సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

MegaStar: చిరంజీవి ఇంట లక్ష్మీ కటాక్షం

ABN, First Publish Date - 2023-06-20T15:42:03+05:30

ఇప్పుడు రామ్ చరణ్, ఉపాసనలకు పుట్టిన పాపతో చిరంజీవి ఇంట లక్ష్మీ కటాక్షం అని చెప్పొచ్చు. ఎందుకంటే చిరంజీవికి ఈమె ఇప్పుడు ఐదో మనవరాలు. అందుకే లక్ష్మీ కటాక్షం అన్నారు.

Chiranjeevi's wife Suresh along with their daughter and granddaughters
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిరంజీవి (MegaStar Chiranjeevi) మరోసారి తాత అయ్యారు. ఈసారి తనయుడు రామ్ చరణ్ (RamCharan), కోడలు ఉపాసన కామినేని కొణిదెల (UpasanaKamineniKonidela) కు సోమవారం రాత్రి గం:1.49 నిముషాలకి (తెల్లవారితే మంగళవారం) సుపుత్రిక జన్మించింది. అపోలో హాస్పిటల్ (Apollo Hospital) అంతా ఈరోజు మెగా కుటుంబ సభ్యులతో అంతా హడావిడిగా వుంది.

చిరంజీవి, సురేఖ (Surekha) గార్లు తమ ముద్దుల మనవరాలిని చూసి మురిసిపోతున్నారు. ఆడబిడ్డ జన్మించడం ఆనందంగా వుంది అని చిరంజీవి చెప్పారు. ఎన్నాళ్ళ నుండో వాళ్ళని అడుగుతున్నాం మా చేతుల్లో ఒక బిడ్డని పెట్టండిరా అని, ఇప్పుడు ఆ భగవంతుడి ఆశీర్వాదంతో పండంటి ఆడపిల్లని మాకిచ్చారు అని చిరంజీవి ఆనందంగా చెప్పారు.

అయితే ఈరోజు జన్మించిన ఈ ఆడబిడ్డతో చిరంజీవి ఇంట లక్ష్మీ కటాక్షం అనే చెప్పాలి. ఎందుకంటే చిరంజీవికి ఇద్దరు కుమార్తెలు, ఒక కొడుకు రామ్ చరణ్. పెద్ద కూతురు సుష్మిత కొణిదెలకి (SushmithaKonidela) 2006 లో విష్ణు ప్రసాద్ తో వివాహం అయింది. వాళ్ళకి ఇద్దరు అమ్మాయిలు, సమారా, సంహిత.

చిన్నమ్మాయి శ్రీజ (SreejaKonidela) కి మొదటి వివాహం శిరీష్ భరద్వాజ్ ని చేసుకున్నప్పుడు ఆయనతో ఒక అమ్మాయి, తరువాత రెండో వివాహం కళ్యాణ్ దేవ్ (KalyanDhev) ని చేసుకున్నప్పుడు అయనతో కూడా అమ్మాయే పుట్టింది. ఇద్దరమ్మాయిల పేర్లు నివ్రితి, నివిష్క. ఇప్పుడు రామ్ చరణ్, ఉపాసనలకు పెళ్లయిన పదకొండేళ్లకు అమ్మాయే పుట్టింది. ఇలా చిరంజీవి ఇంట అంతా లక్ష్మీ కటాక్షమే అని చెప్పొచ్చు.

Updated Date - 2023-06-20T15:42:03+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!