Aswani Dutt : ఫ్యామిలీమ్యాన్‌ కథను చిరు తిరస్కరించడానికి కారణం అదే!

ABN , First Publish Date - 2023-08-30T17:27:38+05:30 IST

‘ఫ్యామిలీమ్యాన్‌’ హిందీ సిరీస్‌ ఎంతగా పాపులర్‌ అయిందో తెలిసిందే! ఆ సిరీస్‌ గురించి నిర్మాత అశ్వినీదత్‌ ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. చిరంజీవికి, ఆ కథకు ఉన్న సంబంధం ఏంటో ‘చూడాలని ఉంది’ చిత్రం 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన చెప్పుకొచ్చారు.

Aswani Dutt : ఫ్యామిలీమ్యాన్‌ కథను చిరు తిరస్కరించడానికి కారణం అదే!

‘ఫ్యామిలీమ్యాన్‌’(Family Man) హిందీ సిరీస్‌ ఎంతగా పాపులర్‌ అయిందో తెలిసిందే! ఆ సిరీస్‌ గురించి నిర్మాత అశ్వినీదత్‌ (C Aswini Dutt) ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. చిరంజీవికి (Chiranjeevi) ఆ కథకు ఉన్న సంబంధం ఏంటో ‘చూడాలని ఉంది’ చిత్రం 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన చెప్పుకొచ్చారు. ‘‘రామ్‌చరణ్‌ పరిచయ చిత్రం ‘చిరుత’ తర్వాత చిరంజీవిగారితో ఓ సినిమా చేయాలని ప్రయత్నించా. ఈ క్రమంలోనే దర్శక ద్వయం రాజ్‌, డీకేలు (RAj and DK)‘ది ఫ్యామిలీ మ్యాన్‌’ కథ సిద్థం చేశారు. అది పక్కాగా చిరంజీవి కోసమే రాసిన కథ. ‘ఖైదీ నం. 150’ సినిమా విజయోత్సాహంలో ఉన్న సమయంలో చిరంజీవికి ఈ విషయం చెప్పాను. ‘నా పాత్రకు కూతురు, కొడుకు ఉంటారని అంటున్నారు..!’ అంటూ అనుమానం వ్యక్తం చేశారు. దాంతో, అవసరమైతే ఆ పిల్లల క్యారెక్టర్లను తొలగిస్తామని దర్శకులు చెప్పారు. అయినా ఎందుకో చిరంజీవి అంత ఇంట్రెస్ట్‌ చూపించలేదు. ఇప్పుడు ఇదే ప్రాజెక్ట్‌ అంతర్జాతీయంగా గుర్తింపు పొందింది. చిరంజీవి ఈ కథ చేసి ఉంటే ఇంకెక్కడో ఉండేది’’ అని అశ్వినీదత్‌ చెప్పారు.

అప్పుడు చిరంజీవి తిరస్కరించడంతో ఆ కథ సినిమాగా కాకుండా వెబ్‌ సిరీస్‌గా రూపొందింది. ఓటీటీ ‘అమెజాన్‌ ప్రైమ్‌’ వేదికగా విడుదలైన ఈ సిరీస్‌తో కీలక పాత్రధారి మనోజ్‌ బాజ్‌పాయ్‌ క్రేజ్‌ ఒక రేంజ్‌లో పెరిగింది. ఈ సిరీస్‌కు కొనసాగింపుగా ‘ది ఫ్యామిలీ మ్యాన్‌- 2’ వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సీజన్‌ -3 కూడా సిద్ధమవుతోంది.

Updated Date - 2023-10-27T14:46:15+05:30 IST