Deverakonda: ఆనంద్ ఈసారి తమిళ దర్శకుడితో 'డ్యూయట్'

ABN , First Publish Date - 2023-11-02T13:04:07+05:30 IST

'బేబీ' సినిమా విజయం తరువాత ఆనంద్ దేవరకొండ తమిళ దర్శకుడు అయిన మిథున్ తో 'డ్యూయట్' అనే సినిమాకి చెయ్యి కలిపారు. ఈరోజు ఈ సినిమా ప్రారంభం అయింది, ఆనంద్ అన్న విజయ్ దేవరకొండ ప్రత్యేక అతిధిగా వచ్చారు. జ్ఞానవేల్ రాజా ఈ సినిమాకి నిర్మాత.

Deverakonda: ఆనంద్ ఈసారి తమిళ దర్శకుడితో 'డ్యూయట్'
Anand and Vijay Deverakonda

'బేబీ' #Baby సినిమా బ్లాక్ బస్టర్ తో ఆనంద్ దేవరకొండ (AnandDeverakonda) కూడా తన అన్న విజయ్ దేవరకొండ (VijayDeverakonda)లా స్టార్ అయిపోయాడు. ఇప్పుడు ప్రముఖ నిర్మాత జ్ఞానవేల్ రాజా (GnanavelRaja) ఆనంద్ దేవరకొండ కథానాయకుడిగా ఈరోజు కొత్త సినిమాకి శ్రీకారం చుట్టాడు. దీనికి తమిళ దర్శకుడు మిథున్ (Mithun) దర్శకత్వం వహిస్తున్నారు. ఇది అతని మొదటి సినిమా దర్శకుడిగా. ఇందులో రితిక నాయక్ (RitikaNayak) కథానాయకురాలు. ఆమె ఇంతకు ముందు 'అశోకవనంలో అర్జున కళ్యాణం' సినిమా చేసింది.

ఈ సందర్భంగా ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ ఇది ఒక లవ్ స్టోరీ అని చెప్పాడు. "ఈ 'డ్యూయట్' #Duet టైటిల్ రిజిస్టర్ చేసుకున్నప్పుడు పరిశ్రమలోని చాలామంది స్నేహితులు ఈ టైటిల్ చాలా బాగుంది, మాకెందుకు ఈ ఆలోచన రాలేదు అని అడిగారు. అక్కడే మాకు మొదటి పాజిటివ్ మాటలు వచ్చాయి. నిర్మాత జ్ఞానవేల్ రాజా, సూర్య (Suriya), కార్తీ (Karthi) తో చాలా సినిమాలు చేస్తూ వుంటారు. ఇప్పుడు నాతో చెయ్యడం చాలా సంతోషం. అలాగే ఆ ఇద్దరి అన్నదమ్ములతో ఎలా చేశారో, నాతో, అన్నతో కూడా అలాగే సినిమాలు చేస్తారని కోరుకుంటున్నా," అని చెప్పాడు. ఇది నాకు స్పెషల్ సినిమా.

anand-duet1.jpg

నేను జీవీ ప్రకాష్ (GVPrakashKumar) కి పెద్ద అభిమానిని. అతను నా సినిమాకి సంగీతం అంటే నాకు అది పెద్ద గౌరవం. నేను అతని 'ఆడుకాలం' #Aadukalam సినిమా నుండి అతని పెద్ద అభిమానిని, ఇప్పుడు అతను నా సినిమాకి సంగీతం అతను ఇస్తున్నాడు అంటే చాలా సంతోషంగా వుంది అని చెప్పాడు ఆనంద్ దేవరకొండ.

ఇప్పుడు జ్ఞానవేల్ రాజా రెండు పెద్ద సినిమాలు 'తంగలాన్' #Thangalaan, 'కంగువా' #Kanguva తో చాలా పెద్ద సినిమాలతో బిజీగా వున్నారు. ఇప్పుడు తెలుగు సినిమాలు కూడా చాలా లైన్ లో వున్నాయి. ఇప్పుడు అతను మా 'డ్యూయట్' చెయ్యడం సంతోషంగా వుంది. ఈ సినిమాకి మధుర శ్రీధర్ (MadhuraSreedharReddy) కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. ఆనంద్ అన్నయ్య విజయ్ దేవరకొండ (VIjayDeverakonda) ప్రత్యేక అతిధిగా వచ్చి ఈ సినిమాని లాంచ్ చేశారు.

Updated Date - 2023-11-02T13:07:48+05:30 IST