Kiran Dembla: హీరోయిన్‌లకు అరుదైన వ్యాధులు.. అనుష్క,, ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ ఏమన్నారంటే!

ABN , First Publish Date - 2023-02-21T17:07:16+05:30 IST

ఓ మనిషికి నేమ్‌, ఫేమ్‌, మనీ, లగ్జరీ లైఫ్‌ ఇలా ఎన్ని ఉన్నా... మానసిక ప్రశాంతం లేని జీవితం వృధానే అంటున్నారు సెలబ్రిటీ ఫిట్‌నెస్‌ ట్రైనర్‌, సిక్స్‌ప్యాక్‌ లేడీ కిరణ్‌ డెంబ్లా. మెంటల్‌ స్ట్రెస్‌ దూరంగా ఉండడమే ఆరోగ్యమని ఆమె చెబుతున్నారు.

Kiran Dembla:  హీరోయిన్‌లకు అరుదైన వ్యాధులు.. అనుష్క,, ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ ఏమన్నారంటే!

ఓ మనిషికి నేమ్‌, ఫేమ్‌, మనీ, లగ్జరీ లైఫ్‌ ఇలా ఎన్ని ఉన్నా... మానసిక ప్రశాంతం లేని జీవితం వృధానే అంటున్నారు సెలబ్రిటీ ఫిట్‌నెస్‌ ట్రైనర్‌, సిక్స్‌ప్యాక్‌ లేడీ కిరణ్‌ డెంబ్లా(kiran Dembla). మెంటల్‌ స్ట్రెస్‌ దూరంగా ఉండడమే ఆరోగ్యమని ఆమె చెబుతున్నారు. ప్రభాస్‌, రామ్‌చరణ్‌, అనుష్కశెట్టి(anushka shetty), తమన్నా, రాజమౌళి(rajamouli), సూర్య, వంటి స్టార్‌లకు పర్సనల్‌ ఫిట్‌నెస్‌ టైనర్‌గా పని చేస్తున్న కిరణ్‌ డెంబ్లా హీరోయిన్లు ఎదుర్కొంటున్న అరుదైన సమస్యల గురించి మాట్లాడారు. (anushka Fitness trainer kiran Dembla)

‘‘హీరోయిన్లు అందంగా, ఫిట్‌గా కనిపించినంత మాత్రాన వారు ఆనందంగా ఉన్నట్లు కాదు. టీవీ అయినా సినిమా అయినా హీరోయిన్‌లకు షెడ్యూల్‌ ప్రకారం రోజుకి కనీసం 10 గంటల కాల్షీట్‌ ఉంటుంది. అలా వర్క్‌ చేయాలంటే వారికి వ్యాయామం, బాడీ ఫిట్‌నెస్‌, పోషక ఆహారం తప్పనిసరి. ఆరోగ్యం కాపాడుకోవడం కోసం ఒళ్లు హూనం అయ్యేలా వర్కవుట్ప్‌ చేయాల్సిందే. దీనితోపాటు మానసిక ప్రశాంతత కూడా చాలా అవసరం. (Mental Stress) ఈ రెండు ఉంటేనే సంపూర్ణ ఆరోగ్యంగా ఉండగలరు. కొందరు కథానాయికలు నిరంతరం వర్కవుట్స్‌ చేసి ఫిట్‌గా ఉన్నప్పటికీ అరుదైన వ్యాధులు ఇబ్బంది పెడుతున్నాయి. అందుకు చాలా కారణాలు ఉన్నాయి. కథానాయికలు వర్కవుట్‌లతో ఎంత ఫిట్‌గా ఉన్నా సరే.. వారికి మానసిక ప్రశాంతం అవసరం. అది లేనప్పుడు ఎన్ని వర్కవుట్స్‌ చేసినా వృధానే! ఓ హీరోయిన్‌కి ఫేం పెరిగింది అంటే ఒత్తిడి కూడా పెరుగుతుంది. నేమ్‌, ఫేమ్‌, మనీ, వర్క్‌ టెన్షన్‌ ఇలా ప్రతి విషయంలోనూ ఒత్తిడికి లోనవుతుంటారు. ఓ సమయం వచ్చేసరికి వీటిని బ్యాలన్స్‌ చేయలేరు. ఇంత టెన్షన్ల మధ్య వర్కవుట్స్‌ చేసినా అంతగా ఫలితం ఉండదు. మనిషికి మానసిక ప్రశాంతం తర్వాతే ఏదైనా! సినిమా రంగమనే కాదు ఏ రంగం తీసుకున్నా ఇలాంటి సమస్యలున్నాయి. ఒత్తిడి అనేది హీరో హీరోయిన్‌ అందరికీ ఉంటుంది. హీరోయిన్‌లకు కాస్త ఎక్కువ. ఎందుకంటే ఇది పురుషాధిక్యత గల ఇండస్ట్రీ కాబట్టి హీరోయిన్‌లకు రకరకాలుగా ఒత్తిడి ఉంటుంది. దీనిని అధికమించాలంటే మెంటల్‌ స్ట్రెస్‌ను దూరం చేయాలి. మెంటల్‌ స్ట్రెస్‌ తగ్గాలంటే యోగా, ప్రాణాయామం, మెడిటేషన్‌ చేయాలి. మన మనసులో బాధను ఆప్తులతో పంచుకోవాలి.. ఇవన్నీ చేస్తే మానసిక ఒత్తిడి నుంచి బయట పడతాం.

