సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

RRR: రాజమౌళిపై ప్రశంసలు కురిపించిన ‘అవతార్’ డైరెక్టర్

ABN, First Publish Date - 2023-01-16T11:19:44+05:30

‘ఆర్ఆర్ఆర్’ (RRR).. ఈ భారతీయ, అందులోనూ ఓ తెలుగు సినిమా గురించే ప్రస్తుతం ప్రపంచం మొత్తం చర్చించుకుంటోంది.

SS Rajamouli
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘ఆర్ఆర్ఆర్’ (RRR).. ఈ భారతీయ, అందులోనూ ఓ తెలుగు సినిమా గురించే ప్రస్తుతం ప్రపంచం మొత్తం చర్చించుకుంటోంది. థియేటర్స్‌లో విడుదలై రూ.1200 కోట్లకి పైగా కలెక్షన్లు కొల్లగొట్టిన ఈ మూవీ.. ఓటీటీలోకి వచ్చాక ఎంతోమందికి చేరువైంది. చాలామంది వివిధ దేశాల సినీ ప్రముఖులు ఈ మూవీపై, రాజమౌళి (SS rajamouli)పై ప్రశంసలు కురిపించారు. తాజాగా ప్రపంచ దిగ్గజ, ‘అవతార్’ (Avatar) దర్శకుడు జేమ్స్ కామెరూన్ (James Cameron) కూడా రాజమౌళిపై ప్రశంసలు కురిపంచారు. ఈ విషయాన్ని తెలుపుతూ రాజమౌళి సోషల్ మీడియాలో ఓ పోస్టుని షేర్ చేశాడు.

రాజమౌళి షేర్ చేసిన పోస్టులో.. ‘గ్రేట్ జేమ్స్ కామెరాన్ RRRని చూశారు.. ఆయనకి ఈ సినిమా చాలా నచ్చింది. అందుకే ఆయన భార్యకి కూడా ఈ మూవీని చూడమని రిఫర్ చేశారు. ఆమెతో కలిసి రెండోసారి మళ్లీ చూశారు.

సర్.. మీరు మా సినిమాని విశ్లేషించడానికి మాతో మొత్తం 10 నిమిషాలు గడిపారని నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. మీరు చెప్పినట్లు నేను ప్రపంచంలోనే టాప్ కాదు. ఇద్దరికీ ధన్యవాదాలు’ అని రాసుకొచ్చాడు.

Updated Date - 2023-01-16T11:25:50+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!