుభాకాంక్షలు తెలిపారు. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన నేషన్‌ల్‌ అవార్డులపై స్పందించారు. ‘సోదరుడు అల్లు అర్జున్‌కు ఉత్తమ నటుడిగా నేషనల్‌ అవార్డ్‌ దక్కడం నటనా కుటుంబానికే కాదు తెలుగు పరిశ్రమకు గర్వకారణం.

Bala Krishna: తెలుగు సినిమా సత్తా చాటుతోంది!

జాతీయ అవార్డులు పొందిన అందరికీ నందమూరి బాలకృష్ణ శుభాకాంక్షలు తెలిపారు. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన నేషన్‌ల్‌ అవార్డులపై స్పందించారు. ‘సోదరుడు అల్లు అర్జున్‌కు ఉత్తమ నటుడిగా నేషనల్‌ అవార్డ్‌ దక్కడం నటనా కుటుంబానికే కాదు తెలుగు పరిశ్రమకు గర్వకారణం. ఒకప్పుడు కొన్ని భాషలకే పరిమితమైన అవార్డులు తెలుగు చలనచిత్ర పరిశ్రమ కైవసం చేసుకుంది. మన ఇండస్ట్రీలో గొప్ప చిత్రాలు వస్తున్నాయి. ప్రపంచం మెచ్చే స్థాయిలో తెలుగు సినిమా ఉంది. ఇదే ఉత్సాహంతో మున్ముందు మరిన్ని మంచి చిత్రాలు రావాలి. ప్రపంచ స్థాయిలో ప్రేక్షకుల్ని అలరించి ఆస్కార్‌ అందుకున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మన దేశంలో పేరొందిన జాతీయ పురస్కారం ఆరు విభాగాల్లో రావడం ఎంతో ఆనందంగా ఉంది. ఉత్తమ నటుడిగా బన్నీకి అవార్డు రావడం ఓ నటుడిగా నాకెంతో గర్వంగా ఉంది. ‘ఉప్పెన’ టీమ్‌కు నా అభినందనలు’’ అని అన్నారు.

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో ‘భగవంత్‌ కేసరి’ చిత్రంతో నటిస్తున్నారు. కాజల్‌ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల కీలక పాత్రలో పోషిస్తోంది. షైన్‌ స్ర్కీన్‌ పతాకంపై సాహు గారపాటి, హరీశ్‌ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దాసరా కానుకగాఆ అక్టోబర్‌ 19న గ్రాండ్‌గా విడుదల కానుంది.

Updated Date - 2023-08-26T10:38:04+05:30 IST