వ్యక్తిగత విషయాల్లోకి వెళ్లను...

నేను ఎంతోమందికి సెలబ్రిటీలకు ఫిట్‌నెస్‌ ట్రైనర్‌గా పని చేస్తున్నా. ఎప్పుడు కూడా సెలబ్రిటీల వ్యక్తిగత విషయాల్లోకి వెళ్లను. అది పద్దతి కూడా కాదు. వారికి వారుగా చెబితే వింటాను. అనుష్క నాకు చాలా క్లోజ్‌ గుడ్‌ హ్యూమన్‌ బీయింగ్‌. ఆమెకు వచ్చిన అరుదైన వ్యాధి గురించి విన్నాను. ఆమెను ఇటీవల కలిశాను. కుటుంబ సభ్యులతో కలిసి చాలా ఆనందంగా ఉంది. ఆమె త్వరలోనే కోలుకోవాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నా. ఒక ట్రైనర్‌ని అయినప్పటికీ నాక్కుడా ఒత్తిడి, మెంటల్‌ స్ట్రెస్‌ ఉంటుంది. ఓసారి రామోజీ ఫిల్మ్‌సిటీలో నన్ను గమనించిన అనుష్క నాతో యోగా, ప్రాణాయామ క్రియ చేయించారు. అలా చేయగా చేయగా వారం రోజుల్లో నేను స్ట్రెస్‌ ఫ్రీ అయ్యాను. అనుష్క గొప్ప యోగా టీచర్‌. నేను ఆమె దగ్గర యోగా నేర్చుకున్నా.

ఒత్తిడితో జిమ్‌ చేయకూడదు..

‘జిమ్‌ ఎక్కువ చేయడం వల్ల హార్ట్‌ ఎటాక్‌ వస్తుందని ఈ మధ్యకాలంలో చాలామంది చెబుతుంటే విన్నా. జిమ్‌ చేయడం వల్ల గుండెపోటు రాదు. జిమ్‌కి రావడానికి ముందు ఆ వ్యక్తి మానసిక పరిస్థితి ఏంటి. ఏం తిన్నారు? ఓ వారం, నెల రోజులుగా అతని స్థితి ఎలా ఉంది అనేది కూడా చాలా ముఖ్యం. ఇలాంటి ఒత్తిడితో జిమ్‌లో కసరత్తుల చేస్తుంటే సమస్యలు వస్తున్నాయి. దానికి జిమ్‌ చేయడం కారణం అనుకుంటున్నారు. ఒత్తిడితో జియ్‌ చేయకండి!

Updated Date - 2023-02-21T17:07:45+05:30 IST