AS Ravikumar chowdary Fire : చిరంజీవి, బాలకృష్ణ కంటే గొప్పోడివా?

ABN , First Publish Date - 2023-08-31T18:08:08+05:30 IST

హీరోయిన్‌ మన్నారా చోప్రాకు వేదికపై ముద్దుపెట్టి ట్రోలింగ్‌కు గురైన దర్శకుడు ఎ.ఎస్‌.రవికుమార్‌ చౌదరి మరోసారి వార్తలో నిలిచారు. తన దర్శకత్వంలో రెండు చిత్రాల్లో నటించిన హీరోపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అయితే ఆయన పేరు చెప్పకపోయినా రవికుమార్‌ చేసిన వ్యాఖ్యలను బట్టి ఆ హీరో గౌపీచంద్‌ అని నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు.

AS Ravikumar chowdary Fire : చిరంజీవి, బాలకృష్ణ కంటే గొప్పోడివా?

హీరోయిన్‌ మన్నారా చోప్రాకు (Mannara Chopra) వేదికపై ముద్దు పెట్టి ట్రోలింగ్‌కు గురైన దర్శకుడు ఎ.ఎస్‌.రవికుమార్‌ చౌదరి (AS Ravikumar chowdary) మరోసారి వార్తలో నిలిచారు. తన దర్శకత్వంలో రెండు చిత్రాల్లో నటించిన హీరోపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అయితే ఆయన పేరు చెప్పకపోయినా రవికుమార్‌ చేసిన వ్యాఖ్యలను బట్టి ఆ హీరో గౌపీచంద్‌ అని నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు. గోపీచంద్‌తో (Gopichand)యజ్ఞం, సౌఖ్యం, సాయిధరమ్‌ తేజ్‌తో ‘పిల్లా నువ్వులేని జీవితం’ బాలకృష్ణతో వీరభద్ర వంటి చిత్రాలు తీశారు రవికుమార్‌ చౌదరి. దాదాపు పదేళ్ల తర్వాత ఆయన ‘తిరగబడరా సామీ’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.

ఆయన మాట్లాడుతూ ‘‘గతంలో అందరం చెట్టు కింద కూర్చోని భోజనం చేేసవాళ్లం. ఒకరోజు ఆ హీరో కోసం వెళ్తే కొంతసేపు వెయిట్‌ చేయమను’ అన్నాడు అని గోపీచంద్‌ పేరు ఎత్తకుండా పరోక్షంగా విమర్శలు చేశారు రవికుమార్‌ చౌదరి. ‘ఒరేయ్‌ అంత బలిసిందా రా మీకు? గతంలో నా ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా వచ్చావ్‌.. ఇప్పుడు నీ దగ్గరకు నేను రావాలంటే ఐయిదారు మందిని దాటుకుని రావాలా? విలన్‌గా నటించేవాడిని హీరోగా నేనే చేశాను. నా సినిమాతో వాడు హీరోగా గుర్తింపు పొందాడు. తర్వాతి సినిమాకు వాడి పారితోషికం కన్నా నాదే ఎక్కువ. అలాంటప్పుడు ఆ బలుపు ఎందుకో అర్థం కాదు. వాడు ఇప్పుడు ఎదురుపడినా నేను ఇలాగే మాట్లాడతా. ఒకప్పుడు నా సినిమాతో హీరోగా ఎదిగినవాడు ఈ రోజు పూర్తిగా మారిపోయాడు’’ అని ఆవేదన వ్యక్తం చేశారు.

2.jpg

అంత ఈగో ఏంటి నీకు?

‘రారాజు’ (గోపీచంద్‌ నటించిన) చిత్రం కోఠి ఉమెన్స్‌ కాలేజీలో షూటింగ్‌ జరుగుతుంది. అతన్ని కలవడానికి అక్కడికి వెళ్లాను. అప్పటికే నేను బాలకృష్ణతో ‘వీరభద్ర’ సినిమా తీసి ఫ్లాప్‌లో ఉన్నాను. ఈ కారణంతో మరో సినిమా తీద్దామని అడిగితే నన్ను దూరం పెట్టాడు. మంచి కథ చేసి రండి చూద్దాం అని అవమానించాడు. ఆ సమయంలో ఫైట్‌ మాస్టర్‌ విజయ్‌ కూడా అక్కడే ఉన్నారు. నా దగ్గర ఆధారాలున్నాయి. ఒక సినిమా హిట్‌ కాగానే అంత బలిసిపోయిందా? అంత ఈగో ఏంటి నీకు? చిరంజీవి, బాలకృష్ణ పవన్‌కల్యాణ్‌ కంటే గొప్పోడివా? నువ్వు. జీవితంలో వాళ్లు ఎన్నో రకాల సినిమాలు చేశారు. సమాజానికి ఎంతో సేవ చేస్తున్నారు. మరి నువ్వేంటి’’ అని ప్రశ్నించారు.

డెమీ గాడ్స్‌లా విర్రవీగుతున్నారు...

ఇండస్ర్టీలో ముఖం మీద మేకప్‌ వేసుకున్న తర్వాత మేకలాంటి చేష్టలు చాలా మందికి ఉంటాయి. ఇప్పుడున్న వారిలో చాలామంది రీల్‌ హీరోస్‌ మాత్రమే. రియల్‌ హీరోలు కాదు. తలపొగరు నెత్తికెక్కి డెమీగాడ్స్‌లా కొందరు విర్రవీగుతున్నారంటూ.. చిరంజీవి, బాలకృష్ణ, పవన్‌కల్యాణ్‌ కంటే వీళ్లందదు గొప్పోళ్లా..? అంటూ మండిపడ్డారు. నేను తీసిన ‘పిల్ల నువ్వులేని జీవితం’ సినిమా చూసి బన్నీ కాల్‌ చేసి 45 నిమిషాలు మాట్లాడి మంచి సినిమా చేశానని ప్రశంసించాడు. అది తనలో ఉన్న మంచి గుణం. అల్లు అర్జున్‌కి నేషనల్‌ అవార్డ్‌ రావడం ఆనందంగా ఉంది. అతను ఆ పురస్కారానికి అర్హుడు’’ అని తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. దీనిపై గోపీచంద్‌ ఫ్యాన్స్‌ ఎ.ఎస్‌.రవికుమార్‌ చౌదరిపై మండిపడుతున్నారు. గోపీచంద్‌పై ఇండస్ట్రీలో ఎలాంటి మచ్చ లేదని, అతనిపై ఎవరూ ఇప్పటి వరకు ఇలాంటి కామెంట్లు చేయలేదని అభిమానులు సోషల్‌ మీడియాలో కామెంట్స్‌ చేస్తున్నారు.

Updated Date - 2023-08-31T18:08:08+05:30 IST