Anasuya Bharadwaj: వాళ్ల పిలుపులో అర్థం వేరు.. అందుకే..

ABN , First Publish Date - 2023-04-03T12:44:27+05:30 IST

వీజేగా కెరీర్‌ ప్రారంభించిన అనసూయ భరద్వాజ్‌ (Anasuya Bharadwaj) అటు యాంకర్‌గా, ఇటు సినిమాల్లో నటిగా దూసుకెళ్తున్నారు.

Anasuya Bharadwaj: వాళ్ల పిలుపులో అర్థం వేరు.. అందుకే..

వీజేగా కెరీర్‌ ప్రారంభించిన అనసూయ భరద్వాజ్‌ (Anasuya Bharadwaj) అటు యాంకర్‌గా, ఇటు సినిమాల్లో నటిగా దూసుకెళ్తున్నారు. అయితే కొన్నాళ్లుగా ఆమె టీవీ యాంకర్‌గా కనిపించడం లేదు. ప్రస్తుతం మంచి కథ ఉన్న సినిమాల వైపే దృష్టి పెట్టారు. టీవీ షోలో ఎందుకు కనిపించడం లేదు అన్న ప్రశ్నకు ఆమె దీటైన సమాధానం ఇచ్చారు. ‘టీఆర్‌పీల కోసం చేసే స్టంట్స్‌ (Trp stunts) ఎప్పుడేతై మానతారో అప్పుడు యాంకరింగ్‌లోకి వస్తానని’ చెప్పారు. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే అనసూయ మహిళలకు ఏదైన సమస్య వచ్చినా, కించపరిచేలా మాట్లాడినా వెంటనే స్పందిస్తారు. ఇలా స్పందించి ఎన్నో సందర్భాల్లో ఆమె ట్రోల్‌ అయ్యారు కూడా. ఆదివారం సాయంత్రం ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అభిమానులతో ముచ్చటించారు. ఫ్యాన్స్‌ ప్రశ్నలకు ఆసక్తికర (Conversation with Netizens) సమాధానాలిచ్చారు అనసూయ. ఓ నెటిజన్‌ ‘అక్కా మిమ్మల్ని ఎవరైనా ఆంటీ అంటే ఎందుకంత కోపం వస్తుంది’ అని ప్రశ్నించగా, ‘‘ఎందుకంటే అలా పిలిచే వాళ్ల అర్థాలు వేరే ఉంటాయి. అయితే ఇప్పుడు నాకు కోపం రావట్లేదు. అది వాళ్ల ఖర్మకే వదిలేస్తున్నా. అవన్నీ పట్టించుకోవడానికి నాకు తీరికలేదు. చాలా ముఖ్యమైన పనులతో బిజీగా ఉంటున్నా. ఆ కామెంట్ల జోలికి వెళ్లడం లేదు. అసలు పట్టించుకోవడం లేదు. అయితే నేనేమీ సైలెంట్‌గా లేను. కొంచెం ఫోకస్‌ మార్చాను. మాట్లాడాల్సిన సందర్భం వస్తే.. నన్ను నేనే కంట్రోల్‌ చేసుకోలేను’’ అని అన్నారు. ‘రంగ మార్తాండ’ (Ranga marthanda) విజయం పట్ల ఆనందం వ్యక్తం చేశారు అనసూయ.

తన కొత్త చిత్రాలకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఈ నెల రెండో వారంలో కొత్త సినిమా షూటింగ్‌ ప్రారంభమవుతుందని తెలిపారు. టీవీ షోలు, ప్రారంభోత్సవాలు, యాడ్స్‌, సినిమాల కన్నా తన కుటుంబానికే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు చెప్పారు.

Updated Date - 2023-04-03T12:52:50+05:30 IST