Devara: అనిరుధ్ పోస్ట్‌.. ఆగ‌లేక‌పోతున్న ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌!

ABN , Publish Date - Dec 26 , 2023 | 09:30 PM

ఎన్టీఆర్‌ అభిమానుల‌కు ఇది నిజంగా శుభ‌వార్తే. ఎన్టీర్ దేవ‌ర టీజ‌ర్ అప్పుడొస్తుంది, ఇప్పుడొస్తుందంటూ ప్ర‌తి రోజూ సోష‌ల్‌ మాడియాలో జ‌రుగుతున్న ర‌చ్చ‌కు శుభం ప‌లుకుతూ ఆ చిత్ర సంగీత ద‌ర్శ‌కుడు అనిరుధ్‌ ర‌విచంద‌ర్ చేసిన పోస్టు బాగా వైర‌ల్ అవుతున్న‌ది.

Devara: అనిరుధ్ పోస్ట్‌.. ఆగ‌లేక‌పోతున్న ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌!
anirudh. devara

ఎన్టీఆర్‌ అభిమానుల‌కు ఇది నిజంగా శుభ‌వార్తే. ఎన్టీర్(JrNTR) ‘దేవర’ టీజ‌ర్ అప్పుడొస్తుంది, ఇప్పుడొస్తుందంటూ ప్ర‌తి రోజూ సోష‌ల్‌ మాడియాలో జ‌రుగుతున్న ర‌చ్చ‌కు శుభం ప‌లుకుతూ ఆ చిత్ర సంగీత ద‌ర్శ‌కుడు అనిరుధ్‌ ర‌విచంద‌ర్ (Anirudh Ravichander) చేసిన పోస్టు బాగా వైర‌ల్ అవుతున్న‌ది. దీంతో గ‌త కొన్ని రోజులుగా దేవ‌ర (Devara) టీజ‌ర్ విష‌యంలో న‌డుస్తున్న చ‌ర్చ‌కు పుల్‌స్టాఫ్ ప‌డ‌గా ఫ్యాన్స్ ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయాయి. వారిలో కొత్త ఉత్సాహం మొద‌లైంది.

జూ.ఎన్టీఆర్ (JrNTR), కొరటాల శివ (Koratala Shiva) కాంబినేషన్‌లో జ‌న‌తా గ్యారేజ్ స‌క్సెస్ త‌ర్వాత‌ వస్తోన్న ‘దేవర’ (Devara) చిత్రంపై ఇప్ప‌టికే ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ అంచనాలుండ‌గా అప్డేట్స్ విష‌యంలో ఫ్యాన్స్ చాలా నిరుత్సాహంగా ఉన్నారు. సినిమాకు సంబంధించి ఏ విష‌యం తెలియ‌డం లేద‌ని, అంద‌రి హీరోల చిత్రాల ఆప్డేట్స్ వ‌స్తున్నాయి గానీ దేవ‌ర (Devara) గురించి ఎలాంటి విష‌యం తెలియ‌డం లేదంటూ అభిమానులు చాలాకాలంగా మేక‌ర్స్‌పై ఒత్తిడి తెస్తున్నారు. దీంతో చిత్ర యూనిట్ కూడా అడ‌పాద‌డ‌పా ఏదో ట్వీట్ చేసి వ‌దిలేస్తున్నారు గానీ క్లారిటీ ఇవ్వ‌డం లేదు.


ఈ క్ర‌మంలో ఈ చిత్రం మ్యూజిక్ డెరెక్ట‌ర్ అనిరుధ్ ర‌విచంద‌ర్ (Anirudh Ravichander) మంగ‌ళ‌వారం రోజున‌ దేవ‌ర టీజ‌ర్ రెడీ అవుతున్న‌దంటూ ‘దేవర’ టీజర్ అని రాసి పక్కన చప్పట్లు కొట్టే ఎమోజీలు, ఎన్టీఆర్(Jr NTR), కొరటాల శివ ఆన్ ఫైర్, ఐయామ్‌ ఎగ్జయిటెడ్ అన్నట్టుగా పోస్టు చేశారుర. అలా అనిరుధ్ పోస్టు పెట్టాడో లేదో ఫ్యాన్స్ #AllHailTheTiger #DevaraTeaser అనే యాష్ ట్యాగ్‌ల‌తో నెట్టింట దుమ్ము రేగ్గొడుతూ నిమిషాల్లోనే ట్రెండింగ్‌లోకి తీసుకు వ‌చ్చారు.

ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్, సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమా ‘దేవర’ రెండు భాగాలుగా వ‌స్తుండ‌గా బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ క‌పూర్ క‌థానాయుక‌గా,సైఫ్ అలీఖాన్‌ ప్రతి నాయ‌కునిగా న‌టిస్తున్నారు. అయితే మొదటి భాగం వచ్చే ఏడాది ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానున్న‌ట్లు మేక‌ర్స్ ఇప్ప‌టికే స్ప‌ష్టం చేశారు. అదేవిధంగా ఓ ఇంట‌ర్వ్యూలో క‌ల్యాణ్‌రామ్ మాట్లాడుతూ ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమా రూపొందుతున్న‌ద‌ని, ఎన్టీఆర్ ఈ సినిమా కోసం చాలా కష్ట పడుతున్నారన్నారు.

Updated Date - Dec 26 , 2023 | 09:56 PM