Atlee : మల్టీస్టారర్‌తోపాటు మరో ఎంట్రీ!

ABN , First Publish Date - 2023-11-20T19:03:41+05:30 IST

జవాన్ (Jawan) చిత్రంతో ప్యాన్ ఇండియా స్థాయిలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు అట్లీ (Atlee) ప్రస్తుతం ఆయన తదుపరి చిత్రం కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తాజాగా అట్లీకి సంబంధించిన ఓ వార్త నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది

Atlee : మల్టీస్టారర్‌తోపాటు మరో ఎంట్రీ!

జవాన్ (Jawan) చిత్రంతో ప్యాన్ ఇండియా స్థాయిలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు అట్లీ (Atlee) ప్రస్తుతం ఆయన తదుపరి చిత్రం కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తాజాగా అట్లీకి సంబంధించిన ఓ వార్త నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. ఆయన టాలీవుడ్‌కి ఎంట్రీ ఇవ్వనున్నారట. అయితే దర్శకుడిగా కాదు.. నిర్మాతగా తెలుగు సినిమాలో భాగం కానున్నారని తెలుస్తోంది.

ప్రస్తుతం ఈ వార్త కోలీవుడ్‌తోపాటు టాలీవుడ్‌లోనూ చక్కర్లు కొడుతోంది. ఆయన నిర్మాణ సంస్థ ‘ఏ ఫర్‌ యాపిల్‌ స్టూడియోస్‌’పై నాలుగు సినిమాలు నిర్మించనున్నారట. వాటిలో ఒక తెలుగు సినిమా ఉందని టాక్‌. అంతే కాదు (Straight Telugu movie) షారుక్‌ఖాన్, విజయ్‌తో కలిసి ఓ మల్టీస్టారర్‌ ప్లాన్ చేశారు అట్లీ. తదుపరి చిత్రం అదేనని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అట్లీ స్వయంగా చెప్పారు. అలాగే ఓ హాలీవుడ్‌ ప్రాజెక్ట్‌కు కూడా కథ అందిస్తున్నారు.

Updated Date - 2023-11-20T19:03:43+05:30 IST