Anasuya Bharadwaj: కంటతడికి పెద్ద కహానీ చెప్పిందిగా..!

ABN , First Publish Date - 2023-08-19T20:16:59+05:30 IST

నటి అనసూయ బోరున ఏడుస్తూ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన వీడియో వైరల్‌ అయిన సంగతి తెలిసిందే. దానికి జతగా ఓ నోట్‌ కూడా పోస్ట్‌ చేసింది. అయితే ఆన్‌లైన్‌లో నెగెటివిటీ వల్లే ఆమె కన్నీటిపర్యాంతమైనట్లు సోషల్‌ మీడియాలో ప్రచారం జరిగింది. దీనిపై వివరణ ఇస్తూ అనసూయ మరో పోస్ట్‌ పెట్టింది.

Anasuya Bharadwaj: కంటతడికి పెద్ద కహానీ చెప్పిందిగా..!

నటి అనసూయ బోరున ఏడుస్తూ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన వీడియో వైరల్‌ అయిన సంగతి తెలిసిందే. దానికి జతగా ఓ నోట్‌ కూడా పోస్ట్‌ చేసింది. అయితే ఆన్‌లైన్‌లో నెగెటివిటీ వల్లే ఆమె కన్నీటిపర్యాంతమైనట్లు సోషల్‌ మీడియాలో ప్రచారం జరిగింది. దీనిపై వివరణ ఇస్తూ అనసూయ మరో పోస్ట్‌ పెట్టింది. ‘‘నేను చేసినపోస్ట్‌ను చాలామంది బాగానే అర్థం చేసుకున్నారు. కొందరు మాత్రం మిస్‌ అండర్‌స్టాండ్‌ చేసుకున్నారు. వారికి అర్థం కాలేదో.. లేక పైపైనే చదివారో నాకు తెలియదు. మరోసారి చదువుకోండి. సోషల్‌ మీడియాలో ట్రోలింగ్‌ అనేది నన్ను ఏ మాత్రం ప్రభావితం చేయదు. ఆ ట్రోల్స్‌కు బాధపడను. పబ్లిక్‌లో ఉన్నప్పుడు అవన్నీ సహజం. సోషల్‌ మీడియాలో జరిగే రాద్దాంతానికి నా ఫీలింగ్‌ ఏడుపుతో ఉండదు కోపంతో ఉంటుంది. నా వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఓ నిర్ణయం తీసుకున్నప్పుడు నేను కన్నీళ్లు పెట్టుకున్నా. దాన్ని ఎప్పటికీ మర్చిపోకూడదనుకున్నా. నవ్వులు, సంతోషకరమైన ఆలోచనలు మాత్రమే ప్రజెంట్‌ చేేస క్రమంలో మేము ఎంతో ఒత్తిడికి గురవుతాం. ట్రోలింగ్‌ వల్ల బాధపడే వీక్‌ పర్సన్‌ కాదు నేను’’ అని వివరణ ఇచ్చింది.

అయితే ఈ వీడియోపై కూడా అనసూయను ట్రోల్‌ చేశారు తాజాగా వివరణ ఇచ్చిన వీడియోపై ట్రోలింగ్‌ జరుగుతోంది. పలువురు చేసిన ట్వీట్‌లకు అనసూయ సమాధానమిచ్చారు. ‘మీరు త్వరగా ఓ నిర్ణయానికి రాకుండా ఉండాల్సింది. ఊహాగానాలను హెడ్‌లైన్స్‌గా పెట్టకుండా ఉండాల్సింది. నేను పంచుకున్న సమాచారం అర్థం కాకపోతే రెండుసార్లు చదువుకోవాల్సింది. అందరి దృష్టిని ఆకర్షించడం కోసం నేను ఈ పోస్ట్‌ పెట్టానని అంటున్నారు. మనం ఈ సోషల్‌ మీడియాలో ఉన్నది ఇతరుల అటెన్షన్‌ కోసం. నాకు సంబంధించిన ప్రతి అంశంలోనూ నాకు అటెన్షన్‌ కావాలి’’ అని ట్వీట్‌లకు రిప్లై ఇచ్చింది అనసూయ.


ఈ వీడియో కన్నా ముందు ఏడుస్తూ పెట్టిన పోస్ట్‌లో ఏం చెప్పిందంటే..‘‘ప్రపంచవ్యాప్తంగా విశ్వవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరూ కమ్యూనికేట్‌ కావడం.. ఒకరికొకరు సంతోషాన్ని.. సమాచారాన్ని.. సంస్కృతి, సంప్రదాయాలకు సంబంధించిన విషయాలను, మన లైఫ్‌ స్టైల్‌ను పంచుకోవడం కోసమే సోషల్‌ మీడియా ఉందని నేను అనుకుంటాను. ప్రస్తుతం మనమున్న రోజుల్లో ఆ వేదికల్ని ఎవరూ అందుకు ఉపయోగించడం లేదు. ఫొటోషూట్స్‌.. నవ్వులు. డ్యాన్సులు, స్ర్టాంగ్‌ కౌంటర్స్‌.. కమ్‌బ్యాక్స్‌ ఇలా అన్ని ఇక్కడ నా జీవితంలో భాగమే! నా జీవితానికి సంబంధించిన అన్ని విషయాలను మీతో ఈ వేదికగా పంచుకుంటున్నా. సమస్యలు ఎదురైనప్పుడు బలహీనతకు లోనై కన్నీళ్లు పెట్టుకుంటా. ప్రతి ఒక్కరిలో అది సహజగుణం. ఒక పబ్లిక్‌ ఫిగర్‌గా ఉన్నప్పుడు తటస్థ భావాలు, ఆలోచలను అనుసరించేందుకు నా పై ఒత్తిడి ఉంటుంది. ఇక్కడ మీకు కనిపిస్తున్నది నా నిజమైన బలం కాదు. నా బలహీనతను పంచుకోవడం శక్తి, వ్యతిరేకతను అంగీకరించే ధైర్యమే నా బలం. సమస్యలు ఎదురైనా సరే ఆ బాధను పోగొట్టుకొని, కొద్దిరోజుల తర్వాత చిరునవ్వుతో మళ్లీ సవాళ్లను ఎదుర్కోవాలి. విశ్రాంతి తీసుకుని.. మనల్ని మనం రీచార్జ్‌ చేసుకొని తిరిగి రావాలి. అంతేకానీ పారిపోకూడదు. ఎదుటి వ్యక్తిపై చేసే కామెంట్లు వాళ్లను తీవ్రంగా ఇబ్బంది పెట్టొచ్చు. దయచేసి ఎదుటివారి పట్ల దయతో ఉండండి. ఈ విషయాన్ని నేను కష్టపడి నేర్చుకున్నా. ఇప్పుడు నేను బాగానే ఉన్నా. దాదాపు ఐదు రోజుల క్రితం నేను ఈ బాధను అనుభవించా. ఆ బాధను గుర్తుపెట్టుకోవడం కోసమే దీన్ని రికార్డ్‌ చేశా’’ అని అనసూయ పేర్కొన్నారు.

Updated Date - 2023-08-19T20:20:39+05:30 IST