సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Anasuya: ఆగని ట్రోలింగ్‌ అయినా.. ఏ మాత్రం తగ్గట్లేదు

ABN, First Publish Date - 2023-06-06T16:10:00+05:30

రెండు మూడు రోజులుగా సోషల్‌ మీడియాలో హాట్‌ యాంకర్‌ అనసూయ చేస్తున్న రచ్చ గురించి తెలిసిందే! అనసూయ పెళ్లి రోజు సందర్భంగా భర్తతో కలిసి శనివారం థాయ్‌లాండ్‌ విహారానికి వెళ్లారు. వైట్‌ కలర్‌ బికినీ ధరించి భర్తతో కలిసి బీచ్‌లో చెలరేగిపోయింది. హద్దులు దాటి అందాలు ఒలకబోస్తూ యువత గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రెండు మూడు రోజులుగా సోషల్‌ మీడియాలో హాట్‌ యాంకర్‌ అనసూయ (Anasuya) చేస్తున్న రచ్చ గురించి తెలిసిందే! అనసూయ పెళ్లి రోజు సందర్భంగా భర్తతో కలిసి శనివారం థాయ్‌లాండ్‌ విహారానికి వెళ్లారు. అక్కడ ఓ బీచ్‌లో జబర్దస్‌ బ్యూటీ చేసి హడావిడి అంతా ఇంతా కాదు. వైట్‌ కలర్‌ బికినీ ధరించి భర్తతో కలిసి బీచ్‌లో చెలరేగిపోయింది. హద్దులు దాటి అందాలు ఒలకబోస్తూ యువత గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేసింది. భర్తను హగ్‌ చేసుకుని లిప్‌లాక్‌ చేసిన ఫొటోలు షేర్‌ చేసి హీటెక్కించింది. అలాగే భర్త గురించి ఓ ఎమోషనల్‌ పోస్ట్‌ కూడా చేసింది. ఇది మొదటి రోజు పోస్ట్‌ చేసిన ఫొటోల సంగతి. (Anasuya hot photos)

రెండో రోజు సోమవారం విషయానికొస్తే గ్లామర్‌ డోస్‌ మరింత పెంచింది. మొదటి రోజు ఫొటోలు శాంపిల్‌ మాత్రమే అన్నట్లు అసలు విషయం ఈ రోజు ఉంది అన్నట్లు మరో అడుగు ముందుకేసి సముద్ర తీరాన తన అందాలను ఆరబోసింది. అప్పటి వరకూ బికినీని టాప్‌తో కవర్‌ చేసిన ఆమె పూర్తి స్థాయి బికినీలో దర్శనమిచ్చింది. బికినీతో డాన్నులేస్తూ కనిపించింది. ఇక మూడో రోజు అయితే బ్యాక్‌లెస్‌ డ్రెస్‌తో కనిపించింది. బ్యాక్‌లెస్‌ టాప్‌ ధరించి వెనకపీటుగా కొంటె చూపు చూస్తోంది. అయితే గత రెండ్రోజులతో కంపేర్‌ చేస్తే ఈ రోజు కాస్త గ్లామర్‌ డోస్‌ తగ్గించిందనే చెప్పారు. అనసూయ పోస్ట్‌ చేసిన ఫొటోలన్నీ వైరల్‌ అవుతున్నాయి. మరో పక్క ఆమె ట్రోల్‌ చేస్తున్నారు. (Anasuya in Bikini)

అయితే ఇవన్నీ చూసిన కొందరు నెటిజన్లు ఆస్వాదిస్తుంటే మరికొందరు మాత్రం అనసూయను తిట్టి పోస్తున్నారు. ‘ఏంటీ వేషాలు’ అంటూ మండిపడుతున్నారు. ఇద్దరు పిల్లల తల్లివి ఇలా చేయడం కరెక్టేనా? పెళ్లిరోజు అయితే ఫ్యామిలీ మొత్తం కలిసి ఎంజాయ్‌ చేయండి.. మీ వ్యక్తిగత ఫొటోలు, అందులోనూ అంత హాట్‌ ఫొటోలు జనాలకు చూపించడం అవసరమా? అంటూ ఓ నెటిజన్‌ మండిపడ్డాడు. మరికొందరైతే అవకాశాల కోసమే అనసూయ ఇలా అందాలు ఆరబోస్తూ రెచ్చిపోతుందని కామెంట్లు చేస్తున్నారు. టీవీ యాంకరింగ్‌కు దూరంగా ఉన్నా...అనసూయకు సినిమాల్లో మంచి అవకాశాలే వస్తున్నాయి. ‘పుష్ప2’, విమానం తదితర చిత్రాల్లో నటిస్తున్నారు అనసూయ.

Updated Date - 2023-06-06T16:20:56+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!