Baby: భారీ బడ్జెట్ సినిమా 'కెజిఫ్' రికార్డుని బ్రేక్ చేసిన ఈ చిన్న సినిమా, ఎలా అంటే...

ABN , First Publish Date - 2023-07-27T14:05:07+05:30 IST

నిన్న 'అర్జున్ రెడ్డి' సినిమాని 'బేబీ' సినిమా బ్రేక్ చేసింది, ఈరోజు ఇంకో పెద్ద సినిమా 'కెజిఫ్ 2' సినిమా రికార్డు ని కూడా ఈ చిన్న సినిమా బ్రేక్ చేసింది. అదెలాగో చూడండి

Baby: భారీ బడ్జెట్ సినిమా 'కెజిఫ్' రికార్డుని బ్రేక్ చేసిన ఈ చిన్న సినిమా, ఎలా అంటే...
A still from Baby

ఒకపక్క వర్షాలు, వరదలు, పట్టణాలలోకి కూడా వర్షం నీరు వచ్చేస్తోంది, కానీ 'బేబీ' #Baby సినిమా కలెక్షన్స్ మాత్రం తగ్గటం లేదు. ఆనంద్ దేవరకొండ (AnandDeverakonda), వైష్ణవి చైతన్య (VaishnaviChaitanya), విరాజ్ అశ్విన్ (VirajAshwin) లు నటించిన ఈ సినిమాకి సాయి రాజేష్ (SaiRajesh) దర్శకత్వం వహించారు. అలాగే శ్రీనివాస్ అలియాస్ SKN ఈ సినిమాకి నిర్మాత. ఈ సినిమా విడుదలైన మొదటి రోజు నుండే సంచలనాలు సృష్టించే దిశగా పయనం అయింది. నిన్న ఈ సినిమా ఆనంద్ దేవరకొండ అన్న విజయ్ దేవరకొండ (VijayDeverakonda) సినిమా 'అర్జున్ రెడ్డి' #ArjunReddy ని బ్రేక్ చేసింది.

babyteam.jpg

ఇప్పుడు ఈ చిన్న సినిమా ఇంకో పెద్ద సినిమా రికార్డు ని బ్రేక్ చేసింది. ప్రశాంత్ నీల్ (PrashanthNeel) దర్శకత్వం వహించిన 'కెజిఫ్ 2' #KGF2 సినిమా రికార్డు ఈ 'బేబీ' బ్రేక్ చేసింది. అది ఎలా అంటే, 'బేబీ' సినిమా వరసగా 13 రోజుల పాటు ఒక కోటి రూపాయల షేర్ (One crore share continuously 13 days) ఆంధ్ర, తెలంగాణాలో కలెక్టు చేసింది. ఇది ఒక రికార్డు అని చెపుతున్నారు.

ఇంతకు ముందు 'కెజిఫ్ 2' 12 రోజులకు వరసగా ఇలా ఒక కోటి రూపాయల షేర్ వసూల్ చేసింది, ఇప్పుడు 'బేబీ' ఆ రికార్డు ని అధిగమించి 13 రోజులపాటు ఆలా కలెక్టి చేసింది. అయితే ఈ రెండింటి కన్నా టాప్ లో వుండే సినిమా 'ఆర్ఆర్ఆర్' #RRR ఈ సినిమా వరసగా 17 రోజుల పాటు ఒక కోటి రూపాయల షేర్ వసూల్ చేసింది.

babycollections.jpg

ఇంత వర్షాలలోనూ 'బేబీ' సినిమాకి తగ్గని ఆదరణ చూస్తుంటే ఆ సినిమా ప్రభావం ఎంతలా ఉందొ అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ సినిమా రాజమౌళి (SSRajamouli) సినిమా రికార్డు ను బ్రేక్ చేస్తుందా, లేక రెండో స్థానంలో ఉంటుందో ఈరోజు నుండి చూడాలి అని అంటున్నారు. అయితే 'ఆర్ఆర్ఆర్' రికార్డు బ్రేక్ చెయ్యడం సాధ్యం కాకపోవచ్చు, ఎందుకంటే రేపు పవన్ కళ్యాణ్ (PawanKalyan), సాయి ధరమ్ తేజ్ (SaiDharamTej) నటించిన 'బ్రో' #Bro సినిమా విడుదలవుతోంది. ఈ సినిమా కోసం చాలా థియేటర్స్ తీసుకుంటారు, అందుకని 'బేబీ' సినిమా ఆడుతున్న థియేటర్స్ కూడా తగ్గించవచ్చు. అందుకని 'ఆర్ఆర్ఆర్' రికార్డు బ్రేక్ చెయ్యడం సాధ్యం కాకపోవచ్చు అని కూడా అంటున్నారు. ఏమైనా 'బేబీ' సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర వండర్స్ క్రియేట్ చేస్తోందనే చెప్పాలి.

Updated Date - 2023-07-27T14:05:07+05:30 IST