Anasuya: ‘వూల్ఫ్’ టీజర్ విడుదల, ఇంకొక బోల్డ్ పాత్రలో అనసూయ

ABN , First Publish Date - 2023-08-03T17:49:39+05:30 IST

పాపులర్ యాంకర్, నటి అనసూయ ఇప్పుడు ఇంకొక బోల్డ్ పాత్రలో 'వూల్ఫ్' అనే సినిమాలో కనిపించనున్నారు. ఆ సినిమా టీజర్ ఈరోజు విడుదలైంది. అందులో అనసూయ పాత్ర వైవిధ్యంగా కనిపిస్తోంది. అలాగే ఇందులో ప్రభుదేవా, రాయి లక్ష్మి లు కూడా వైవిధ్యంగా కనిపిస్తున్నారు. టీజర్ ఆసక్తికరంగా వుంది.

Anasuya: ‘వూల్ఫ్’ టీజర్ విడుదల, ఇంకొక బోల్డ్ పాత్రలో అనసూయ
Anasuya from Wolf

తెలుగు నటి, యాంకర్, హోస్ట్, అనసూయ (Anasuya) ఇప్పుడు పాన్ ఇండియా సినిమాల్లో కూడా నటించి మెప్పించబోతోంది. ఇంతకు ముందు 'విమానం' #VImanam సినిమాలో ఒక బోల్డ్ పాత్ర చేసిన, అనసూయ ఇప్పుడు ‘వూల్ఫ్’ #Wolf అనే సినిమాలో ఇంకో బోల్డ్ పాత్రలో కనిపించబోతోంది అని అర్థం అవుతోంది. ఈ సినిమా టీజర్ ఈరోజు విడుదలైంది. ఇందులో అనసూయతో పాటు ప్రభుదేవా (PrabhuDeva), రాయ్ లక్ష్మీ (RaaiLaxmi)కూడా నటిస్తున్నారు.

wolfstill.jpg

వినూ వెంకటేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి సందేశ్ నాగరాజు, సందేశ్ ఎన్ నిర్మాతలు. ఇది ప్రభుదేవా కెరీర్‌లో 60వ సినిమాగా ఈ వూల్ఫ్ రాబోతోంది. ఈ సినిమా పాన్ ఇండియా సినిమాగా తమిళ, తెలుగు, కన్నడ , హిందీ భాషల్లో విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పుడు ఈ టీజర్‌ను కూడా అన్ని భాషల్లో విడుదల చేశారు.

anasuya-wolf2.jpg

ఈ 'వూల్ఫ్' టీజర్‌ను చూస్తే ఇది ఒక కథ అని అర్థం అవుతోంది, అలాగే అనసూయ ఇందులో ఇంకో కొత్త అవతారంలో కనబడబోతోంది అని కూడా తెలుస్తోంది. అలాగే ప్రభుదేవా కూడా కొత్త లుక్కులో బాగున్నాడు. అలాగే ఈ టీజర్ విజువల్స్ కూడా ఆసక్తికరంగా వున్నాయి. ఇలాంటి సినిమాలకి నేపధ్య సంగీతం బాగుంటునే విజువల్స్ చూడగలం, ఈ టీజర్ లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా నెక్ట్స్ లెవెల్‌లో ఉంది. తెలుగు ప్రేక్షకుల్లో అనసూయ కి చాలా క్రేజ్ వుంది, అందుకని ఆమె గెటప్, ఆమె ఎలాంటి పాత్ర చేస్తోంది అనే విషయం మీద ప్రేక్షకులకి ఈ టీజర్ చూసా సినిమా మీద ఆసక్తిని పెంచుతుంది. ఈ సినిమాకి అమ్రిష్ సంగీత దర్శకుడిగా పని చేశారు.

Updated Date - 2023-08-03T17:49:39+05:30 IST