Phalana Abbayi Phalana Ammayi: మరోసారి తన మార్కు చూపించిన అవసరాల శ్రీనివాస్

ABN , First Publish Date - 2023-02-09T19:48:53+05:30 IST

‘ఊహలు గుసగుసలాడే’ (Oohalu Gusagusalade), ‘జ్యో అచ్యుతా నంద’ (Jyo Achyutananda) సినిమాలను తెరకెక్కించి తనదైన మార్కు చూపించిన దర్శకుడు అవసరాల శ్రీనివాస్ (Avasarala Srinivas). చాలా కాలం తర్వాత ఆయన ‘ఫలానా అబ్బాయి, ఫలానా అమ్మాయి’ (Phalana Abbayi Phalana Ammayi ) టైటిల్‌తో ఓ చిత్రాన్ని తెరకెక్కించారు.

Phalana Abbayi Phalana Ammayi: మరోసారి తన మార్కు చూపించిన అవసరాల శ్రీనివాస్

‘ఊహలు గుసగుసలాడే’ (Oohalu Gusagusalade), ‘జ్యో అచ్యుతా నంద’ (Jyo Achyutananda) సినిమాలను తెరకెక్కించి తనదైన మార్కు చూపించిన దర్శకుడు అవసరాల శ్రీనివాస్ (Avasarala Srinivas). చాలా కాలం తర్వాత ఆయన ‘ఫలానా అబ్బాయి, ఫలానా అమ్మాయి’ (Phalana Abbayi Phalana Ammayi ) టైటిల్‌తో ఓ చిత్రాన్ని తెరకెక్కించారు. నాగ శౌర్య (Naga Shaurya), మాళవిక నాయర్ (Malvika Nair) హీరో, హీరోయిన్‌గా నటించారు. తాజాగా ఈ మూవీ టీజర్ రిలీజ్ అయింది. ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

అవసరాల శ్రీనివాస్ భావోద్వేగాలను చాలా బలంగా చూపెడతారు. అందరికి తెలిసిన కథనే కొత్తగా చెబుతారు. ‘ఫలానా అబ్బాయి, ఫలానా అమ్మాయి’ సినిమా అదే బాటలోనే కొనసాగనున్నట్టు టీజర్‌ను చూస్తే అర్థమవుతుంది. టీజర్‌ మొత్తం హీరో, హీరోయిన్‌ డైలాగ్స్‌తోనే కొనసాగింది. నాగశౌర్య, మాళవిక నాయర్ కెమిస్ట్రీ ఆకట్టుకుంది. కల్యాణి మాలిక్ అందించిన సంగీతం వీనుల విందుగా ఉంది. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, దాసరి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై టీజీ. విశ్వప్రసాద్, దాసరి పద్మజ, వివేక్ కూచిబోట్ల కలసి నిర్మించారు. ఈ మూవీ ఉగాది సందర్భంగా మార్చి 17న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Updated Date - 2023-02-09T19:50:32+05:30 IST