Atharva: ట్రెండింగ్‌లో.. శశి కుమార్ తిక్కా, హీరో చైతన్య రావు వదిలిన ‘అథర్వ’ ట్రైలర్

ABN , First Publish Date - 2023-11-15T20:30:28+05:30 IST

సస్పెన్స్, క్రైమ్ జానర్‌లో అన్ని రకాల ఎమోషన్స్‌తో తెరకెక్కించిన చిత్రం ‘అథర్వ’. నూతలపాటి నరసింహం, అనసూయమ్మ సమర్పణలో పెగ్గో ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఈ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాలో కార్తీక్ రాజు, సిమ్రాన్ చౌదరి, ఐరా హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీ ట్రైలర్‌ను బుధవారం రిలీజ్ చేశారు.

Atharva: ట్రెండింగ్‌లో.. శశి కుమార్ తిక్కా, హీరో చైతన్య రావు వదిలిన ‘అథర్వ’ ట్రైలర్
atharva

సస్పెన్స్, క్రైమ్ జానర్‌లో అన్ని రకాల ఎమోషన్స్‌తో తెరకెక్కించిన చిత్రం ‘అథర్వ’(Atharva). నూతలపాటి నరసింహం, అనసూయమ్మ సమర్పణలో పెగ్గో ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఈ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాలో కార్తీక్ రాజు, సిమ్రాన్ చౌదరి, ఐరా హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీకి మహేష్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా సుభాష్ నూతలపాటి నిర్మిస్తున్నారు. విజయ, ఝాన్సీ ఎగ్జిగూటివ్ ప్రొడ్యూసర్స్‌గా వ్యవహరిస్తున్నారు. డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రాబోతోన్న ఈ మూవీ ట్రైలర్‌ను బుధవారం రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమానికి దర్శకుడు శశి కుమార్ తిక్కా, హీరో చైతన్య రావులు ముఖ్య అతిథులుగా విచ్చేసి ట్రైలర్ రిలీజ్ చేశారు.

ఈ సంద‌ర్భంగా శశి కిరణ్ మాట్లాడుతూ.. ‘అథర్వ’ నుంచి జావెద్ అలీ పాడిన పాటను నేను ఎప్పుడూ వింటూనే ఉంటాను. ఆ పాట తప్పా నాకు ఇంకేమీ తెలియదు. ట్రైలర్ ఇప్పుడే చూశాను. ప్రతీ విషయాన్ని ఎంతో డీటైలింగ్‌గా చూపించారన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్‌లో ఇంత ఉంటుందా? ఇంత పరిశీలనగా చూస్తారా? క్లూస్ టీం గురించి వివరించారు. ట్రైలర్ చూశాక సినిమా మీద ఇంట్రెస్ట్ పెరిగింది. డైరెక్టర్ మహేష్, నిర్మాత సుభాష్, సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరికీ ఆల్ ది బెస్ట్. డిసెంబర్ 1న ఈ మూవీ రాబోతోంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయాన్ని సాధించాల’ని కోరుకుంటున్నా అన్నారు.

దర్శకుడు మహేష్ రెడ్డి(mahesh reddy), నిర్మాత సుభాష్‌లు మాట్లాడుతూ..‘క్లూస్ డిపార్ట్మెంట్‌ను క్లుప్తంగా చూపించబోతున్నామ‌ని, సురేష్ ప్రొడక్షన్స్‌తో భారీ ఎత్తున రాబోతున్నాం అన్నారు. ట్రైలర్‌లో చూపించిన దానికంటే ఎక్కువ సినిమాలో ఉంటుందని, ప్రతీ ఒక్కరూ ప్రాణం పెట్టి ఈ చిత్రాన్ని చేశారన్నారు. శ్రీ చరణ్ పాకాల కొత్త సౌండ్‌ను క్రియేట్ చేశారన్నారు. కెమెరామెన్ చరణ్ నాకు ఎప్పటి నుంచో పరిచయమ‌ని, మంచి విజువల్స్ ఇచ్చారని తెలిపారు. హీరోహీరోయిన్లు కార్తీక్ రాజు, సిమ్రన్, ఐరా అద్భుతంగా నటించారన్నారు. సుభాష్, శ్రీనివాస్ గారు కథను నమ్మి ఇంత భారీ ఎత్తున నిర్మించారు. మా సినిమా ట్రైలర్ రిలీజ్ చేసిన శశికిరణ్ గారికి థాంక్స్, చైతన్య రావు నాకు మంచి మిత్రుడు అతని సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉంటుందన్నారు.


చైతన్య రావు మాట్లాడుతూ.. ‘డిసెంబర్ 1 అథర్వ థియేటర్లోకి రాబోతోంది. నేను ఈ చిత్రాన్ని ఆల్రెడీ చూశానని, ఇది పక్కా కమర్షియల్ సినిమా అని మూవీలో సౌండ్ అదిరిపోతుందన్నారు. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌కు ఆర్ఆర్ ఇంపార్టెంట్. అన్నీ ఒకెత్తు అయితే.. శ్రీ చరణ్ మ్యూజిక్ ఇంకో ఎత్తు. ఇంత వరకు క్లూస్ టీం మీద సినిమా రాలేదని, మహేష్ రెడ్డి కొత్త ప్రపంచాన్ని చూపించబోతున్నా రన్నారు. కార్తీక్ ఈ సినిమాతో మంచి మాస్ హీరో అవ్వాలని కోరుకుంటున్నానని, సిమ్రన్, ఐరాలు అద్భుతంగా నటించారన్నారు. ఇలాంటి చిత్రాన్ని నిర్మించిన సుభాష్‌కు హ్యాట్సాఫ్ అన్నారు.

హీరోహీరోయిన్లు కార్తీక్ రాజు(karthik raju), సిమ్రన్(Simran), ఐరా మాట్లాడుతూ.. ‘ఈ సినిమాకు పూర్తి క్రెడిట్ డైరెక్టర్ మహేష్ రెడ్డికే చెందుతుందని, కొత్త కాన్సెప్ట్‌తో రాబోతున్నామ‌ని, క్లూస్ టీం బ్యాక్ డ్రాప్‌తో ఇంత వరకు సినిమా రాలేదన్నారు. ఇలాంటి జానర్లో సినిమా చేయడం ఇదే మొదటి సారని, అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయని ఇలాంటి మంచి చిత్రాన్ని నిర్మించిన నిర్మాత సుభాష్‌కు థాంక్స్ అని డిసెంబర్ 1న అందరూ థియేటర్లో మా సినిమాను చూడండన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచరణ్ పాకాల(Sri charan Pakala) మాట్లాడుతూ.. ‘నేను థ్రిల్లర్ మూవీస్ చాలానే చేశానని, ఇన్వెస్టిగేషన్‌లో చాలా డిపార్ట్మెంట్లు ఉంటాయని, క్లూస్ డిపార్ట్మెంట్ గురించి చాలా మందికి తెలియదన్నారు. ఎంతో రీసెర్చ్ చేసి మహేష్ రెడ్డి ఈ మూవీని తీశారని, కొత్త సౌండ్ ఇవ్వడానికి నాకు స్కోప్ వచ్చిందన్నారు.

Updated Date - 2023-11-15T20:33:54+05:30 IST