RC 16: గ్లోబల్‌స్టార్‌ కోసం ఆస్కార్‌ విన్నర్‌

ABN , First Publish Date - 2023-07-08T12:20:10+05:30 IST

గ్లోబల్‌స్టార్‌ రామ్‌చరణ్‌ తండ్రయిన ఆనందంలో ఉన్నారు. ప్రస్తుతం ఆయన తన గారాలపట్టీ క్లీంకారతో సరదాగా గడుపుతున్నారు. ఉపాసన డెలివరీ డేట్‌ దగ్గరకు వచ్చినప్పటి నుంచీ చెర్రీ షూటింగ్‌కు గ్యాప్‌ ఇచ్చి ఉపాసన చెంతే ఉంటున్నారు.

RC 16: గ్లోబల్‌స్టార్‌ కోసం ఆస్కార్‌ విన్నర్‌

గ్లోబల్‌స్టార్‌ రామ్‌చరణ్‌ (Ram charan)తండ్రయిన ఆనందంలో ఉన్నారు. ప్రస్తుతం ఆయన తన గారాలపట్టీ క్లీంకారతో సరదాగా గడుపుతున్నారు. ఉపాసన డెలివరీ డేట్‌ దగ్గరకు వచ్చినప్పటి నుంచీ చెర్రీ షూటింగ్‌కు గ్యాప్‌ ఇచ్చి ఉపాసన చెంతే ఉంటున్నారు. గత నెల 20న ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే! ప్రస్తుతం పాపతో బిజీగా ఉంటున్న చరణ్‌ త్వరలో ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer) షూటింగ్‌లో పాల్గొనున్నారు. తదుపరి ఆయన సానా బుచ్చిబాబు (Sana BuchiBabu) దర్శకత్వంలో (ఆర్‌సీ16) సినిమా చేయబోతున్నారు. ఆ చిత్రం తనకు ఎంతో ప్రత్యేకంగా నిలవబోతుందని చరణ్‌ ఓ వేదికపై చెప్పారు. తన గత చిత్రాలతో కంపేర్‌ చేస్తే కెరీర్‌లో గుర్తుండిపోయే మట్టి చిత్రమని దీమాగా చెబుతున్నారు.

WhatsApp Image 2023-07-08 at 12.15.35 PM.jpeg

సెప్టెంబర్‌లో సెట్స్‌కి వెళ్లబోతున్న ఈ చిత్రం గురించి ఓ వార్త నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. ఈ చిత్రానికి ఆస్కార్‌ అవార్డ్‌ విన్నర్‌ ఏ.ఆర్‌.రెహమాన్‌ (AR Rehman) సంగీతం అందించబోతున్నారట. ఇప్పటికే చర్చలు పూర్తయ్యాయని, త్వరలో అఫీషియల్‌ అనౌన్స్‌మెంట్‌ రాబోతుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట సందడి చేస్తోంది.

Updated Date - 2023-07-08T12:21:35+05:30 IST