కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Anasuya Bharadwaj : ఐదు రోజులుగా ఆ సమస్యతో ఇబ్బంది!

ABN, First Publish Date - 2023-09-16T20:50:17+05:30

సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ నెటజన్ల ట్రోలింగ్‌ గురయ్యే హాట్‌ యాంకర్‌ అనసూయ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. వైరల్‌ ఫీవర్‌తో ఆమె గత కొన్నిరోజులుగా బాధపడుతున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆమె వరుస ట్వీట్స్‌ చేశారు.

సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ నెటజన్ల ట్రోలింగ్‌ గురయ్యే హాట్‌ యాంకర్‌ అనసూయ (anasuya) స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. వైరల్‌ ఫీవర్‌తో (Viral fever) ఆమె గత కొన్నిరోజులుగా బాధపడుతున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆమె వరుస ట్వీట్స్‌ చేశారు. ‘‘వైరల్‌ ఫీవర్‌ కారణంగా ఐదు రోజుల నుంచి బాధపడుతున్నా. దాని వల్ల సోషల్‌ మీడియాలో ఎక్కువ సమయం ఉండటానికి వీలు కుదిరింది. ఈ వేదికగా ఎన్నో విషయాలు గుర్తించా. ఎదుటి వ్యక్తుల పట్ల దయ, జాలి లేకపోవడం చూశా. వేధింపులు మాత్రం బాగా కనిపిస్తున్నాయి. హుందాతనం లోపించడం కారణంగా మనం ఎటు వెళ్తున్నామని ఆశ్చర్యపోయా’’ అని ఆమె పేర్కొన్నారు. అంతే కాదు నెట్టింట జరిగే ఫ్యాన్‌ వార్స్‌ను ఉద్దేశించి ఆమె మాట్లాడింది. ‘‘సినీ పరిశ్రమలో ఇప్పుడు స్టార్‌ హోదాలో ఉన్న వారందరూ ఒకానొక సమయంలో ఎన్నో ఇబ్బందులు చవి చూసిన వారే. పీఆర్‌ ప్రమోషన్స్‌ లేకుండా.. ఎన్నో ఎత్తుపల్లాలు చూసి.. తమ సినిమాలతో అద్భుతమైన విజయాలు అందుకుని ఉన్నత స్థాయికి వచ్చారు. వారి ప్రయాణాన్ని గౌరవించాలి’’ అని అనసూయ నెటిజన్లను కోరారు.

Updated Date - 2023-09-16T20:50:17+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!