NBK 108: బాలయ్యతో యాక్షన్‌ షురూ!

ABN , First Publish Date - 2023-05-10T11:54:22+05:30 IST

‘ఫ్లూటు జింక ముందు ఊదు.. సింహం ముందు కాదు’ నందమూరి బాలకృష్ణ నోట పలికిన డైలాగ్‌కు ఎంత క్రేజ్‌ ఉందో తెలిసిందే!. ఈ డైలాగ్‌కు థియేటర్స్‌ దద్దరిల్లిపోయాయి. చప్పట్లు, కేరింతలతో మార్మోగిపోయాయి.

NBK 108: బాలయ్యతో యాక్షన్‌ షురూ!

‘ఫ్లూటు జింక ముందు ఊదు..

సింహం ముందు కాదు’

నందమూరి బాలకృష్ణ (Bala Krishna) నోట పలికిన డైలాగ్‌కు ఎంత క్రేజ్‌ ఉందో తెలిసిందే! ఈ డైలాగ్‌కు థియేటర్స్‌ దద్దరిల్లిపోయాయి. చప్పట్లు, కేరింతలతో మార్మోగిపోయాయి. ఇప్పటికీ ఈ డైలాగ్‌ ఎన్నో సందర్భాల్లో వినిపిస్తూనే ఉంది. ఇప్పుడు ఇదే డైలాగ్‌ను బాలీవుడ్‌ నటుడు చెబితే...? అలాంటి ప్రయత్నమే చేశారు బాలీవుడ్‌ నటుడు అర్జున్‌ రాంపాల్‌.

నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న ‘ఎన్‌బీకే 108’ (NBK108) అనిల్‌ రావిపూడి దర్శకుడు. బాలీవుడ్‌లో ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించిన అర్జున్‌ రాంపాల్‌ (Arjun Ram pal)ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. బుధవారం ఆయన సెట్‌లో అడుగుపెట్టారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్రం బృందం ఓ వీడియో విడుదల చేశారు. ‘ఫ్లూటు జింక ముందు ఊదు.. సింహం ముందు కాదు’ అంటూ అర్జున్‌ రాంపాల్‌ ఎంట్రీ ఇచ్చారు. పక్కనే ఉన్న దర్శకుడు అనిల్‌ రావిపూడి (Anil Ravipudi) ‘డైలాగ్‌ ఎలా ఉంది’ అని అడగగా, సూపర్‌.. మీరు తెలుగు డైలాగ్‌, అందులోనూ బాలయ్య బాబు డైలాగ్‌ అదరగొట్టేశారని కితాబిచ్చారు. ‘బాలకృష్ణ సినిమాలో యాక్ట్‌ చేస్తున్నా.. మీరు ఈ చిత్రానికి దర్శకుడు ఆ మాత్రం ఉండాలిగా’ అని అర్జున్‌ రాంపాల్‌ సమాధానమిచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌ అవుతోంది. నందమూరి బాలకృష్ణ, కాజల్‌ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల కీలక పాత్ర పోషిస్తున్నారు. తమన్‌ స్వరకర్త. షైన్‌ స్ర్కీన్‌ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీశ్‌ పెద్ది నిర్మిస్తున్నారు.

Updated Date - 2023-05-10T11:55:45+05:30 IST