Arun Govil: ఓం రౌత్‌పై మండిపడ్డ అలనాటి రాముడు!

ABN , First Publish Date - 2023-06-24T12:38:43+05:30 IST

'ఆది పురుష్‌’ సినిమా విడుదలై వారం దాటుతున్నా నెగిటివిటీ, విమర్శలు ఏ మాత్రం తగ్గలేదు. ‘ఆదిపురుష్‌’ చిత్రం ప్రతి ఒక్కరూ రామానంద్‌ సాగ్‌ తెరకెక్కించిన టీవీ ధారావాహిక ‘రామాయణం’ను (Ramayan)గుర్తు చేసుకుంటున్నారు. ఎన్ని తరాలు గడిచినా రామానంద్‌ సాగర్‌ ‘రామాయణం’ సీరియల్‌ని బీట్‌ చేయలేరని కామెంట్‌ చేస్తున్నారు. ఇప్పటి అలనాటి ‘రామాయణం’లో నటించిన ఎంతోమంది ఆర్టిస్ట్‌లు ‘ఆదిపురుష్‌’ చిత్రంపై విమర్శలు చేశారు. తాజాగా అందులో రాముడి పాత్ర పోషించిన నటుడు అరుణ్‌ గోవిల్‌ కూడా ‘ఆది పురుష్‌’ సినిమాపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Arun Govil: ఓం రౌత్‌పై మండిపడ్డ అలనాటి రాముడు!

'ఆది పురుష్‌’ (Adipurush) సినిమా విడుదలై వారం దాటుతున్నా నెగిటివిటీ, విమర్శలు ఏ మాత్రం తగ్గలేదు. ‘ఆదిపురుష్‌’ చిత్రం ప్రతి ఒక్కరూ రామానంద్‌ సాగ్‌ తెరకెక్కించిన టీవీ ధారావాహిక ‘రామాయణం’ను (Ramayan)గుర్తు చేసుకుంటున్నారు. ఎన్ని తరాలు గడిచినా రామానంద్‌ సాగర్‌ ‘రామాయణం’ సీరియల్‌ని బీట్‌ చేయలేరని కామెంట్‌ చేస్తున్నారు. ఇప్పటి అలనాటి ‘రామాయణం’లో నటించిన ఎంతోమంది ఆర్టిస్ట్‌లు ‘ఆదిపురుష్‌’ చిత్రంపై విమర్శలు చేశారు. తాజాగా అందులో రాముడి పాత్ర పోషించిన నటుడు అరుణ్‌ గోవిల్‌ (Arun Govil) కూడా ‘ఆది పురుష్‌’ సినిమాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘రామాయణ్‌’ సీరియల్‌ను ఆధ్యాత్మిక ఉట్టిపడేలా తీర్చిదిద్దామని, అందుకే ఇప్పటికీ జనాల హృదయాల్లో నిలిచిపోయిందన్నారు. సోషల్‌ మీడియాలో ‘ఆది పురుష్‌’ సినిమాపై జరుగుతున్న ట్రోలింగ్‌ గురించి ఇప్పుడు ఆయన కూడా స్పందించారు.

ఈ సందర్భంగా గతంలో ఆయనకు ఎదురైన ఓ అనుభవాన్ని అరుణ్‌ గోవిల్‌ (Arun Govil Fire on Om raut) స్పందించారు. ‘‘గతంలో ఓ సందర్భంలో తనను సాక్షాత్తూ శ్రీరామునిగా భావించి ఓ మహిళ కాళ్ల మీద పడింది. అనారోగ్యంతో బాధపడుతున్న తన బిడ్డను తన పాదాల చెంత ఉంచింది. ఆ బిడ్డను ఆస్పత్రికి తీసుకెళ్లాలని చెప్పి, ఆ పిల్లాడి ఆరోగ్యం గురించి ప్రార్ధించాను. తరువాత ఆమె నా చేతిని ఆ కుర్రాడి తలపై ఉంచాలని కోరింది. తదుపరి ఆ బిడ్డను తీసుకుని వెళ్లిపోయింది. మళ్లీ మూడు రోజుల తర్వాత ఆ బిడ్డను తీసుకుని సెట్‌కి వచ్చిందామె. ఆ క్షణం అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారన్నారు. ఆ పిల్లాడు అనారోగ్యం నుంచి కోలుకొని చక్కగా ఆడుకుంటున్నాడు’’ అని అన్నారు.

దేశంలో శ్రీరామునిపై ప్రజలకు భక్తి శ్రద్ధలు ఆ స్థాయిలో ఉంటాయి. ఏ మతానికి సంబంధించిన సినిమా రూపొందించినా, అది విలువలతో కూచి ఉండాలి. శ్రీరాముని పాత్రను ఎంతో గొప్పగా చూస్తారు. అందుకే ఓం రౌత్‌ రూపొందించిన రామాయణంలో విలువలు లేవని దేశమంతా విమర్శిస్తున్నారు. రామాయణాన్ని తెరకెక్కించే విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఇన్ని విమర్శలు వచ్చేవి కావు. ప్రజల్ని మెప్పించే విధంగా తీర్చిదిద్ది ఉంటే తప్పుకుండా చిత్రాన్ని, దానికి పని చేసిన అందరినీ ప్రజలు మెచ్చుకునేవారు.

Updated Date - 2023-06-24T12:38:43+05:30 IST