Anil Ravipudi: ట్రైలర్‌లోని ప్రతి పంచ్‌కి నవ్వా.. సినిమా హిలేరియస్‌గా ఉంటుంది

ABN , First Publish Date - 2023-11-21T17:19:44+05:30 IST

ఫుల్ మూన్ మీడియా ప్రొడ‌క్షన్స్ ప‌తాకంపై ప్రొడ‌క్షన్ నెం-1గా రూపొందిన చిత్రం సౌండ్ పార్టీ. వీజే స‌న్నీ, హ్రితిక శ్రీనివాస్ జంట‌గా న‌టించారు. జయ శంకర్ సమర్పణలో సంజ‌య్ శేరిదర్శకత్వం వహించారు. ఈనెల 24న గ్రాండ్ గా థియేట‌ర్ల‌లో విడుదలవుతోంది. ఈ సందర్భంగా సోమవారం సాయంత్రం హైదరాబాదులోని ప్రసాద్ ల్యాబ్స్ లో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించారు.

Anil Ravipudi: ట్రైలర్‌లోని ప్రతి పంచ్‌కి నవ్వా.. సినిమా హిలేరియస్‌గా ఉంటుంది
sound party

ఫుల్ మూన్ మీడియా ప్రొడ‌క్షన్స్ ప‌తాకంపై ప్రొడ‌క్షన్ నెం-1గా రూపొందిన చిత్రం సౌండ్ పార్టీ (Sound Party). వీజే స‌న్నీ (VJ Sunny), హ్రితిక శ్రీనివాస్ (Hrithika) జంట‌గా న‌టించారు. జయ శంకర్ సమర్పణలో సంజ‌య్ శేరి (sanjay sheri) దర్శకత్వం వహించారు. రవి పొలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర నిర్మాత‌లు. ఇప్ప‌టికే విడుదలైన టీజర్, ట్రైలర్, సాంగ్స్ అంచ‌నాలు పెంచిన ఈ చిత్రం సోమవారం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని U/A సర్టిఫికేట్ అందుకుంది. వ‌రల్డ్ వైడ్ గా ఈనెల 24న గ్రాండ్ గా థియేట‌ర్ల‌లో విడుదలవుతోంది. ఈ సందర్భంగా సోమవారం సాయంత్రం హైదరాబాదులోని ప్రసాద్ ల్యాబ్స్ లో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించారు.

ముఖ్యఅతిథిగా హాజరైన బ్లాక్ బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi).. సౌండ్ పార్టీ సినిమాకు సంబంధించి బిట్ కాయిన్ ను ఆవిష్కరించారు. అనంతరం అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. "బిగ్ బాస్ నుంచి వచ్చినప్పటి నుంచి సన్నీ బాగా కష్టపడుతున్నాడు, మంచి సినిమాలు చేస్తున్నాడు. ఈ సినిమా సక్సెస్ సాధించి కెరీర్ లో మరింత ముందుకెళ్లాలని కోరుకుంటున్నా. ట్రైలర్ చాలా బాగుంది. ఈ మధ్య చూసిన హిలేరియస్ ట్రైలర్ ఇదే. సన్నీ, శివన్నారాయణ మధ్య వచ్చే సీన్స్ బాగా పండుతాయని అర్థమవుతుంది. సినిమా సక్సెస్ అయి నిర్మాతలు మరింత సౌండ్ పార్టీగా మారాలని టీమ్ అందరికీ ఆల్ ద బెస్ట్" అని చెప్పారు.

దర్శకులు వి.యన్. ఆదిత్య, హీరో చైతన్య రావు సినిమా సక్సెస్ సాధించాలని విష్ చేశారు.నిర్మాతల మండలి అధ్యక్షులు కేఎల్ దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ.."ఈ ఈవెంట్ లో చాలా పాజిటివ్ అట్మాస్ఫియర్ కనిపిస్తుంది. సన్నీ వెరీ టాలెంటెడ్ హీరో. ఈ సినిమా విజయం సాధించి తనకు మరింత మంచి పేరు రావాలని కోరుకుంటున్నా" అని అన్నారు. నాచురల్ స్టార్ నాని, కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్, హైపర్ ఆది వీడియో బైట్స్ ద్వారా చిత్ర యూనిట్ కు అభినందనలు తెలియజేశారు.

సన్నీ మాట్లాడుతూ.."మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి మా సౌండ్ పార్టీ టీం తరఫున ధన్యవాదాలు. నేను యాక్టర్ కావాలని కలగనే మా అమ్మ కళావతికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మంచి స్టార్ కాస్ట్ తో ఈ చిత్రాన్ని రూపొందించాం. హీరోయిన్ హ్రితిక చాలా సపోర్ట్ చేసింది. ఈ సినిమా రూపంలో నాకు ఒక బ్యూటిఫుల్ డాడీని శివన్నారాయణ గారి రూపంలో ఇచ్చారని, సినిమా చూసిన ప్రతి ఒక్కరికి ఇలాంటి డాడీ ఉంటే బాగుండు అనిపిస్తుందని అన్నారు. కుబేర్ కుమార్, డాలర్ కుమార్ గా మేము అలరిస్తామ‌న్నారు. మోహిత్ అద్భుతమైన మ్యూజిక్ అందించాడు. సంజయ్ పేరు భవిష్యత్తులో బ్రాండ్ గా నిలుస్తుందన్నారు. నిర్మాతలు రవి,మహేంద్రలు అందించిన సపోర్టు మర్చిపోలేనిదని" అన్నారు.


