Umapathi: సెన్సార్ ప్రశంసలు.. విడుద‌ల‌కు సిద్ధ‌మైన‌ అవికా గోర్ నిర్మించిన‌ ‘ఉమాపతి’

ABN , Publish Date - Dec 25 , 2023 | 07:41 PM

ప్రస్తుత తరుణంలో గ్రామీణ ప్రేమ కథలు రావడం అరుదుగా మారింది. ఇప్పుడు ఆ లోటు తీర్చేందుకు ‘ఉమాపతి’ అనే చిత్రం రాబోతోంది. ఈ సినిమాలో అనురాగ్ (హీరోగా నటించగా.. చిన్నారి పెళ్లికూతురు ఫేమ్ అవికా గోర్ హీరోయిన్ గా నటించడ‌మే కాక సినిమా నిర్మాణంలో భాగ‌మైంది.

Umapathi: సెన్సార్ ప్రశంసలు.. విడుద‌ల‌కు సిద్ధ‌మైన‌ అవికా గోర్ నిర్మించిన‌ ‘ఉమాపతి’
umapathi

ప్రేమ కథలు ఎప్పుడు వచ్చినా ఆడియెన్స్ ఆదరిస్తుంటారు. ప్రస్తుతం ఉన్న తరుణంలో గ్రామీణ ప్రేమ కథలు రావడం అరుదుగా మారింది. ఇప్పుడు ఆ లోటు తీర్చేందుకు అలాంటి ఓ కథతో ‘ఉమాపతి’ (Umapathi) అనే చిత్రం రాబోతోంది. ఈ సినిమాలో అనురాగ్ (Anuragh) హీరోగా నటించగా.. చిన్నారి పెళ్లికూతురు ఫేమ్ అవికా గోర్ (Avika Gor) హీరోయిన్ గా నటించడ‌మే కాక సినిమా నిర్మాణంలో భాగ‌మైంది.

క్రిషి క్రియేషన్స్ (Krishi Creations) బ్యానర్ కే.కోటేశ్వరరావు (KKoteswarRao) , అవికా స్క్రీన్ క్రియేషన్స్ (Avika Screen Creations) అవికాఘోర్ (Avika Gor) సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించగా.. సత్య ద్వారంపూడి (Satya Dwarapudi) దర్శకత్వం వహించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్లు, పాటలు, టీజర్ ఇలా అన్నీ కూడా పాజిటివ్ బజ్‌ను సొంతం చేసుకున్నాయి. రీసెంట్‌గా విడుదల చేసిన ట్రైలర్ సైతం అందరినీ ఆకట్టుకుంది.


ఇక తాజాగా ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెన్సార్ సభ్యులు ఈ చిత్రాన్ని వీక్షించి ప్రశంసలు కురిపించారు. పూర్తి కుటుంబ సమేతంగా చూడదగ్గ అందమైన ప్రేమ కథా చిత్రమని కొనియాడారు. ఈ చిత్రానికి సెన్సార్ సభ్యులు యూ/ఏ సర్టిఫికేట్‌ను జారీ చేశారు. డిసెంబర్ 29న థియేటర్లోకి వచ్చేందుకు రెడీ అయింది.

ఫిదా వంటి బ్లాక్ బస్టర్ మూవీకి పని చేసిన మ్యూజిక్ డైరెక్టర్ శక్తికాంత్ కార్తీక్ (Shakthi Kanth Karthick) ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఈ సినిమాకు రాఘవేంద్ర కెమెరామెన్‌గా, గౌతమ్ రాజు, నానిలు ఎడిటర్లుగా పని చేశారు. వెంకట్ ఆరే ఆర్ట్ డిపార్ట్మెంట్‌ను, చంద్రబోస్, మూర్తి దేవగుప్తపు, భాస్కర భట్ల పాటల రచయితలుగా పని చేశారు. ఈ మూవీ డిసెంబర్ 29న ప్రేక్షకుల ముందుకు రాబోతంది.

Updated Date - Dec 25 , 2023 | 07:41 PM