Allu Arjun : బన్నీ తదుపరి చిత్రం అతనితోనేనా?

ABN , First Publish Date - 2023-09-14T18:03:45+05:30 IST

షారుక్‌ఖాన్‌ హీరోగా నటించిన ‘జవాన్‌’ సక్సెస్‌ పట్ల అల్లు అర్జున్‌ ప్రశంసిస్తూ ట్వీట్‌ చేసిన సంగతి తెలిసిందే. అందులో హీరోని మాత్రమే కాకుండా నటీనటులు, సాంకేతిక నిపుణుల పేర్లు ప్రస్తావించి మరీ అభినందించారు. బన్నీ ప్రశంసలకు సంగీత దర్శకుడు అనిరుద్ధ్‌ స్పందించారు. ‘థ్యాంక్యూ మై బ్రో’ అని ట్వీట్‌ చేశాడు.

Allu Arjun : బన్నీ తదుపరి చిత్రం అతనితోనేనా?

షారుక్‌ఖాన్‌ హీరోగా నటించిన ‘జవాన్‌’ (jawan) సక్సెస్‌ పట్ల అల్లు అర్జున్‌ (Allu arjun) ప్రశంసిస్తూ ట్వీట్‌ చేసిన సంగతి తెలిసిందే. అందులో హీరోని మాత్రమే కాకుండా నటీనటులు, సాంకేతిక నిపుణుల పేర్లు ప్రస్తావించి మరీ అభినందించారు. బన్నీ ప్రశంసలకు సంగీత దర్శకుడు అనిరుద్ధ్‌ స్పందించారు. ‘థ్యాంక్యూ మై బ్రో’ అని ట్వీట్‌ చేశాడు. దానికి అల్లు అర్జున్‌ థాంక్స్‌ ఒకటే చెబితే చాలదు, నాకు గొప్ప పాటలు కావాలి’ అని రాసుకొచ్చాడు. దానికి అనిరుద్ధ్‌(Anirudh) రెడీ అని రిప్లై ఇచ్చాడు. దాంతో నెటిజన్లు వీరిద్దరి కాంబో సినిమా సెట్‌ అయిందా అంటూ కామెంట్లు పెడుతున్నారు.

అయితే కొంతకాలంగా అల్లు అర్జున్‌తో అట్లీ ఓ సినిమా చేయబోతున్నారని ప్రచారం జరుగుతోంది. ఆ చిత్రానికి అనిరుద్‌ సంగీతం అని కూడా వినిపించింది. ఇప్పుడు అనిరుద్థ్‌, బన్నీల సంభాషణ చూస్తే అదే నిజమే అనిపిస్తోంది. వీరిద్దరి కాంబినేషన్‌లో ఓ సినిమా ఖరారైందని, అనిరుద్థ్‌ అందుకే పాటలు కూడా రెడీ అని సంగీత దర్శకుడు సమాధానం ఇచ్చాడని నెట్టింట హల్‌చల్‌ జరుగుతోంది. అన్ని కలిసొస్తే ‘పుష్ప-2’ తర్వాత అ?న్లి అర్జున్‌ అట్లీ కలిసి సినిమా చేసే అవకాశం కనిపిస్తోంది.

Updated Date - 2023-09-14T18:03:45+05:30 IST