శివన్నారాయణ మాట్లాడుతూ.."సంజయ్ పదేళ్ల క్రితమే నన్ను దృష్టిలో పెట్టుకొని ఈ పాత్ర రాశాడు, ఇలాంటి ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ ఇచ్చిన సంజయ్ కి, నిర్మాతలకి ధన్యవాదాలు. ఈ సినిమాకు వాయిస్ ఓవర్ ఇచ్చిన వెన్నెల కిషోర్ కి స్పెషల్ థాంక్స్. ఇందులో ఎలాంటి వల్గారిటీ, అశ్లీలత సీన్స్ ఉండవు.. అమృతం సీరియల్ లో నన్ను చూసిన మీరు ఎలా అయితే ఆదరించారో.. ఈ సినిమాని కూడా అందరూ ఇష్టపడతారు. ప్రతి ఒక్కరికి సినిమా ఖచ్చితంగా నచ్చుతుందని నమ్మకం ఉంది" అని చెప్పారు.

హ్రితిక శ్రీనివాస్ మాట్లాడుతూ.." ప్రాజెక్టులో నాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి థాంక్స్" అని చెప్పారు. సంజయ్ శేరి మాట్లాడుతూ.."ఈ సినిమాకు రియల్ సౌండ్ పార్టీలు నిర్మాతలే. రెండు గంటలపాటు కంటిన్యూగా నవ్విస్తుంది సినిమా. సన్నీ చాలా ఎనర్జిటిక్ హీరో. తను నా లక్కీ చార్మ్. హీరోయిన్ హ్రితిక క్యూట్ లుక్స్ తో అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది అన్నారు.

నిర్మాత రవి పొలిశెట్టి, మహేంద్రలు మాట్లాడుతూ.."2007లో నేను అమెరికాకు వెళ్లానని, టెక్నాలజీ, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్నా సినిమాలపై ప్యాషన్ ఉండేదని, ప్రేక్షకులకు ఎలాంటి సినిమాలు అయితే నచ్చుతాయో అనే దానిపై చాలా ఆలోచించే వాడిని అన్నారు. యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనుకుని యుఎస్ లోనే మ్యూజిక్ ఆల్బమ్స్, వెబ్ ఫిలిమ్స్, షార్ట్ ఫిలిమ్స్ స్టార్ట్ చేశానని, టాలెంట్ ను గుర్తించడానికి ఫిల్మీ లింక్డ్ ఇన్ లా నేనొక యాప్ ను తయారు చేశానన్నారు. హైదరాబాద్ వచ్చాక ఫిలిం మేకింగ్ ప్రాసెస్ తెలుసుకున్నాన‌ని, జయశంకర్ గారు ఈ సినిమా విషయంలో మాకు బాగా సపోర్ట్ చేశారన్నారు.

sound.jpg

ఈరోజుల్లో మూవీలో ఐదు, పది నిమిషాలు కామెడీ సీన్ ఉంటేనే ఆ సినిమాను చాలా సూపర్ హిట్ చేస్తున్నారని, అలాంటిది ఇందులో అవుట్ అండ్ అవుట్ కామెడీ ఉంటుందని, సంజయ్ రైటింగ్ స్టైల్ చూస్తే త్రివిక్రమ్ లా కనిపించాడన్నారు. మంచి టీం తో రూపొందించిన ఈ సినిమా చూస్తున్నంతసేపు ప్రేక్షకులు నవ్వుతూనే ఉంటారని తెలిపారు.సెన్సార్ నుంచి U/A సర్టిఫికేట్ అందుకున్నామ‌ని, ఈ సినిమాను సెన్సార్ చేసిన అధికారులు కూడా సినిమా చూస్తున్నంత సేపు నవ్వుకుంటూ ఎంజాయ్ చేశామని చెప్పారన్నారు. ఈనెల 24న విడుద‌ల అవుతున్న ఈ చిత్రం చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేసేలా ఉంటుందని" చెప్పారు.

మ్యూజిక్ డైరెక్టర్ మోహిత్ రెహమానిక్ మాట్లాడుతూ.."ఈ ప్రాజెక్టు కోసం సన్నీ నన్ను చాలా బాగా నమ్మారు. సంజయ్ వండర్ ఫుల్ స్క్రిప్ట్ రాశారు. నిర్మాతలు రవి పొలి శెట్టి, మహేంద్ర చాలా బాగా సపోర్ట్ చేశారు. మా సాంగ్స్ ను ఎంకరేజ్ చేస్తున్న ఆదిత్య మ్యూజిక్ కు స్పెషల్ థాంక్స్" అని చెప్పారు.లిరికిస్ట్ పూర్ణాచారి మాట్లాడుతూ.."నాకు ఈ అవకాశం ఇచ్చిన క్రియేటివ్ హెడ్ జయశంకర్ గారికి ధన్యవాదాలు. సందర్భానుసారంగా సాహిత్యం రాసే అవకాశం దక్కింది. ఎన్నో పాటలు రాస్తుంటం..కానీ కొన్ని పాటలు మాత్రమే ఎక్కువ కాలం గుర్తుంటాయి. ఇందులో అన్ని పాటలు అలా కుదరడం హ్యాపీగా ఉంది" అని చెప్పారు.

Updated Date - 2023-11-21T17:38:53+05:30 IST