Amigos Twitter Review: కల్యాణ్‌ రామ్ మూవీ హిట్టా?.. ఫట్టా?..

ABN , First Publish Date - 2023-02-10T09:22:02+05:30 IST

కొత్త దర్శకులకు అవకాశమిచ్చే హీరో ఎవరంటే వెంటనే గుర్తొచ్చే అతి కొద్దిమందిలో నందమూరి కల్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) ఒకరు. ఇటీవలే ‘బింబిసార’ (Bimbisara)కి వశిష్ట అనే కొత్త దర్శకుడికి అవకాశమిచ్చి సూపర్ హిట్ సాధించాడు.

Amigos Twitter Review: కల్యాణ్‌ రామ్ మూవీ హిట్టా?.. ఫట్టా?..
Amigos

కొత్త దర్శకులకు అవకాశమిచ్చే హీరో ఎవరంటే వెంటనే గుర్తొచ్చే అతి కొద్దిమందిలో నందమూరి కల్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) ఒకరు. ఇటీవలే ‘బింబిసార’ (Bimbisara)కి వశిష్ట అనే కొత్త దర్శకుడికి అవకాశమిచ్చి సూపర్ హిట్ సాధించాడు. తాజాగా మరో కొత్త దర్శకుడు రాజేంద్ర రెడ్డితో డైరెక్షన్‌లో చేసిన చిత్రం ‘అమిగోస్’ (Amigos). మనిషిని పోలిన మనుషులు (డోపర్‌గ్యాంగర్) ఉంటే ఎలా ఉంటుందనే కొత్త కాన్సెప్ట్‌తో ఈ మూవీ తెరకెక్కింది. టీజర్, ట్రైలర్ విడుదలై మంచి ఆదరణ పొందడంతో ఈ మూవీపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ తరుణంలోనే ఈ మూవీ నేడు (ఫిబ్రవరి 10న) ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్‌లో విడుదల అయ్యింది. ఇప్పటికే ఈ చిత్ర ప్రీమియర్ షోలు పలు చోట్ల పడిపోయాయి. దీంతో ఈ మూవీ రివ్యూలను ట్విట్టర్‌లో రాసుకొచ్చారు. (Amigos Twitter Review)

‘పాత్రల పరిచయం, ఇంటర్వెల్ పర్వాలేదు. మొత్తంగా ఫస్ట్ హాఫ్ సాధారణంగా ఉంది. మంచి స్క్రీన్‌ప్లే యాక్షన్ సీన్స్, కైమాక్స్.. సెకండ్ హాఫ్ బావుంది. ఓవరాల్‌గా 3/5. కల్యాణ్ రామ్‌కి మరో హిట్ దక్కింది’ అని ఒకరు తెలిపారు. ‘సినిమా పూర్తైంది. 3.5/5. 2వ సగంలో అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. చాలా బాగుంది. దర్శకుడికి గొప్ప తొలిచిత్రం అవుతుంది. ఇలాంటి విభిన్న కథలను ఎంచుకుంటున్నందుకు నందమూరి కల్యాణ్ రామ్‌‌కు ధన్యవాదాలు. ఈ మూవీ కథ గురించి ఎన్టీఆర్ చెప్పింది నిజమే. ఆషికా రంగనాథ్ అందంగా ఉంది’ మరొకరు రాసుకొచ్చారు. మిగిలిన వారు ట్విట్టర్ వేదిగా ఏమంటున్నారో చూద్దాం..

Updated Date - 2023-02-10T09:45:35+05:30 IST