Baby: వర్షాలు, వరదలు వచ్చినా బేబీ కలెక్షన్స్ మాత్రం తగ్గేదే లే !

ABN , First Publish Date - 2023-07-22T15:12:06+05:30 IST

వానలొచ్చినా, వరదలొచ్చినా 'బేబీ' సినిమా కలెక్షన్స్ మాత్రం తగ్గటం లేదు. మొదటి వారంలో ఎలా ఉందొ కలెక్షన్స్ రెండో వారంలోనూ అదే రేంజ్. నిర్మాత ఎస్ కె ఎన్ పంట పండింది, ఇప్పుడు ఈ సినిమా తక్కువరోజుల్లో 50 కోట్ల క్లబ్ లో చేరి సంచలనం సృష్టించింది.

Baby: వర్షాలు, వరదలు వచ్చినా బేబీ కలెక్షన్స్ మాత్రం తగ్గేదే లే !
A still from Baby

ఒకపక్క వర్షాలు పడుతూ వున్నాయి, రోడ్లు బాగోలేవు అంటున్నారు, బయటకి రావద్దు అంటున్నారు, ఈ తరుణంలో సినిమా కలెక్షన్స్ కూడా తగ్గిపోతాయి అని అనుకుంటారు అందరూ. కానీ అందరినీ ఆశ్చర్యపరుస్తూ 'బేబీ' #BabyMovie సినిమా కలెక్షన్స్ మాత్రం వర్షంలానే తగ్గేదే లే అన్నట్టుగా బాక్స్ ఆఫీస్ దగ్గర సునామీ సృష్టిస్తోంది. 'బేబీ' #BabyMovieCollections లాంటి చిన్న సినిమా ఇంత కలెక్షన్ల వర్షం కురుపించటం పరిశ్రమలో అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది.

ఆనంద్ దేవరకొండ (AnandDevarakonda), వైష్ణవి చైతన్య (VaishnaviChaitanya), విరాజ్ అశ్విన్ (VirajAswin) నటించిన ఈ సినిమా కి సాయి రాజేష్ (SaiRajesh) దర్శకుడు. ఎస్ కె ఎన్ (SKN) దీనికి నిర్మాత. ఈ సినిమా విడుదలైన రోజు కొంచెం మిశ్రమంగా టాక్ వచ్చింది, కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం ఒకటే టాక్ అదే డబ్బుల వర్షం వినిపిస్తోంది. ఈ సినిమా ఇంత వర్షాలలోనూ ఇంత స్ట్రాంగ్ గా వుంది అంటే, ఈ సినిమా ప్రభావం ఎంత వుందో అర్థం అవుతోంది అని అంటున్నారు.

babyteam1.jpg

కొన్ని రోజుల క్రితం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (IconStarAlluArjun) ఈ సినిమా టీముని పిలిపించుకొని అందరినీ పేరు పేరునా అభినందలు తెలియచేస్తూ ఈ సినిమా ఇంత విజయం సాధించటం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఒక తెలుగు సినిమా ఇంతలా బాక్స్ ఆఫీస్ దగ్గర షేక్ చేస్తోంది అంటే ఈ సినిమా విజయం పట్ల అందరం ఆనందం పడతామని కూడా చెప్పారు. ఇందులో నటించిన వైష్ణవి చైతన్య ని (VaishnaviChaitanya) అర్జున్ ప్రత్యేకంగా అభినందించారు.

ఇప్పుడు ఈ చిన్న సినిమా రూ 50 కోట్ల క్లబ్ లో చేరిపోయింది (Baby in 50CroreClub). కేవలం ఎనిమిది రోజుల్లో ఇలా 50 కోట్ల క్లబ్ లో చేరిన ఒక చిన్న సినిమా ఏదైనా ఉందంటే అది 'బేబీ' #Baby అని మాత్రం చెప్పొచ్చు. అంటే ఈ సినిమా ఎంతలా చరిత్ర సృష్టిస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఇందులో సాయి రాజేష్ మాటలు, దర్శకత్వం, అలాగే నటించిన నటీనటుల ప్రతిభ, సంగీతం, ఛాయాగ్రహణం ఒకటేమిటి అన్నీ ఈ సినిమాకి హైలైట్ గా నిలిచి, ఈ సినిమా ఒక కల్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. రెండో వారంలో కి వచ్చినా ఈ సినిమా ఇంత వర్షాల్లో కూడా ఇంత స్ట్రాంగ్ గా వుంది అంటే, ఈ సినిమా లాంగ్ రన్ లో ఇంకెంత కలెక్టు చేస్తుందో అని అంటున్నారు. ఒక్క ఇండియాలోనే కాదు, విదేశాల్లో కూడా ఈ సినిమా ఒక ప్రభంజనంలా వెళుతోంది.

vaishnavichaitanya-baby1.jpg

విజయ్ దేవరకొండ (VijayDeverakonda) 'అర్జున్ రెడ్డి' #ArjunReddy అనే సినిమాతో ఎంత విజయం సాధించాడో, అతని తమ్ముడు ఆనంద్ దేవరకొండ ఈ 'బేబీ' సినిమాతో అన్నలాగే చాలా పెద్ద విజయం సాధించాడని చెప్పాలి. అన్న స్టార్ అయిపోయాడు, ఇప్పుడు తమ్ముడు కూడా ఈ విజయంతో అన్నలాగే పెద్ద స్టార్ అయ్యే సూచనలు కనపడుతున్నాయి. అన్నతో 'టాక్సీవాలా' తీసి విజయం సాధించిన ఎస్ కె ఎన్ (SKN) ఇప్పుడు తమ్ముడితో ఈ 'బేబీ' సినిమా తీసి ఇద్దరన్నదమ్ములతో మంచి విజయాల్ని నమోదు చేసుకున్నాడు.

Updated Date - 2023-07-22T15:12:06+05:30 IST