OG: కీలక పాత్రధారులు ఏమన్నారంటే..

ABN , First Publish Date - 2023-06-25T14:41:59+05:30 IST

పవన్‌ కల్యాణ్‌ సినిమా అంటే అంచనాలు ఎలా ఉంటాయో తెలిసిందే! తాజాగా ఆయన శరవేగంగా షూటింగ్‌ చేస్తున్న చిత్రం ‘ఓజి’(OG). సుజిత్‌ దర్శకత్వంలో వహిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి వస్తున్న ప్రతి అప్‌డేట్‌ చిత్రంలో అంచనాలు పెంచుతున్నాయి. తాజాగా ఈ చిత్రంలో నటినటులు పంచుకున్న విషయాలతో సినిమాపై మరింత ఆసక్తి పెరుగుతోంది

OG: కీలక పాత్రధారులు ఏమన్నారంటే..

పవన్‌ కల్యాణ్‌ (Pawan kalyan) సినిమా అంటే అంచనాలు ఎలా ఉంటాయో తెలిసిందే! తాజాగా ఆయన శరవేగంగా షూటింగ్‌ చేస్తున్న చిత్రం ‘ఓజి’(OG). సుజిత్‌ (Sujeeth) దర్శకత్వంలో వహిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి వస్తున్న ప్రతి అప్‌డేట్‌ చిత్రంలో అంచనాలు పెంచుతున్నాయి. తాజాగా ఈ చిత్రంలో నటినటులు పంచుకున్న విషయాలతో సినిమాపై మరింత ఆసక్తి పెరుగుతోంది ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న కోలీవుడ్‌ హీరో అర్జున్‌ దాస్‌ (Arjun dass) ఇటీవల సెట్‌లో అడుగుపెట్టారు. సినిమా గురించి ట్విట్టర్‌ వేదికగా వెల్లడించారు. ‘‘ఈ సినిమాకు సంబంధించి కొన్ని సన్నివేశాలు చూపించారు. అద్భుతంగా ఉన్నాయి. పవన్‌కల్యాణ్‌ స్ర్కీన్‌ ప్రజెన్స్‌, డైలాగులు ఓ రేంజ్‌లో ఉన్నాయి. నేను ఆయన ఫ్యాన్స్‌కు ఒకటే చెప్పాలనుకుంటున్నా. త్వరలోనే అగ్ని తుపాను రానుంది. మీరంతా సిద్థంగా ఉండండి’’ అని ట్వీట్‌ చేశారు.

ఈ చిత్రంలో మరో కీలక పాత్ర పోషిస్తున్న శ్రియారెడ్డి ఇటీవల ఓ తెలుగు యూట్యూబ్‌ చానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ‘‘ఈ ఆఫర్‌ వచ్చినప్పుడు కమర్షిమల్‌ సినిమా అనుకుని నో చెప్పేద్దాం అనుకున్నా. సుజిత్‌ చెప్పిన కథ విన్న 5 నిమిషాల్లోనే ఓకే చెప్పేశాను. ఆ కథ అంత నచ్చింది. చాలా కొత్తగా ఉంది’’ అని చెప్పారు. గ్యాంగ్‌స్టర్‌ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంలో పవన్‌కల్యాణ్‌కి జోడీగా ప్రియాంక అరుళ్‌ మోహన్‌ నటిస్తున్నారు. ప్రకాశ్‌రాజ్‌, ఇమ్రాన్‌ హస్మీ కీలక పాత్రధారులు. డి.వి.వి.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్నారు.

Updated Date - 2023-06-25T14:41:59+05:30 IST